యార్లగడ్డ భాష మట్టి లోపలికి దిగిన చెట్లవేర్లలా బలమయిన పట్టు కలిగింది. చిన్నాచితకాలకది సడలదు. ఆయన పదచిత్రాలు వజ్రాలు పొదిగిన ఉంగరం లాంటివి. వాటిల్లో కాంతి, దృఢత్వం ఉన్నాయి.
ఈ ప్రపంచం తలకిందులయినా, ఎంత హైటెక్ మార్పులు వచ్చినా, ఎన్నెన్ని ఉపద్రవాల ఉప్పెనలు వచ్చినా నిర్మలంగా ఉన్న మట్టికి నమస్కరించే కవి, మట్టిని పరిమళించే మనిషి యార్లగడ్డ.
అతడు మట్టి నుంచే వచ్చిన పువ్వు. ప్లాస్టిక్ పువ్వు కాదు. ఈ పదనిర్మాణ శిల్పి హృదయతంత్రుల్ని మీటుతాడు. మానవత్వాన్ని గుబాళించే పాటలు పాడుతాడు. అతడి ఆలోచనల్లో, అనుభూతుల్లో అరువు తెచ్చుకున్న సరుకు లేదు. తెలుగు నేల వెలుగు చీకట్లని తేటతెలుగులో, ఒక్కోసారి చిక్కని తెలుగులో ప్రదర్శిస్తాడు. జున్నులాంటి,, గడ్డ పెరుగు లాంటి గాఢమయిన ఇతడి భావుకత్వం కవితాప్రియులు ఆదరించదగింది.
యార్లగడ్డ భాష మట్టి లోపలికి దిగిన చెట్లవేర్లలా బలమయిన పట్టు కలిగింది. చిన్నాచితకాలకది సడలదు. ఆయన పదచిత్రాలు వజ్రాలు పొదిగిన ఉంగరం లాంటివి. వాటిల్లో కాంతి, దృఢత్వం ఉన్నాయి. ఈ ప్రపంచం తలకిందులయినా, ఎంత హైటెక్ మార్పులు వచ్చినా, ఎన్నెన్ని ఉపద్రవాల ఉప్పెనలు వచ్చినా నిర్మలంగా ఉన్న మట్టికి నమస్కరించే కవి, మట్టిని పరిమళించే మనిషి యార్లగడ్డ. అతడు మట్టి నుంచే వచ్చిన పువ్వు. ప్లాస్టిక్ పువ్వు కాదు. ఈ పదనిర్మాణ శిల్పి హృదయతంత్రుల్ని మీటుతాడు. మానవత్వాన్ని గుబాళించే పాటలు పాడుతాడు. అతడి ఆలోచనల్లో, అనుభూతుల్లో అరువు తెచ్చుకున్న సరుకు లేదు. తెలుగు నేల వెలుగు చీకట్లని తేటతెలుగులో, ఒక్కోసారి చిక్కని తెలుగులో ప్రదర్శిస్తాడు. జున్నులాంటి,, గడ్డ పెరుగు లాంటి గాఢమయిన ఇతడి భావుకత్వం కవితాప్రియులు ఆదరించదగింది.© 2017,www.logili.com All Rights Reserved.