వేదాంగమైన జ్యోతిషశాస్త్రములో ఫలితా భాగమును తెలియజేయు గ్రంథములు వెలువడినవి. వాటిలో ప్రముఖమైన గ్రంథము జాతకాలంకారము. శుకమునిచే రచింపబడిన సర్వోత్కృష్ట సూత్రరూప గ్రంథము 'శుకజాతకము' నాధారము చేసికొని గణేశదైవజ్ఞుడు స్రగ్ధరావృతములో జాతకాలంకార గ్రంథమును రచించెను. యితడు తన గ్రంథములో తనవంశమును గూర్చి తెలియజేసెను. ఇతని తండ్రి శ్రీ గోపాలపండితుడు. యితడు చందోలంకారకావ్య నాటకవేత్తగా ప్రసిద్ధిపొందినాడు. గణేశ దైవజ్ఞుడు శివగురుని శిష్యుడు. ఈ గ్రంథాన్ని గురుప్రీతికై శకసంవత్సరము 1535 సం|| భాద్రపదమాసంలో వ్రాసితినని తెలిపినాడు.
జాతకఫలితములను తెలియజేయుటలో ఇది అద్భుతమైన గ్రంథమని తెలుపవచ్చును. దీనిలో వ్యక్తి జాతకములోని ఫలితా విషయములను అద్భుతముగా వివరించెను. గ్రంథము చిన్నదైనను బిందువులో మహాసింధువును నిలిపినట్లుగా అన్ని ఫలితములు దీనిలో కూర్చబడినది. గ్రంథకారుని రచనాశైలి అతిసుందరమేకాక సుభోధకమైనది.
వేదాంగమైన జ్యోతిషశాస్త్రములో ఫలితా భాగమును తెలియజేయు గ్రంథములు వెలువడినవి. వాటిలో ప్రముఖమైన గ్రంథము జాతకాలంకారము. శుకమునిచే రచింపబడిన సర్వోత్కృష్ట సూత్రరూప గ్రంథము 'శుకజాతకము' నాధారము చేసికొని గణేశదైవజ్ఞుడు స్రగ్ధరావృతములో జాతకాలంకార గ్రంథమును రచించెను. యితడు తన గ్రంథములో తనవంశమును గూర్చి తెలియజేసెను. ఇతని తండ్రి శ్రీ గోపాలపండితుడు. యితడు చందోలంకారకావ్య నాటకవేత్తగా ప్రసిద్ధిపొందినాడు. గణేశ దైవజ్ఞుడు శివగురుని శిష్యుడు. ఈ గ్రంథాన్ని గురుప్రీతికై శకసంవత్సరము 1535 సం|| భాద్రపదమాసంలో వ్రాసితినని తెలిపినాడు. జాతకఫలితములను తెలియజేయుటలో ఇది అద్భుతమైన గ్రంథమని తెలుపవచ్చును. దీనిలో వ్యక్తి జాతకములోని ఫలితా విషయములను అద్భుతముగా వివరించెను. గ్రంథము చిన్నదైనను బిందువులో మహాసింధువును నిలిపినట్లుగా అన్ని ఫలితములు దీనిలో కూర్చబడినది. గ్రంథకారుని రచనాశైలి అతిసుందరమేకాక సుభోధకమైనది.© 2017,www.logili.com All Rights Reserved.