షడ్రుచుల కథా విందు
భూమిని హిరణ్యాక్షుడు చాపలా చుట్టి సముద్రంలోకి విసిరేశాడని చెప్పాయి పురాణాలు!
కాదు.. కాదు.. భూమి గుండ్రంగా ఉందని చెప్పింది సైన్సు!
కానీ మన కాలపు మహా రచయిత పతంజలి మాత్రం 'భూమి పోలీసోడి చేతిలోని లారీలా ఉంటుంద'ని చెప్పాడు.
ఇది పరమ కఠోరమైన జీవిత వాస్తవం!!!
పరేశ్ దోశీ అనువాద కథలు ఇలాంటి 'కఠోర జీవిత వాస్తవాలు' ఎన్నింటినో మన కళ్ళ ముందు ఉంచుతాయి. లౌకిక విషాదాలను మన ముందు నగ్నంగా నిలబెడతాయి.
ఏ కథ అని చెప్పను? ఏ రచయిత అని చెప్పను?
అందరూ మహానుభావులే.. కథాప్రపంచ వైతాళికులే!
అలనాటి నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ నుంచి ఆర్.కె. నారాయణ్, ఆశాపూర్ణాదేవి, యశపాల్, అమృతా ప్రీతమ్, అనితా దేశాయ్ వంటి ఎందరెందరో జగత్ జెట్టీల కథలు ఇందులో ఉన్నాయి.
'చెవి పోయినా పర్వాలేదు.. చెయ్యి పోయినా పర్వాలేదు.. ఆఖరికి కన్ను పోయినా ఫికర్లేదు' అని ఉదాసీనంగా ఉన్న ఓ వ్యాపారి 'ఏది పోయినప్పుడు' గంగ వెర్రులు ఎత్తాడో తెలిస్తే కొయ్యబారి పోతాం ఉర్దూ కథా సమ్రాట్ కిషన్ చందర్ 'దొంగతనం' కథ చదివినప్పుడు!
సగటు మనిషి తత్వాన్ని అత్యంత వ్యంగ్యంగా తీర్చిదిద్దడంలో ఆయనను మించినవారెవరు?.............
షడ్రుచుల కథా విందు భూమిని హిరణ్యాక్షుడు చాపలా చుట్టి సముద్రంలోకి విసిరేశాడని చెప్పాయి పురాణాలు! కాదు.. కాదు.. భూమి గుండ్రంగా ఉందని చెప్పింది సైన్సు! కానీ మన కాలపు మహా రచయిత పతంజలి మాత్రం 'భూమి పోలీసోడి చేతిలోని లారీలా ఉంటుంద'ని చెప్పాడు. ఇది పరమ కఠోరమైన జీవిత వాస్తవం!!! పరేశ్ దోశీ అనువాద కథలు ఇలాంటి 'కఠోర జీవిత వాస్తవాలు' ఎన్నింటినో మన కళ్ళ ముందు ఉంచుతాయి. లౌకిక విషాదాలను మన ముందు నగ్నంగా నిలబెడతాయి. ఏ కథ అని చెప్పను? ఏ రచయిత అని చెప్పను? అందరూ మహానుభావులే.. కథాప్రపంచ వైతాళికులే! అలనాటి నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ నుంచి ఆర్.కె. నారాయణ్, ఆశాపూర్ణాదేవి, యశపాల్, అమృతా ప్రీతమ్, అనితా దేశాయ్ వంటి ఎందరెందరో జగత్ జెట్టీల కథలు ఇందులో ఉన్నాయి. 'చెవి పోయినా పర్వాలేదు.. చెయ్యి పోయినా పర్వాలేదు.. ఆఖరికి కన్ను పోయినా ఫికర్లేదు' అని ఉదాసీనంగా ఉన్న ఓ వ్యాపారి 'ఏది పోయినప్పుడు' గంగ వెర్రులు ఎత్తాడో తెలిస్తే కొయ్యబారి పోతాం ఉర్దూ కథా సమ్రాట్ కిషన్ చందర్ 'దొంగతనం' కథ చదివినప్పుడు! సగటు మనిషి తత్వాన్ని అత్యంత వ్యంగ్యంగా తీర్చిదిద్దడంలో ఆయనను మించినవారెవరు?.............© 2017,www.logili.com All Rights Reserved.