చరిత్రను మోసే ధరిత్రిలో ఎన్నో ఇజాలు పురుడోసుకున్న ఈ నేలలో అనేక భావాలు, భావ జాలాలు కొనసాగుతున్నాయి. ఆ భావాలను బలపరిచే అనేక వాదాలున్నయి. కొన్ని వాదాలు కొంత మందికి వేదాలు. మరి కొంత మందికి పిడివాదాలు. వాదమేదైనా ప్రతీ మనుష్యుని అసమానతలు లేని సమతలంలో సమంగా, సమాన గౌరవంగా అత్యున్నత శిఖరాయమానంగా నిలిపినపుడే ఆ వాదానికి మనుగడ. ఆ వాదం గమ్యానికి, గమనానికి, లక్ష్యానికి సార్థకత.
వాదాలు కొన్ని కుట్ర పూరితాలు. స్వార్థాలు. సన్మార్గం పేరిట వంచిస్తున్న దుర్మార్గాలు. ఏ వాదంలో ఎవరి ప్రయోజనాలవైపున్నాయో తెలుసుకోవాల్సిందే. తేల్చుకోవాల్సిందే. లెక్క సరిచూసుకోవాల్సిందే. స్వార్థ ప్రయోజనాలను పసిగట్టకపోతే మోసపోతూనే ఉంటాం. మోసాలను, మోసాలు చేసే వేషాలను రేషంతో చెక్కిళ్లు పట్టి షేరు గుద్ది గుణానికి తేవాల్సిందే. అది అక్షరీకరణలో ఇంకా జాగరూకతను ప్రదర్శించాల్సిందే.
అక్షరాలకు దూరం చేయబడిన దుర్బల జాతులు తమ అస్తిత్వాన్ని ప్రకటించలేక అంధకారంలో మగ్గిపోయాయి. అంబేడ్కర్ ఇచ్చిన వాస్తవ దృక్పథంలోంచి చీకట్లోని జీవితాల వెలుగును అక్షర కాంతిలో వాస్తవాలను ప్రకటిస్తున్నాయి. ప్రకటించాలని తహతహలాడుతూనే ఉన్నాయి.