పరమాత్మోపాసనను అన్ని ప్రక్రియలలో చేసి, భగవానుడు జగత్కారణ భూతుడునగు శ్రీమన్నారాయణునితో సాయుజ్యము నొందుటే, మానవ జీవిత పరమార్థమని, అట్టిచో నెరుంగవలసినవి తత్వహిత పురుషార్థములని నిరూపించినవి ఉపనిషత్తులు. చిదచిదీశ్వర తత్వములు మూడును తత్వములనియు, అందు ఈశ్వర తత్వము ప్రధానమనియు, చేతనాచేతనములు ఆ ఈశ్వరునితో అపృథక్సిద్ధములై శరీరమువలె నుండుననియు, అట్టి విశిష్టమైన తత్వమే కారణము కార్యమునని తెలిపడి ఉపనిషద్రహస్యము నెరింగించిన గ్రంథమిది. ఉపాసనకు భాగవత్ప్రాప్తికిని సాధనము. ఇదియే జ్ఞానము. జ్ఞానము ఉపాసనము వేరు కావు అని ఉపనిషత్సిద్ధాంతము. దాని నెరింగి ముముక్షువులు తరించుట కీ గ్రంథమెంతో సహాయపడును.
పరమాత్మోపాసనను అన్ని ప్రక్రియలలో చేసి, భగవానుడు జగత్కారణ భూతుడునగు శ్రీమన్నారాయణునితో సాయుజ్యము నొందుటే, మానవ జీవిత పరమార్థమని, అట్టిచో నెరుంగవలసినవి తత్వహిత పురుషార్థములని నిరూపించినవి ఉపనిషత్తులు. చిదచిదీశ్వర తత్వములు మూడును తత్వములనియు, అందు ఈశ్వర తత్వము ప్రధానమనియు, చేతనాచేతనములు ఆ ఈశ్వరునితో అపృథక్సిద్ధములై శరీరమువలె నుండుననియు, అట్టి విశిష్టమైన తత్వమే కారణము కార్యమునని తెలిపడి ఉపనిషద్రహస్యము నెరింగించిన గ్రంథమిది. ఉపాసనకు భాగవత్ప్రాప్తికిని సాధనము. ఇదియే జ్ఞానము. జ్ఞానము ఉపాసనము వేరు కావు అని ఉపనిషత్సిద్ధాంతము. దాని నెరింగి ముముక్షువులు తరించుట కీ గ్రంథమెంతో సహాయపడును.© 2017,www.logili.com All Rights Reserved.