నా అనుభవాలను, అనుభూతులనూ కథలుగా చెప్పాలనే తపన నా విద్యార్థి దశ నుంచీ మొదలైంది. మద్దాలి ఛాయాదేవి పేరుతో నేను రాసిన కథ ఒకటి నిజాం కాలేజ్ పత్రిక 'విద్యార్థి' లో 1952-53 లో ప్రచురితమైంది. కుటుంబంలో పురుషాధిపత్యం ఎలా ఉండేదో, అందులోనే స్త్రీలు ఆనందాన్ని ఎలా వెతుక్కున్నారో ఆ కథలో చిత్రించాను. వైవాహిక జీవితంలోని మంచి చెడులను విశ్లేషిస్తూ రాసిన కథ ఒకటి 1955 లో 'తెలుగు స్వతంత్ర' లో వచ్చింది.
ఒక దశాబ్దం తరువాత రాసిన 'ప్రయాణం' కథతో పాఠకుల గుర్తింపు పొందాను. 'ప్రయాణం' కథ మొదలుకొని 'పరిధి దాటిన వేళ' వరకూ నా కథా ప్రస్థానంలో నాతో పాటు ప్రయాణించిన పాఠకులు గుర్తించుకున్న మైలు రాళ్ళు కొన్ని ఉన్నాయి.
- అబ్బూరి ఛాయాదేవి