ఆచార్య కూతాటి వెంకటరెడ్డి 1931 సంవత్సరంలో ధనుజవరిపల్లె, గానుగపెంట గ్రామo చిత్తూరు జిల్లాలో జన్మించారు. తొలుత విద్యాబ్యాసం ఉన్నత పాఠశాల పాకలలో ప్రారంభమైంది. విద్యార్థి దశలో స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని అనేక పర్యాయాలు లాటి దెబ్బలు తిన్నారు. 6 నెలలు చిత్తూరు సెంట్రల్ జైలులో కారాగారవాసం కూడా అనుభవించారు. ఎం. ఎ. డిగ్రీ (అర్థశాస్త్రం) మద్రాసు విశ్వవిద్యాలయం నుండి పిహెచ్. డి., డిప్లమా యిన్ స్టాటిస్టిక్స్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుండి పొందారు. అధ్యాపక వృత్తిలో 1955 సంవత్సరంలో చేరి 36 సంవత్సరాలు (1955-91) అధ్యాపకుడుగా కొనసాగారు. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల తిరుపతి ఆంధ్రవిశ్వవిద్యాలయము విశాఖపట్నం, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అనంతపురంలలో అధ్యాపకులుగా పనిచేశారు. 1988-91 మధ్య వైస్ ఛాన్సలర్ గ పనిచేశారు. 20 గ్రంధాలూ 125 వ్యాసాలు ప్రచురించారు. 25 గురు విద్యార్థులు వీరి పర్యవేక్షణలో పరిశోధన పట్టాలు పొందారు. జాతీయ అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొన్నారు. 1982 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్త అధ్యాపక అవార్డు పొందారు. 1991 లో కవికోకిల రామిరెడ్డి ట్రస్ట్ ప్రముఖ సాంఘికవేత్త అవార్డును 2006లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం జీవిత సాఫల్య పురస్కారమును 2015 లో గ్రామీణ ప్లానింగ్ పరిశోధన సంస్థ విద్యాశిరోమని అవార్డును ప్రదానం చేశాయి. 2018లో శ్రీ వెంకటేశ్వర యూనివెర్సిటీ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ జీవిత సాఫల్య పురస్కారం తో సత్కరించింది.
- ఆచార్య కూతాటి వెంకట రెడ్డి