ప్రతిక్షణంలోనూ ఆనందంగా జీవించడమే జీవిత ధ్యేయం. కలిమిలోనైనా, లేమిలోనైనా, అపజయంలోనైనా, మానంలోనైనా, అవమానంలోనైనా, ఒంటరిగా ఉన్నా, సమూహంలో ఉన్నా, పుట్టుకలోనైనా, మరణంలోనైనా, అన్ని పరిస్థితుల్లోనూ, ఆనందంగా జీవించగలగాలి. కలిమిలోనే, జయంలోనే, మానంలోనే, ఆనందం వెదుకుతూ ఉన్నవారికి జీవిత ధ్యేయం అన్నది ఇంకా దక్కలేదన్నమాట. మన ఆనందం ఎంతో ప్రక్కవారి ఆనందమూ అంతే ముఖ్యం కావాలి. మన మౌనం మనకెంత ముఖ్యమో ప్రక్కవారి ఏకాంతము అంతే ముఖ్యం కావాలి. ఆ విధంగా జీవించగలగడమే జీవిహ ధ్యేయం. దీని పేరే ఆధ్యాత్మిక తత్త్వం.
దిగజారిన ప్రాపంచిక తత్త్వం అన్నది తనకు మాత్రమే జయాన్ని కోరి, ప్రక్కవారి జయాన్ని మటుకు కోరదు. దిగజారిన ప్రాపంచిక తత్త్వం అన్నది తనకు మాత్రమే సుఖాన్ని కోరి, ప్రక్కవారి సుఖాన్ని మటుకు కోరదు.........
అయితే జీవిత ధ్యేయంలో జీవించటమన్నది. జీవితంలో ఒకానొక ప్రధాన భాగం మాత్రమే. రెండవ ప్రధాన భాగం జీవిత కార్యక్రమాన్ని సూచిస్తుంది...
-బ్రహ్మర్షి పత్రీజీ.
© 2017,www.logili.com All Rights Reserved.