నైతిక జీవనానికి మత విశ్వాసంతో పనిలేదని, దైవచింతన అవసరం లేదని నమ్మిన పి బి షెల్లీని నాటి సమాజం నిరసించింది. దేశం నుండి వెలివేసింది. చివరికి కాందిశీకునిగా ఇటలీ పర్వత సానువుల్లో సముద్ర తీరాల వెంట పయనించి ఆ కవి, స్వాప్నికుడు, సాహసి, మూడపదులు నిండకనే మున్నీట పాలయ్యాడు. అతనికి సమీకాలీనుడు - బైరన్, మతవిశ్వాసాల మధ్య పెరిగినా, మనిషి దుఃఖానికి దేవుడే కారణమని నమ్మి - భౌతిక సుఖాల వేటలో నైతిక సూత్రాలను కూడా శృంఖలాలగానే భావించి స్వేచ్చాజీవిగా బ్రతకటానికి సాహసించాడు. అతన్ని, అప్పటి లండన్ సమాజం విమర్శలతో వెక్కిరించింది. అసూయతో అందలమెక్కించి దేశ సరిహద్దులను దాటించింది. తన జీవితంలో సగభాగం పైగా కాందిశీకునిగా ఇటలీ, గ్రీకు ద్వీపాలలో గడిపాడు. ఎన్నో సాహసయాత్రలు చేశాడు. అద్భుతమైన కవితా ఖండికలు - దీర్ఘ కవితలు శ్రావ్యంగా గానం చేశాడు.
మనిషి స్వేచ్చకోసం సమాజంతో పోరాడి - పోరాడి అలసి సొలసిపోయాడు! అతని జీవితాన్ని ఏ సూత్రాలలో కొలవాలి, నైతికతా, మతవిశ్వాసమా? లేక దేవుని పది ఆదేశాలతోనా? చివరికి ఎక్కడ తేలాడు? తన వనరులన్నీ అవసరంలో ఉన్నవారికే ఉపయోగించాడు. పరాయి దేశమయిన గ్రీసుని, గ్రీకులని టర్కీల కోరల్నుంచి రక్షించాలని తన శక్తిని, సమయాన్ని, ధనాన్ని వెచ్చించి చివరికి తమ ముప్పయి అరవయేడు నిండకుండానే తనూ ఖర్చయిపోయాడు. షెల్లీ గంధర్వుడయితే, గోర్దాన్ల రాక్షసాంశతో జన్మించిన బైరన్, సమకాలీన సమాజంతో పోరాటం సలిపాడు. నైతిక సూత్రాలను తెంచుకుంటూ సాహసాలకు ఒడిగట్టాడు. నీతినియమాలను పాతరవేస్తూ తన సమాధిపై 'బైరన్' అని తనే చేక్కుకున్నాడు! అతని యాత్రల నుంచి, జీవితానుభవం నుండి ఉద్భవించింది. అద్భుతమైన కవితాధార - దానిని చవి చూడాలంటే ఆ వ్యక్తి జీవితాన్ని తరచి చూడాలి.
నైతిక జీవనానికి మత విశ్వాసంతో పనిలేదని, దైవచింతన అవసరం లేదని నమ్మిన పి బి షెల్లీని నాటి సమాజం నిరసించింది. దేశం నుండి వెలివేసింది. చివరికి కాందిశీకునిగా ఇటలీ పర్వత సానువుల్లో సముద్ర తీరాల వెంట పయనించి ఆ కవి, స్వాప్నికుడు, సాహసి, మూడపదులు నిండకనే మున్నీట పాలయ్యాడు. అతనికి సమీకాలీనుడు - బైరన్, మతవిశ్వాసాల మధ్య పెరిగినా, మనిషి దుఃఖానికి దేవుడే కారణమని నమ్మి - భౌతిక సుఖాల వేటలో నైతిక సూత్రాలను కూడా శృంఖలాలగానే భావించి స్వేచ్చాజీవిగా బ్రతకటానికి సాహసించాడు. అతన్ని, అప్పటి లండన్ సమాజం విమర్శలతో వెక్కిరించింది. అసూయతో అందలమెక్కించి దేశ సరిహద్దులను దాటించింది. తన జీవితంలో సగభాగం పైగా కాందిశీకునిగా ఇటలీ, గ్రీకు ద్వీపాలలో గడిపాడు. ఎన్నో సాహసయాత్రలు చేశాడు. అద్భుతమైన కవితా ఖండికలు - దీర్ఘ కవితలు శ్రావ్యంగా గానం చేశాడు. మనిషి స్వేచ్చకోసం సమాజంతో పోరాడి - పోరాడి అలసి సొలసిపోయాడు! అతని జీవితాన్ని ఏ సూత్రాలలో కొలవాలి, నైతికతా, మతవిశ్వాసమా? లేక దేవుని పది ఆదేశాలతోనా? చివరికి ఎక్కడ తేలాడు? తన వనరులన్నీ అవసరంలో ఉన్నవారికే ఉపయోగించాడు. పరాయి దేశమయిన గ్రీసుని, గ్రీకులని టర్కీల కోరల్నుంచి రక్షించాలని తన శక్తిని, సమయాన్ని, ధనాన్ని వెచ్చించి చివరికి తమ ముప్పయి అరవయేడు నిండకుండానే తనూ ఖర్చయిపోయాడు. షెల్లీ గంధర్వుడయితే, గోర్దాన్ల రాక్షసాంశతో జన్మించిన బైరన్, సమకాలీన సమాజంతో పోరాటం సలిపాడు. నైతిక సూత్రాలను తెంచుకుంటూ సాహసాలకు ఒడిగట్టాడు. నీతినియమాలను పాతరవేస్తూ తన సమాధిపై 'బైరన్' అని తనే చేక్కుకున్నాడు! అతని యాత్రల నుంచి, జీవితానుభవం నుండి ఉద్భవించింది. అద్భుతమైన కవితాధార - దానిని చవి చూడాలంటే ఆ వ్యక్తి జీవితాన్ని తరచి చూడాలి.© 2017,www.logili.com All Rights Reserved.