డా కత్తి పద్మారావు గారి నాలుగు దశాబ్దాల కృషి నుండి ఈ గ్రంథం ఆవిర్భవించింది. వందలాది పుస్తకాలను ఈ గ్రంథం కోసం అధ్యయనం చేశారు. ‘భారత రాజకీయాలు – అంబేద్కర్ దృక్పథం’ అనే ఈ గ్రంథం రాజకీయాల్లో ప్రత్యామ్నాయ భావజాలాన్ని మనకు అందిస్తుంది.
డా బి ఆర్ అంబేద్కర్, మహాత్మాగాంధీ, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మహ్మద్ అలీ జిన్నా, బాబూ రాజేంద్రప్రసాద్, ఇందిరా గాంధీ, పెరియార్ రామస్వామి నాయకర్ వంటి ఎందరో నాయకుల వ్యక్తిత్వాలను భారతదేశాన్ని నడిపే క్రమంలో వారి పోరాట దృక్పథాన్ని వారిపై ఉన్న మత, కుల ప్రభావాలను ఈ గ్రంథంలో విశ్లేషణాత్మకంగా ఆయన అందించారు. స్వాతంత్రోద్యమానికి ముందు వెనుక జరిగిన ఘటనలు, వాటిపై వ్యక్తులకు, సంస్థలకు, పార్టీలకు ఉన్న ప్రభావాలు ఈ గ్రంథంలో మనకు అద్దం పడతాయి. డా కత్తి పద్మారావు గారు ఇప్పటికి 66 గ్రంథాలు వ్రాసి ప్రచురించారు. ఇది 67వ గ్రంథం.
ఈ గ్రంథంలో రాజకీయ అంశాలే కాక, సామాజిక, సాంస్కృతిక, తాత్విక విశ్లేషణలను ఆయ సందర్భాలను బట్టి మన ముందుకు తీసుకొచ్చారు. ఈ గ్రంథం తప్పక భారత రాజకీయ అధ్యయనంలో మనకు కొత్త చూపును తీసుకొస్తుంది. భారత సమాజాన్ని ఏ శక్తులు నడిపిస్తున్నాయి, భారతీయ సమాజం ముందుకు వెళ్ళాలంటే ఏ తాత్విక అంశాలను మనం స్వీకరించాలి, ఏ ప్రత్యామ్నాయ సిద్ధాంత కర్తలు మనల్ని నడిపిస్తారు అనే విషయాలు స్పష్టమౌతాయి. లోకాయత ప్రచురణలను ఎంతో ఆదరిస్తున్న పాఠకులు ఈ ‘భారత రాజకీయాలు – అంబేద్కర్ దృక్పథం’ అనే ఈ గ్రంథం కూడా మీ కరదీపికగా చేసుకుంటారని ఆశిస్తున్నాం.
డా కత్తి పద్మారావు గారి నాలుగు దశాబ్దాల కృషి నుండి ఈ గ్రంథం ఆవిర్భవించింది. వందలాది పుస్తకాలను ఈ గ్రంథం కోసం అధ్యయనం చేశారు. ‘భారత రాజకీయాలు – అంబేద్కర్ దృక్పథం’ అనే ఈ గ్రంథం రాజకీయాల్లో ప్రత్యామ్నాయ భావజాలాన్ని మనకు అందిస్తుంది. డా బి ఆర్ అంబేద్కర్, మహాత్మాగాంధీ, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మహ్మద్ అలీ జిన్నా, బాబూ రాజేంద్రప్రసాద్, ఇందిరా గాంధీ, పెరియార్ రామస్వామి నాయకర్ వంటి ఎందరో నాయకుల వ్యక్తిత్వాలను భారతదేశాన్ని నడిపే క్రమంలో వారి పోరాట దృక్పథాన్ని వారిపై ఉన్న మత, కుల ప్రభావాలను ఈ గ్రంథంలో విశ్లేషణాత్మకంగా ఆయన అందించారు. స్వాతంత్రోద్యమానికి ముందు వెనుక జరిగిన ఘటనలు, వాటిపై వ్యక్తులకు, సంస్థలకు, పార్టీలకు ఉన్న ప్రభావాలు ఈ గ్రంథంలో మనకు అద్దం పడతాయి. డా కత్తి పద్మారావు గారు ఇప్పటికి 66 గ్రంథాలు వ్రాసి ప్రచురించారు. ఇది 67వ గ్రంథం. ఈ గ్రంథంలో రాజకీయ అంశాలే కాక, సామాజిక, సాంస్కృతిక, తాత్విక విశ్లేషణలను ఆయ సందర్భాలను బట్టి మన ముందుకు తీసుకొచ్చారు. ఈ గ్రంథం తప్పక భారత రాజకీయ అధ్యయనంలో మనకు కొత్త చూపును తీసుకొస్తుంది. భారత సమాజాన్ని ఏ శక్తులు నడిపిస్తున్నాయి, భారతీయ సమాజం ముందుకు వెళ్ళాలంటే ఏ తాత్విక అంశాలను మనం స్వీకరించాలి, ఏ ప్రత్యామ్నాయ సిద్ధాంత కర్తలు మనల్ని నడిపిస్తారు అనే విషయాలు స్పష్టమౌతాయి. లోకాయత ప్రచురణలను ఎంతో ఆదరిస్తున్న పాఠకులు ఈ ‘భారత రాజకీయాలు – అంబేద్కర్ దృక్పథం’ అనే ఈ గ్రంథం కూడా మీ కరదీపికగా చేసుకుంటారని ఆశిస్తున్నాం.© 2017,www.logili.com All Rights Reserved.