మొదలూ చివరా లేని కాలపు అగాధమైన నలుపు. అందులోంచి నిగూఢమైన నలుపు. ఆ తర్వాత గంభీరమైన నలుపు.
కొలతకు అందనిది కొలువుకు దిగిరావటం కారుణ్యం. ఆ స్వాదుత్వం వలన నలుపు మృదువైపోయి నిలమైంది.
ఆకాశమైంది. శబ్దమయమైంది.
వెదురు పొదలలోంచి మోగింది. ఉపోద్ఘాత గీతమైంది.
సముద్రమైంది. మేఘమైంది. వర్షమైంది మంచు నుంచి జారి తిరిగి నల్లనైంది. యమున అయింది. నది ఒడ్డున తమలమైంది. స్వాగత నాట్యమైంది.
- డా. కంపెల్ల రవిచంద్రన్