కొండంత దేవుడికి కొండంత పత్రి సమర్పించ గలమా? అంత అవసరమా? అని ప్రశ్ని౦చే వారు లేకపోలేదు. విశాలంగా ఆలోచించలేనివారు, భారీ శ్రమను భరించలేనివారు, వ్యయప్రయాసలను తట్టుకోలేనివారు ఇలాంటి వాదనలే చేస్తారు. లోకకళ్యాణం కాంక్షించే గోదాదేవి వంటి వారు కొద్ది మందే ఉ౦టారు. వారి దయ, దాక్షిణ్యాలే కాదు, వారి ఆలోచనలు అందరి మీద, అన్నిలోకాల మీద నిరంతరంగా ప్రసరిస్తూనే ఉంటాయి. గోదాదేవి అందరికి ప్రాతినిథ్య౦ వహిస్తూ పూలను సేకరించి రంగనాయకునికి విశేష మాలలు అర్పించింది. ఆ మాలలను శ్రీరంగడు ఔనని అంగీకరించాడు. కలియుగ వేంకటనాయకుడు కూడా ఆమె పంపే మాలలను తన బ్రహ్మోత్సవాల సందర్భంలో అంగీకరిస్తున్నాడు. మెడలో ధరిస్తున్నాడు. కళ్యాణకంకణం ధరించడం ద్వారా లోకకళ్యాణాన్ని కలిగించాడు.
అటువంటి గోదాదేవిని మనసా స్మరిద్దాం. ఓ గోదాదేవి! నీకు భగవంతుడి విషయంలో ఎలాంటి దాస్యభావముందో అలాంటి భావననే మాకూ కలిగించు అని కోరుకుందాం.
కొండంత దేవుడికి కొండంత పత్రి సమర్పించ గలమా? అంత అవసరమా? అని ప్రశ్ని౦చే వారు లేకపోలేదు. విశాలంగా ఆలోచించలేనివారు, భారీ శ్రమను భరించలేనివారు, వ్యయప్రయాసలను తట్టుకోలేనివారు ఇలాంటి వాదనలే చేస్తారు. లోకకళ్యాణం కాంక్షించే గోదాదేవి వంటి వారు కొద్ది మందే ఉ౦టారు. వారి దయ, దాక్షిణ్యాలే కాదు, వారి ఆలోచనలు అందరి మీద, అన్నిలోకాల మీద నిరంతరంగా ప్రసరిస్తూనే ఉంటాయి. గోదాదేవి అందరికి ప్రాతినిథ్య౦ వహిస్తూ పూలను సేకరించి రంగనాయకునికి విశేష మాలలు అర్పించింది. ఆ మాలలను శ్రీరంగడు ఔనని అంగీకరించాడు. కలియుగ వేంకటనాయకుడు కూడా ఆమె పంపే మాలలను తన బ్రహ్మోత్సవాల సందర్భంలో అంగీకరిస్తున్నాడు. మెడలో ధరిస్తున్నాడు. కళ్యాణకంకణం ధరించడం ద్వారా లోకకళ్యాణాన్ని కలిగించాడు. అటువంటి గోదాదేవిని మనసా స్మరిద్దాం. ఓ గోదాదేవి! నీకు భగవంతుడి విషయంలో ఎలాంటి దాస్యభావముందో అలాంటి భావననే మాకూ కలిగించు అని కోరుకుందాం.
© 2017,www.logili.com All Rights Reserved.