భూమిక
భారతదేశంలో బౌద్ధధర్మ ఉత్థానపతనాలు
బౌద్ధధర్మం భారతదేశంలో పుట్టింది. దీని సంస్థాపకుడైన గౌతమ బుద్ధుడు కోసి - కురుక్షేత్రం, హిమాచల - వింధ్యాచలాల మధ్య సంచరిస్తూ నలభై అయిదేళ్లపాటు ధర్మప్రచారం చేశాడు. దేశమంతటా సామ్రాట్టులు మొదలు కొని సామాన్యుల వరకు పెద్దసంఖ్యలో ఈ ధర్మాన్ని అనుసరించారు. ఆనాడు బౌద్ధ భిక్షువులు, విహారాలు లేని ప్రాంతం చాలా అరుదు. బౌద్ధచింతకులు, తాత్త్వికులూ వేల సంవత్సరాల పాటు తమ ఆలోచనలతో భారతదేశాన్ని ప్రభావితం చేశారు. బౌద్ధకళావిశారదులు తమ నైపుణ్యంతో భారతీయ కళలపై చెరగని ముద్ర వేశారు. బౌద్ధవాస్తుశాస్త్రజులు, నిపుణులైన శిల్పులూ పర్వతవక్షాలను మైనంలా తొలిచి అజంతా, ఎల్లోరా, కార్లే, నాసిక్ వంటి గుహావిహారాలను నిర్మించారు. గంభీరమైన బౌద్ధచింతనను స్వీకరించేందుకు గ్రీకులు, చైనీయులు వంటి సమున్నత జాతులవారు ఉవ్విళ్లూరారు. దీని దర్శననియమాలను, సదాచారనియమాలను విద్వాంసులందరూ నాటినుండి నేటివరకు గొప్ప ఆదరదృష్టితో పరిశీలిస్తూ వస్తున్నారు. ఈనాడు కూడా బౌద్ధధర్మానుయాయుల సంఖ్య ప్రపంచంలోని ఇతర ఏ మతానుయాయుల సంఖ్యకూ తీసిపోదు.
ఇంతటి ప్రతాపం కలిగిన బౌద్ధధర్మం తన జన్మభూమినుండి ఎలా అదృశ్యమైందనేది చాలా ముఖ్యమైన, ఆశ్చర్యకరమైన ప్రశ్న. దీన్ని నేనిక్కడ సంక్షిప్తంగా చర్చిస్తాను. 13-14 శతాబ్దాల మధ్యకాలంలో బౌద్ధం ఇక్కడ అదృశ్యమైంది. ఈ కాలంలోని స్థితిని తెలుసుకోవాలంటే కొంచెం ప్రాచీన చరిత్రను కూడా తెలుసుకోవాలి.
గౌతమబుద్ధుని పరినిర్వాణం బి.సి.ఇ. 483లో జరిగింది. ఆయన తన ఉపదేశాలన్నింటిని మౌఖికంగానే చేస్తుండినప్పటికీ ఆయన శిష్యులు వాటిని వెంటనే కంఠస్థం చేసేవారు. ఈ ఉపదేశాలు రెండు విధాలు. మొదటిది సాధారణధర్మానికి, తత్త్వజ్ఞానానికి సంబంధించినదైతే రెండవది భిక్షు - భిక్షుణిల నియమాలకు సంబంధించినది. పాలిభాషలో మొదటిదాన్ని ధమ్మమని, రెండవదాన్ని వినయమని అంటారు. బుదుని నిర్వాణం తర్వాత ఆయన ముఖ్య శిష్యులందరూ రాజగృహంలో సప్తపర్ణిగుహలో సమావేశమై ధమ్మ, వినయాలను సంగాయనం చేశారు. ఇదే ప్రథమసంగీతి. దీనిలో మహాకాశ్యపుడు ప్రధానస విరుగు ధమ్మాన్ని గురించి బుద్దుని సేవలో ఉన్న ఆనందుని, వినయాన్ని గురించి బుద్దుడు ప్రశంసించిన ఉపాలిని ప్రశ్నించాడు. అహింస, సత్యం, అచౌర్యం, బ్రహ్మచర్యం మొదలైన మంచికర్మలను పాలీలో - అంటారు. సంధాలు, ఆయతనాలు, ధాతువులు మొదలైనవాటికి చెందిన సూక్ష్మ తాత్త్వికచింతనలను లేదా 'దిటి' లేదా 'దస్సన' అంటారు. బుద్దేపదేశంలో శీల, ప్రజ్ఞలు రెంటికి ప్రాధాన్యత ఉంది. వాలీబాషలో ధమ్మ' అనే పదానికి బదులుగా 'సుత్త' లేదా 'సుత్తంత' పదాలను వాడే పరిపాటి కూడా ఉంది. ప్రథమసంగీతిలో పాల్గొన్న స్థవిరులు ధమ్మ, వినయాలను ఈ రూపంలో సంకలనం చేశారు ఆ తర్వాత వేర్వేరు భిక్షువులు ఆ రెంటిని వేర్వేరుగా కంఠస్థం చేసి, అధ్యయన, అధ్యాపనా స్వీకరించారు. వారిలో 'ధమ్మ' లేదా 'సుత్త' ల రక్షణభారాని వారిలో 'ధమ్మ' లేదా 'సుత్త' ల రక్షణ భారాన్ని స్వీకరించినవారు 'ధమ్మధర', 'సుత్తధర', సుతాంతిక' అని పేరుపొందారు. వినయ రక్షణభారాన్ని స్వీకరించినవారు వినయధరులైనారు. లో కొన్ని దర్శనసంబంధ విషయాలు అక్కడక్కడ చాలా సంక్షిప్తంగా ఉన్నాయి. వీటిని మాతిక..............
భూమిక భారతదేశంలో బౌద్ధధర్మ ఉత్థానపతనాలు బౌద్ధధర్మం భారతదేశంలో పుట్టింది. దీని సంస్థాపకుడైన గౌతమ బుద్ధుడు కోసి - కురుక్షేత్రం, హిమాచల - వింధ్యాచలాల మధ్య సంచరిస్తూ నలభై అయిదేళ్లపాటు ధర్మప్రచారం చేశాడు. దేశమంతటా సామ్రాట్టులు మొదలు కొని సామాన్యుల వరకు పెద్దసంఖ్యలో ఈ ధర్మాన్ని అనుసరించారు. ఆనాడు బౌద్ధ భిక్షువులు, విహారాలు లేని ప్రాంతం చాలా అరుదు. బౌద్ధచింతకులు, తాత్త్వికులూ వేల సంవత్సరాల పాటు తమ ఆలోచనలతో భారతదేశాన్ని ప్రభావితం చేశారు. బౌద్ధకళావిశారదులు తమ నైపుణ్యంతో భారతీయ కళలపై చెరగని ముద్ర వేశారు. బౌద్ధవాస్తుశాస్త్రజులు, నిపుణులైన శిల్పులూ పర్వతవక్షాలను మైనంలా తొలిచి అజంతా, ఎల్లోరా, కార్లే, నాసిక్ వంటి గుహావిహారాలను నిర్మించారు. గంభీరమైన బౌద్ధచింతనను స్వీకరించేందుకు గ్రీకులు, చైనీయులు వంటి సమున్నత జాతులవారు ఉవ్విళ్లూరారు. దీని దర్శననియమాలను, సదాచారనియమాలను విద్వాంసులందరూ నాటినుండి నేటివరకు గొప్ప ఆదరదృష్టితో పరిశీలిస్తూ వస్తున్నారు. ఈనాడు కూడా బౌద్ధధర్మానుయాయుల సంఖ్య ప్రపంచంలోని ఇతర ఏ మతానుయాయుల సంఖ్యకూ తీసిపోదు. ఇంతటి ప్రతాపం కలిగిన బౌద్ధధర్మం తన జన్మభూమినుండి ఎలా అదృశ్యమైందనేది చాలా ముఖ్యమైన, ఆశ్చర్యకరమైన ప్రశ్న. దీన్ని నేనిక్కడ సంక్షిప్తంగా చర్చిస్తాను. 13-14 శతాబ్దాల మధ్యకాలంలో బౌద్ధం ఇక్కడ అదృశ్యమైంది. ఈ కాలంలోని స్థితిని తెలుసుకోవాలంటే కొంచెం ప్రాచీన చరిత్రను కూడా తెలుసుకోవాలి. గౌతమబుద్ధుని పరినిర్వాణం బి.సి.ఇ. 483లో జరిగింది. ఆయన తన ఉపదేశాలన్నింటిని మౌఖికంగానే చేస్తుండినప్పటికీ ఆయన శిష్యులు వాటిని వెంటనే కంఠస్థం చేసేవారు. ఈ ఉపదేశాలు రెండు విధాలు. మొదటిది సాధారణధర్మానికి, తత్త్వజ్ఞానానికి సంబంధించినదైతే రెండవది భిక్షు - భిక్షుణిల నియమాలకు సంబంధించినది. పాలిభాషలో మొదటిదాన్ని ధమ్మమని, రెండవదాన్ని వినయమని అంటారు. బుదుని నిర్వాణం తర్వాత ఆయన ముఖ్య శిష్యులందరూ రాజగృహంలో సప్తపర్ణిగుహలో సమావేశమై ధమ్మ, వినయాలను సంగాయనం చేశారు. ఇదే ప్రథమసంగీతి. దీనిలో మహాకాశ్యపుడు ప్రధానస విరుగు ధమ్మాన్ని గురించి బుద్దుని సేవలో ఉన్న ఆనందుని, వినయాన్ని గురించి బుద్దుడు ప్రశంసించిన ఉపాలిని ప్రశ్నించాడు. అహింస, సత్యం, అచౌర్యం, బ్రహ్మచర్యం మొదలైన మంచికర్మలను పాలీలో - అంటారు. సంధాలు, ఆయతనాలు, ధాతువులు మొదలైనవాటికి చెందిన సూక్ష్మ తాత్త్వికచింతనలను లేదా 'దిటి' లేదా 'దస్సన' అంటారు. బుద్దేపదేశంలో శీల, ప్రజ్ఞలు రెంటికి ప్రాధాన్యత ఉంది. వాలీబాషలో ధమ్మ' అనే పదానికి బదులుగా 'సుత్త' లేదా 'సుత్తంత' పదాలను వాడే పరిపాటి కూడా ఉంది. ప్రథమసంగీతిలో పాల్గొన్న స్థవిరులు ధమ్మ, వినయాలను ఈ రూపంలో సంకలనం చేశారు ఆ తర్వాత వేర్వేరు భిక్షువులు ఆ రెంటిని వేర్వేరుగా కంఠస్థం చేసి, అధ్యయన, అధ్యాపనా స్వీకరించారు. వారిలో 'ధమ్మ' లేదా 'సుత్త' ల రక్షణభారాని వారిలో 'ధమ్మ' లేదా 'సుత్త' ల రక్షణ భారాన్ని స్వీకరించినవారు 'ధమ్మధర', 'సుత్తధర', సుతాంతిక' అని పేరుపొందారు. వినయ రక్షణభారాన్ని స్వీకరించినవారు వినయధరులైనారు. లో కొన్ని దర్శనసంబంధ విషయాలు అక్కడక్కడ చాలా సంక్షిప్తంగా ఉన్నాయి. వీటిని మాతిక..............© 2017,www.logili.com All Rights Reserved.