విధులను శాసించుట, విషయాలను ప్రకటించుట - ఈ రెండు పనులు చేయువాటిని శాస్త్రాలుఅంటారు. ఇవిలోక ప్రయోజనం కోసం పుట్టాయి. ఎన్నో తెలియని విషయాలను తెలియజేస్తాయి. హితోపదేశకర్త శాస్త్ర ప్రశస్తినిఅద్భుతంగా నిర్వచించాడు.
అనేకసంశయోచ్చేదిపరోక్షార్థస్య దర్శనమ్ |సర్వస్య లోచనంశాస్త్రం యస్య నాస్త్యంధ ఏవ సః ||శాస్త్రము మనకున్నఅన్నిసందేహాలను తీరుస్తుంది.మనం చూడని విషయాల నెన్నింటినో స్పష్టంగా తెలుపుతుంది. ప్రపంచాన్నిచూపించే కన్ను.అటువంటి శాస్త్రజ్ఞానము లేనివాడే నిజమైన గుడ్డివాడని - శాస్త్రాన్ని అభివర్ణించాడు.
వేదార్థాలను,అందులో ప్రతిపాదించిన కర్మకాండలను తెలిసికోవడానికి ప్రత్యేకంగాశాస్త్ర గ్రంథాలుపుట్టాయి. వీటినివేదాంగాలు అనికూడా అంటారు. ఈ వేదాంగ సాహిత్యాన్ని ఋషులు సృష్టించారు. ఇవి ప్రధానంగాఆరు.
శిక్షాకల్పేవ్యాకరణం నిరుక్తంఛందసాచయః|జ్యోతిషామయనం చైవ వేదాంగాని షడేవ తు | శిక్ష,కల్పము, వ్యాకరణము,నిరుక్తము, ఛందస్సు, జ్యోతిషము - అని ఇవి ఆరు. బ్రహ్మ స్వరూపమైన వేదాలకు ఈ ఆరు వేదాంగాలుఆరు శరీరాంగాలవంటివని ప్రసిద్ధ వ్యాకరణవేత్త పాణిని ఇలా పేర్కొన్నారు.
ఛందః పాదౌ తు వేదస్య, హస్తా కల్పోంథ పఠ్యతే |జ్యోతిషామయనం చక్షుః, నిరుక్తం శ్రోత్రముచ్యతే||శిక్షా ఋణంతువేదస్య, ముఖం వ్యాకరణం స్మృతమ్ | వేదభగవానునికి ఛందస్సు కాళ్ళు అని, కల్పసూత్రాలు చేతులని,జ్యోతిషం కండ్లుఅని,నిరుక్తం చెవులని, శిక్ష ముక్కు అని, వ్యాకరణం నోరు అనీ - పాణిని పండితుడుపేర్కొన్నాడు.
వేదాంగాలలో జ్యోతిషం మూడవది అయినా, నెమలికి శిఖ శిరస్సు మీద ఉనలు వేదాంగాల్లోఇది శిరఃస్థానాన్నివహిస్తుందని ప్రాణులు చెబుతారు. రాజ్యం సుభికంగా ఉండడానికి రాజులు యజ్ఞాలు, యాగాలు చేస్తారు.వాటిని ప్రారంభించడానికిముగించడానికి పెట్టే ముహూర్తాలను నిర్ణయించడానికి జ్యోతిషం అవసరమయింది.
యజ్ఞయాగాదులుమంచిఫలితాలనుఇవ్వాలంటే కేవలం విధివిధానాలే కాకుండా తగిన నక్షత్రం,సమయం కూడా అవసరమే.ఈ కాలనియమాన్ని పాటించడానికి కాలాన్ని కూడా గణించడం అవసరమయింది. నక్షత్రాలసహాయంతో కాలనిర్ణయం చేయడం, గ్రహాల అనుకూల, ప్రతికూలనాలను నిర్ణయించడం జరుగుతుంది.
రానురానుఋషులునక్షత్ర,గ్రహాలగతులను,విధులను, భూ భ్రమణాలను మొదలైన వాటినిఅధ్యయనం చేశారు.అందువలనజ్యోతిషంఒకశాస్త్రీయపద్ధతిలో వికసించింది. గర్గమహర్షి, పరాశరుడు, జైమిని, భృగువు, వసిష్టుడుమొదలైన మహర్షులుజ్యోతిషం మీద అధ్యయనం గwసంహిత, పరాశర సంహిత, బృహత్పరాశర హోర, భృగు సూత్రాలు,వృద్ధవాసిష్టము (జ్యోతిర్వాసిష్టము)మొదలైన ప్రామాణిక గ్రంథాలను వ్రాసారు. ఆ తర్వాత కాలంలో జ్యోతిషం - సంహిత,గణితం,జాతకం -అన్న విభాగాలుగావికసించింది.
© 2017,www.logili.com All Rights Reserved.