బళ్ళం బీడుకు చెందిన నాలుగువందల ఎకరాల సారవంతమైన భూమిని బంబామానియాణి నుండి కొనుక్కొని తన చేతిలోనికి తెచ్చుకొన్న దినం బేళకట్ట రామచంద్ర పై తన తాత విట్టుపైని మరీ మరీ గుర్తు చేసుకొన్నాడు. ఈ వైపు భూభాగం ఎక్కడైనా ఒక్క ముక్క భూమిని తనదిగా చేసుకోవాలని విట్టుపైకి చాలా ఆశగా వుండేది. ఆ ఆశను తన మనుమడికి చెప్పే ప్రతిసారీ తన తండ్రి మళప్పయ్య, తాత నరసప్పయ్యలు జీవితాన్ని గడిపిన రీతిని విట్టు పై వివరంగా చెప్పే పద్ధతోకటుండేది. ఆ దుర్భర పరిస్థితుల్లోనూ, తన భూమి, తన జనులు అంటూ వారు పట్టుపట్టడం గురించి విట్టు పై సగం భాగం గర్వంగా, మిగిలిన సగం వేదనగా చెప్పేవాడు. ఎల్లప్పుడూ ఇలాంటి కథలు. తన కాలంలో మీదబడి వచ్చిన దుర్గతిని గురించి పరితపించడంలో అంతమవుతుండేది.
- గోపాలకృష్ణ, గుత్తి చంద్రశేఖర రెడ్డి