జగద్విఖ్యాతి చెందిన "భగవద్గీత " వంటి అమృతతుల్యమైన ఐదు గీతాలు భారత భాగవత రామాయణాది ఇతిహాసాలలో, అష్టాదశ పురాణాలలో దర్శనమిస్తాయి. అట్టి గీతార్ధ బోధనల సార సంగ్రహాలను వివరించే ప్రయత్నమే ఈ "గీత పంచామృతామ్!"
ఇందులో...........................
1 బ్రహ్మాగీత: బ్రహ్మ పురాణం అయినా ఇందులో భూగోళ, సప్త ద్విప, భరత ఖండ వివరాలు, దీక్ష ప్రజాపతి, పురుషోత్తమ, కార్త వీర్యార్జున వృతాంతములు, పితృదేవత పిండ ప్రదానము, సాంఖ్య యోగములు దర్శనమిస్తాయి.
2 జాజలి - తులాధారగీత : జాజలి మహర్షికి, తులాధారుడు ను వణిక్ ప్రముఖనకు మధ్య జరిగిన ధర్మసంబంధ ఆచార వైశిష్ట్యతా ప్రాముఖ్యత సంవాదము.
3 వశిష్ఠగీత: రాజ్యభోగముల ఏడ వైరాగ్యముతో మనో వైక్లబ్యముతో సతమత మవుతున్న శ్రీ రామునకు వశిష్ఠ మునింద్రనకు మధ్య జరిగిన ఆధ్యాత్మ సంవాద రూపము.
5 అష్టావక్ర గీత: ముముక్షువులకు జ్ఞాన సాధన మార్గమునకు భోదించి ఆత్మ సహజ ముక్తి స్థితిని నిర్ధారించు అష్టావక్ర మహర్షి జనక మహారాజు ఆధ్యాత్మ చింతనా వాదోపవాదములు!