ఆది' యందు నారాయణుడుండెను - ఆమెన్!
తాడి ప్రకాష్
కథ చెబుతాం. నవల రాస్తాం. ఒక సినిమా చూస్తాం. ఒక అందమైన ప్రదేశానికో, ఇతర దేశానికో వెళ్ళి ఆ అనుభవాన్ని రాస్తాం. దాన్ని ట్రావెలోగ్ అంటాం.
ఏదైనా చెప్పటమే ముఖ్యం. ఇంతకు ముందు చాలా మంది రాసి ఉన్నారు. ఇంకా బాగా చెప్పగలగాలి. గుచ్చుకొనేలా, హృదయానికి హత్తుకొనేలా.
ఒక వెలుతురు కిరణమేదో గుండెని తాకినట్టూ ఉండాలి. తిరిగి తిరిగీ కాళ్ళు అరిగిన ఈ ఆదినారాయణ అలా అందంగా రాయటంలో చెయ్యి తిరిగిన వాడు. ఏదేశమేగినా, ఎందుకాలిడినా, రోడ్లమీదే నడిచి, చరిత్రని తవ్వి తీస్తాడు. ఆ అనుభూతిని తేలికైన పదాలతో, బరువైన భావంతో, రుచికరమైన వచనంతో మనకి అందిస్తాడు.
విద్య చాలామందికి ఉంటుంది. రసవిద్య మాత్రం కొద్దిమందికే తెలుస్తుంది.
ఈ జిప్పీది సున్నితమైన సెన్సాఫ్ హ్యూమర్.
తిరిగిన దేశాలు ఖండాలు, లోకాలు చాలవన్నట్లు ఈ మధ్య రష్యా వెళ్ళి వచ్చాడు. నలభై రోజులు నాన్స్టాప్ తిరిగాడు. ఆ మరపురాని పర్యాటనానుభవానికి `సైబీరియా బాటసారి' అని పేరు పెట్టుకొన్నాడు
ఆదినారాయణకి ఆడంబరాలు పట్టవు. వేషాలు, ఓవర్ యాక్షనూ గిట్టవు. నిరాడంబరుడైన పాత గ్రీకు తత్వవేత్త, డయోజెనిస్కి ఏకలవ్య శిష్యుడు. ఎక్కడికైనా సరే 'ఏక్ ఛలో' అని పాడుకుంటూ నడిచి వెళ్ళిపోతాడు.
ఓ గిన్నెడు వేడి సూప్, రెండు బ్రెడ్డు ముక్కలు, ఒక పండు చాలు. రోజు నడిచిపోతుంది, ఈ సంచారికి. భుజంమీద సంచిలో రెండు జతల బట్టలే ఉన్నా, ప్రపంచ కళా చరిత్ర అనే పెద్ద లగేజి ఎప్పుడూ ఆయన హృదయంలో పదిలంగా
ఉంటుంది.
మేరా జూతాహై జపానీ,
సర్పే లాల్ టోపీ రూసీ
ఫిలీ దిల్ హై హిందూస్థానీ....
అని రాజ్కపూర్ పాడుకొంటూ రష్యా వీధులన్నీ చూసి వచ్చిన.......................
ఆది' యందు నారాయణుడుండెను - ఆమెన్! తాడి ప్రకాష్ కథ చెబుతాం. నవల రాస్తాం. ఒక సినిమా చూస్తాం. ఒక అందమైన ప్రదేశానికో, ఇతర దేశానికో వెళ్ళి ఆ అనుభవాన్ని రాస్తాం. దాన్ని ట్రావెలోగ్ అంటాం. ఏదైనా చెప్పటమే ముఖ్యం. ఇంతకు ముందు చాలా మంది రాసి ఉన్నారు. ఇంకా బాగా చెప్పగలగాలి. గుచ్చుకొనేలా, హృదయానికి హత్తుకొనేలా. ఒక వెలుతురు కిరణమేదో గుండెని తాకినట్టూ ఉండాలి. తిరిగి తిరిగీ కాళ్ళు అరిగిన ఈ ఆదినారాయణ అలా అందంగా రాయటంలో చెయ్యి తిరిగిన వాడు. ఏదేశమేగినా, ఎందుకాలిడినా, రోడ్లమీదే నడిచి, చరిత్రని తవ్వి తీస్తాడు. ఆ అనుభూతిని తేలికైన పదాలతో, బరువైన భావంతో, రుచికరమైన వచనంతో మనకి అందిస్తాడు. విద్య చాలామందికి ఉంటుంది. రసవిద్య మాత్రం కొద్దిమందికే తెలుస్తుంది. ఈ జిప్పీది సున్నితమైన సెన్సాఫ్ హ్యూమర్. తిరిగిన దేశాలు ఖండాలు, లోకాలు చాలవన్నట్లు ఈ మధ్య రష్యా వెళ్ళి వచ్చాడు. నలభై రోజులు నాన్స్టాప్ తిరిగాడు. ఆ మరపురాని పర్యాటనానుభవానికి `సైబీరియా బాటసారి' అని పేరు పెట్టుకొన్నాడు ఆదినారాయణకి ఆడంబరాలు పట్టవు. వేషాలు, ఓవర్ యాక్షనూ గిట్టవు. నిరాడంబరుడైన పాత గ్రీకు తత్వవేత్త, డయోజెనిస్కి ఏకలవ్య శిష్యుడు. ఎక్కడికైనా సరే 'ఏక్ ఛలో' అని పాడుకుంటూ నడిచి వెళ్ళిపోతాడు. ఓ గిన్నెడు వేడి సూప్, రెండు బ్రెడ్డు ముక్కలు, ఒక పండు చాలు. రోజు నడిచిపోతుంది, ఈ సంచారికి. భుజంమీద సంచిలో రెండు జతల బట్టలే ఉన్నా, ప్రపంచ కళా చరిత్ర అనే పెద్ద లగేజి ఎప్పుడూ ఆయన హృదయంలో పదిలంగా ఉంటుంది. మేరా జూతాహై జపానీ, సర్పే లాల్ టోపీ రూసీ ఫిలీ దిల్ హై హిందూస్థానీ.... అని రాజ్కపూర్ పాడుకొంటూ రష్యా వీధులన్నీ చూసి వచ్చిన.......................© 2017,www.logili.com All Rights Reserved.