ఈ వ్యాసాల్లో యాత్రా సంబంధమైనవి పది, కళారంగానికి చెందినవి మూడు, నాకిష్టమైన పక్షుల గురించి రెండు, నాకు అత్యంత ప్రియమైన గాడిద గురించి ఒక పెద్ద వ్యాసం, పద్మం గురించి మరొక్కటి కూడా ఉన్నాయి. వీటిలో ఆరు వ్యాసాలు మొదటగా వెలుగు చూస్తున్నాయి.
పాదాలు పుట్టిందే ప్రయాణం కోసం. మనల్ని ఒక చోటు నుండి మరొక చోటుకి హాయిగా తీసుకెళ్ళే వాహనం మన పాదాలు. అడుగులో అడుగేసుకొంటూ ముందుకి సాగిపోతుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాంటి ముందడుగులే మానవజాతి మనుగడకి మూలాలయ్యాయి. దేహమనే దేవాలయానికి పటిష్టమైన పునాదులు పాదాలే. నదుల ఒడ్డున ఏర్పడిన బాటల్లోనే మన పూర్వీకులు సాగిపోయారు. ఎండాకాలంలో వడగాలికి చెట్ల కొమ్మలు రాసుకొని, అగ్గిపుట్టి, అడవులు మండిపోయి కొత్తగా బాటలు ఏర్పడేవి. అలాంటి బాటలు మరిన్ని కావాలని అగ్నిని పూజించారు. ఆ విధంగా పథకృత్(బాటలు ఏర్పరచేవాడు) అనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు అగ్నిదేవుడు. అప్పటి నుండి ఎక్కువగా బాటలు ఏర్పడి ఆర్యుల ప్రయాణాలు ఎక్కువయ్యాయి.
ఈ వ్యాసాల్లో యాత్రా సంబంధమైనవి పది, కళారంగానికి చెందినవి మూడు, నాకిష్టమైన పక్షుల గురించి రెండు, నాకు అత్యంత ప్రియమైన గాడిద గురించి ఒక పెద్ద వ్యాసం, పద్మం గురించి మరొక్కటి కూడా ఉన్నాయి. వీటిలో ఆరు వ్యాసాలు మొదటగా వెలుగు చూస్తున్నాయి. పాదాలు పుట్టిందే ప్రయాణం కోసం. మనల్ని ఒక చోటు నుండి మరొక చోటుకి హాయిగా తీసుకెళ్ళే వాహనం మన పాదాలు. అడుగులో అడుగేసుకొంటూ ముందుకి సాగిపోతుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాంటి ముందడుగులే మానవజాతి మనుగడకి మూలాలయ్యాయి. దేహమనే దేవాలయానికి పటిష్టమైన పునాదులు పాదాలే. నదుల ఒడ్డున ఏర్పడిన బాటల్లోనే మన పూర్వీకులు సాగిపోయారు. ఎండాకాలంలో వడగాలికి చెట్ల కొమ్మలు రాసుకొని, అగ్గిపుట్టి, అడవులు మండిపోయి కొత్తగా బాటలు ఏర్పడేవి. అలాంటి బాటలు మరిన్ని కావాలని అగ్నిని పూజించారు. ఆ విధంగా పథకృత్(బాటలు ఏర్పరచేవాడు) అనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు అగ్నిదేవుడు. అప్పటి నుండి ఎక్కువగా బాటలు ఏర్పడి ఆర్యుల ప్రయాణాలు ఎక్కువయ్యాయి.
© 2017,www.logili.com All Rights Reserved.