భారత దేశంలోని విభిన్న సంస్కృతులను - వాటిలో నిక్షిప్తమై ఉన్న విశ్వాసాలూ, ఆచార్య వ్యవహారాలతో సహా తెలుసుకోడానికి మన దేశం ఈ చివర నుండి ఆ చివర వరకు మోటార్ సైకిల్ పై ప్రయాణించడం అనేది ఆత్మీయమైన పద్ధతి.
దుమ్మూ, ధూళీ, ఎండా, వేడీ ఉండే దేశంలోని మైదానాల గుండా ఈ పుస్తకం మిమ్మల్ని నడిపిస్తుంది. మిమ్మల్ని ప్రపంచం లోనే ఎత్తైన మోటారబుల్ రోడ్ - లడాఖ్ లోని "ఖార్దుంగ్ లా"కి తీసుకువెడుతుంది.
దారిలో మీకు ఓ సూఫీ సాధువు కనిపిస్తాడు, నకిలీ బాబాలు, ఇంటి బెంగతో ఉన్న సైనికులు కనబడతారు "నడిరోడ్డు నది" లాంటి దారిలో మీరు ఇరుక్కుపోతారు. కానీ అద్భుతమైన రీతిలో రక్షించబడతారు.
కాశ్మీర్ లో సగటు మనిషి రోజూ అనుభవించే మానసిక ఒత్తిడి మీరూ అనుభవిస్తారు.
ఆచారాలని, తర్క రహిత మైన విశ్వాసాలని ఆలోచించకుండా పాటిస్తే - మతం ఎంత గుడ్డిగా, ఎంత ప్రమాదకరంగా మారుతోందో మీరు గ్రహిస్తారు.
దేశపు రహదారులపై అందరూ ఎంత స్నేహంగా ఉంటారో, ఎంత చక్కని ఆతిథ్యమిస్తారో మీకు తెలుస్తుంది.
ఈ పుస్తకం మీకు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ప్రయాసతో కూడిన బైక్ ప్రయాణం కాస్తోకూస్తో అలసటని కూడా కలిగిస్తుంది.
ఓ అద్భుతమైన నిజ జీవిత సాహస యాత్ర గురించి హాస్య చతురతతోనూ, నిశితాలోచనతోనూ, నిజాయితీతోనూ రాసిన ఈ పుస్తకం చివరి దాకా ఆసక్తిగా చదివిస్తుంది.
మొత్తం ప్రయాణంలో మీరు కూడా బైక్ వెనుక సీట్ లో కూర్చుని ప్రయాణించిన అనుభూతిని మిగుల్చుతుంది.
- కొల్లూరి సోమ శంకర్
భారత దేశంలోని విభిన్న సంస్కృతులను - వాటిలో నిక్షిప్తమై ఉన్న విశ్వాసాలూ, ఆచార్య వ్యవహారాలతో సహా తెలుసుకోడానికి మన దేశం ఈ చివర నుండి ఆ చివర వరకు మోటార్ సైకిల్ పై ప్రయాణించడం అనేది ఆత్మీయమైన పద్ధతి. దుమ్మూ, ధూళీ, ఎండా, వేడీ ఉండే దేశంలోని మైదానాల గుండా ఈ పుస్తకం మిమ్మల్ని నడిపిస్తుంది. మిమ్మల్ని ప్రపంచం లోనే ఎత్తైన మోటారబుల్ రోడ్ - లడాఖ్ లోని "ఖార్దుంగ్ లా"కి తీసుకువెడుతుంది. దారిలో మీకు ఓ సూఫీ సాధువు కనిపిస్తాడు, నకిలీ బాబాలు, ఇంటి బెంగతో ఉన్న సైనికులు కనబడతారు "నడిరోడ్డు నది" లాంటి దారిలో మీరు ఇరుక్కుపోతారు. కానీ అద్భుతమైన రీతిలో రక్షించబడతారు. కాశ్మీర్ లో సగటు మనిషి రోజూ అనుభవించే మానసిక ఒత్తిడి మీరూ అనుభవిస్తారు. ఆచారాలని, తర్క రహిత మైన విశ్వాసాలని ఆలోచించకుండా పాటిస్తే - మతం ఎంత గుడ్డిగా, ఎంత ప్రమాదకరంగా మారుతోందో మీరు గ్రహిస్తారు. దేశపు రహదారులపై అందరూ ఎంత స్నేహంగా ఉంటారో, ఎంత చక్కని ఆతిథ్యమిస్తారో మీకు తెలుస్తుంది. ఈ పుస్తకం మీకు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ప్రయాసతో కూడిన బైక్ ప్రయాణం కాస్తోకూస్తో అలసటని కూడా కలిగిస్తుంది. ఓ అద్భుతమైన నిజ జీవిత సాహస యాత్ర గురించి హాస్య చతురతతోనూ, నిశితాలోచనతోనూ, నిజాయితీతోనూ రాసిన ఈ పుస్తకం చివరి దాకా ఆసక్తిగా చదివిస్తుంది. మొత్తం ప్రయాణంలో మీరు కూడా బైక్ వెనుక సీట్ లో కూర్చుని ప్రయాణించిన అనుభూతిని మిగుల్చుతుంది. - కొల్లూరి సోమ శంకర్© 2017,www.logili.com All Rights Reserved.