జ్యోతిష శాస్త్రంలో వాస్తు విభాగం అత్యంత ప్రధానమయినది. ప్రాచీన కాలం నుండి మానవుడు సుఖప్రదంగా జీవించడానికి వాస్తు శాస్త్రం ఎంతో ఉపయుక్తంగా ఉంది. కాలానుగుణంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రాచీన ఋషులు రూపొందించిన సూత్రాలు ఆధునికుల చేత కుదింపబడటమో వక్రీకరింపబడటమో జరుగుతోంది. కేవలం తమ అనుభవాల ఆధారంగా నూతనంగా కొందరు ప్రచారం చేస్తున్న అంశాలు వివాదాలను సృష్టిస్తున్నాయి.
ఈ పుస్తకరచనలో చాలా వాస్తు గ్రంథాలను పరిశీలించడం జరిగింది. ఇట్టి గ్రంథకర్తలకు, ప్రచురణ కర్తలకు హృదయ పూర్వక ధన్యవాదములు. కీ శే మధుర కృష్ణమూర్తి శాస్త్రి వంటి ఉన్నత విద్యావేత్తలు అందరికి అర్థమయ్యే విధంగా సరళ భాషలో కొన్ని గ్రంథాలను ముద్రించినా అవి అందరికీ చేరటం లేదు. మరికొన్ని గ్రంథాల అవసరం ఏర్పడుతూనే ఉంది.
గృహ నిర్మాణ విధానాలలో ఈ కాలానికి అవసరమయ్యే సమాచారం సంక్షిప్తంగా ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రాచీన వాస్తు సూత్రాలు కాల క్రమంలో మరుగున పడ్డాయి. కారణం ప్రజాదరణ లేక కాదు ఇంగ్లీష్ దొరల పెత్తనం. అందుకే ఇప్పుడు ఈ సూత్రాలను ప్రజల ముందుంచే ప్రయత్నం ప్రారంభమైంది. ఈ గ్రంథ ముద్రణకు ప్రోత్సాహమందించిన మిత్రులు శ్రీ కనగాల సంబశివరావు గారు గొప్ప సాంప్రదాయవాది.
జ్యోతిష శాస్త్రంలో వాస్తు విభాగం అత్యంత ప్రధానమయినది. ప్రాచీన కాలం నుండి మానవుడు సుఖప్రదంగా జీవించడానికి వాస్తు శాస్త్రం ఎంతో ఉపయుక్తంగా ఉంది. కాలానుగుణంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రాచీన ఋషులు రూపొందించిన సూత్రాలు ఆధునికుల చేత కుదింపబడటమో వక్రీకరింపబడటమో జరుగుతోంది. కేవలం తమ అనుభవాల ఆధారంగా నూతనంగా కొందరు ప్రచారం చేస్తున్న అంశాలు వివాదాలను సృష్టిస్తున్నాయి. ఈ పుస్తకరచనలో చాలా వాస్తు గ్రంథాలను పరిశీలించడం జరిగింది. ఇట్టి గ్రంథకర్తలకు, ప్రచురణ కర్తలకు హృదయ పూర్వక ధన్యవాదములు. కీ శే మధుర కృష్ణమూర్తి శాస్త్రి వంటి ఉన్నత విద్యావేత్తలు అందరికి అర్థమయ్యే విధంగా సరళ భాషలో కొన్ని గ్రంథాలను ముద్రించినా అవి అందరికీ చేరటం లేదు. మరికొన్ని గ్రంథాల అవసరం ఏర్పడుతూనే ఉంది. గృహ నిర్మాణ విధానాలలో ఈ కాలానికి అవసరమయ్యే సమాచారం సంక్షిప్తంగా ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రాచీన వాస్తు సూత్రాలు కాల క్రమంలో మరుగున పడ్డాయి. కారణం ప్రజాదరణ లేక కాదు ఇంగ్లీష్ దొరల పెత్తనం. అందుకే ఇప్పుడు ఈ సూత్రాలను ప్రజల ముందుంచే ప్రయత్నం ప్రారంభమైంది. ఈ గ్రంథ ముద్రణకు ప్రోత్సాహమందించిన మిత్రులు శ్రీ కనగాల సంబశివరావు గారు గొప్ప సాంప్రదాయవాది.© 2017,www.logili.com All Rights Reserved.