ఇది హిమాలయ యోగులు హిమాలయ పర్వతాలలో చేసిన సాధనలు, తత్ ఫలితములను తెలుపు ఆధ్యాత్మిక సాహిత్యము. వారితో సహయోగి జీవితం గడిపి, అభ్యాసం చేసి ఆచరణరీత్యా పొందిన అనుభవాలను రచయిత ఇందు పొందు పరిచారు. ఇది నిశిత ప్రాక్టికల్ పరిశోధన. విశ్లేషణ పటిమకు తార్కాణం.
అలనాటి యోగుల సాధనలపై సమగ్రంగా విచారించిన ప్రామాణిక రచన ఇంతవరకు ఏ స్థాయిలోను వెలువడలేదు. సన్నివేశాల పరంగా, ప్రక్రియపరంగా, భాషాపరంగా వివిధ దృక్కోణాలతో విశ్లేషించడమైనది. యోగుల జీవితమును వర్ణించుటకు వీరు చేసిన ప్రయత్నం, వివరణా శైలి యోగమునకు తిరిగి ఈ కాలములో జీవం పోసినట్లయింది.
గత యుగములలోని యోగులు మరువలేని యోగులుగా నిలిచిపోయారు. వారు చేసిన సాధనలను సిద్ధాంతీకరించేందుకు చేసిన మానసిక పరిశ్రమకు, రచనా రీతికి ఈ గ్రంథములోని ప్రతి పుట అద్దం పడుతో౦ది. వారి జీవనం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది.
నిజ నిర్ధారణకు రచయిత అనేక సుదూర హిమాలయ ప్రాంతాలకు కూడా విస్తారంగా ప్రయాణించారు. జిజ్ఞాసువులుకు, సాధకులకు ఉపయోగ పడగలదని మీకు ఈ పుస్తకాన్ని సవినయంగా సమర్పించుకొంటున్నాను.
- డా. ఎ. వెంకటేశ్వరరావు
ఇది హిమాలయ యోగులు హిమాలయ పర్వతాలలో చేసిన సాధనలు, తత్ ఫలితములను తెలుపు ఆధ్యాత్మిక సాహిత్యము. వారితో సహయోగి జీవితం గడిపి, అభ్యాసం చేసి ఆచరణరీత్యా పొందిన అనుభవాలను రచయిత ఇందు పొందు పరిచారు. ఇది నిశిత ప్రాక్టికల్ పరిశోధన. విశ్లేషణ పటిమకు తార్కాణం. అలనాటి యోగుల సాధనలపై సమగ్రంగా విచారించిన ప్రామాణిక రచన ఇంతవరకు ఏ స్థాయిలోను వెలువడలేదు. సన్నివేశాల పరంగా, ప్రక్రియపరంగా, భాషాపరంగా వివిధ దృక్కోణాలతో విశ్లేషించడమైనది. యోగుల జీవితమును వర్ణించుటకు వీరు చేసిన ప్రయత్నం, వివరణా శైలి యోగమునకు తిరిగి ఈ కాలములో జీవం పోసినట్లయింది. గత యుగములలోని యోగులు మరువలేని యోగులుగా నిలిచిపోయారు. వారు చేసిన సాధనలను సిద్ధాంతీకరించేందుకు చేసిన మానసిక పరిశ్రమకు, రచనా రీతికి ఈ గ్రంథములోని ప్రతి పుట అద్దం పడుతో౦ది. వారి జీవనం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. నిజ నిర్ధారణకు రచయిత అనేక సుదూర హిమాలయ ప్రాంతాలకు కూడా విస్తారంగా ప్రయాణించారు. జిజ్ఞాసువులుకు, సాధకులకు ఉపయోగ పడగలదని మీకు ఈ పుస్తకాన్ని సవినయంగా సమర్పించుకొంటున్నాను. - డా. ఎ. వెంకటేశ్వరరావు© 2017,www.logili.com All Rights Reserved.