టూ టవున్ రాధికా ధియేటర్ దగ్గరి నుంచి కాలేజీవైపు కదిలిపోతున్న సిటీబస్ లో వున్నట్లుండి స్టార్ట్ అయిందో గందరగోళం.
"అయ్యో....! నా డబ్బు... నా డబ్బు పోయింది... నా డబ్బు" అంటూ గోలగోలగా అరవటం మొదలెట్టిందొక మధ్య వయస్కురాలు.
యాక్సిలేటర్ మీది పాదాన్ని తీసి చుటుక్కున బ్రేకులమీద వేశాడు డ్రైవర్. కీచుధ్వనులు చేస్తూ రోడ్డు పక్కకు పోయి ఆగింది బస్సు.
"ఎవరూ బస్ లోనుంచి దిగవద్దు" అని డోర్స్ దగ్గిర వున్నవారిని హెచ్చరిస్తూ బస్ లో వున్న మధ్యవయస్కురాలి దగ్గరికొచ్చాడు కండక్టర్.
"మా ఇంటాయన వైద్యానికి ఇల్లు తాకట్టుపెట్టి తెచ్చుకుంటున్నాను పాతికవేలు.... పొట్లంగా కట్టి బుట్టలో పెట్టుకున్నాను... నా డబ్బు, నా డబ్బు కనిపించటంలేదు" నిలుచున్న చోటే చతికిలపడి గొల్లుమన్నదామె.
"వెతకండి... బస్ లో వున్న వారందరినీ ఒకసారి చెక్ చేయండి..." ఏం చేయాలో అర్ధంకాక అయోమయంగా చూసిన కండక్టర్ కీ సలహా ఇచ్చాడు మొదటిసారిగా బస్ ని ఆపమని బిగ్గరగా అరిచిన పెద్దాయన.
"వెతుకులాట మనం పెట్టుకొకూడదు.... పోలిస్ స్టేషన్ కెళితే... వెతికే పనేదో వాళ్ళే చేస్తారు..." అంటూ బస్ ని స్టార్ట్ చేశాడు సంగతి తెలిసిన డ్రైవర్.
అసలు ఆ డబ్బు నిజంగానే పోయిందా? దొంగ ఎవరో కనిపెట్టారా?, పోలిస్ లు న్యాయం చేశారా?, ఆ దొంగకి తగ్గిన శిక్ష పడిందా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే చదవండి "రహస్యం".
టూ టవున్ రాధికా ధియేటర్ దగ్గరి నుంచి కాలేజీవైపు కదిలిపోతున్న సిటీబస్ లో వున్నట్లుండి స్టార్ట్ అయిందో గందరగోళం. "అయ్యో....! నా డబ్బు... నా డబ్బు పోయింది... నా డబ్బు" అంటూ గోలగోలగా అరవటం మొదలెట్టిందొక మధ్య వయస్కురాలు. యాక్సిలేటర్ మీది పాదాన్ని తీసి చుటుక్కున బ్రేకులమీద వేశాడు డ్రైవర్. కీచుధ్వనులు చేస్తూ రోడ్డు పక్కకు పోయి ఆగింది బస్సు. "ఎవరూ బస్ లోనుంచి దిగవద్దు" అని డోర్స్ దగ్గిర వున్నవారిని హెచ్చరిస్తూ బస్ లో వున్న మధ్యవయస్కురాలి దగ్గరికొచ్చాడు కండక్టర్. "మా ఇంటాయన వైద్యానికి ఇల్లు తాకట్టుపెట్టి తెచ్చుకుంటున్నాను పాతికవేలు.... పొట్లంగా కట్టి బుట్టలో పెట్టుకున్నాను... నా డబ్బు, నా డబ్బు కనిపించటంలేదు" నిలుచున్న చోటే చతికిలపడి గొల్లుమన్నదామె. "వెతకండి... బస్ లో వున్న వారందరినీ ఒకసారి చెక్ చేయండి..." ఏం చేయాలో అర్ధంకాక అయోమయంగా చూసిన కండక్టర్ కీ సలహా ఇచ్చాడు మొదటిసారిగా బస్ ని ఆపమని బిగ్గరగా అరిచిన పెద్దాయన. "వెతుకులాట మనం పెట్టుకొకూడదు.... పోలిస్ స్టేషన్ కెళితే... వెతికే పనేదో వాళ్ళే చేస్తారు..." అంటూ బస్ ని స్టార్ట్ చేశాడు సంగతి తెలిసిన డ్రైవర్. అసలు ఆ డబ్బు నిజంగానే పోయిందా? దొంగ ఎవరో కనిపెట్టారా?, పోలిస్ లు న్యాయం చేశారా?, ఆ దొంగకి తగ్గిన శిక్ష పడిందా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే చదవండి "రహస్యం".
© 2017,www.logili.com All Rights Reserved.