నా పదిహేడో ఏట 1970 లో పెళ్లి చేసుకుని చిత్తరంజన్ వెళ్లాను. 17 ఏళ్ళు అంటే 1987 దాకా అక్కడ ఉన్నాను. ఆ పదిహేడేళ్ళ నా జీవితమే ఈ జ్ఞాపకాల జావళి. ఆ పదిహేడేళ్ళలో ఎంతో మార్పు. అక్కడికి వెళ్ళే సమయానికి నాకు తెలుగు తప్ప, ఇంకో భాష రాదు. తల్లి చాటు బిడ్డను. ఒంటరిగా ఎక్కడికీ వెళ్లి ఎరగను. పరాయి మగవాళ్ళతో మాట్లాడాలంటే భయం. తిరిగి వచ్చే సమయానికి ఇంగ్లీష్, హిందీ ధారాళంగా మాట్లాడే నేర్పు, ఏ సభలోనైనా మాట్లాడగలిగే ధైర్యం, ఏ సమస్యనైనా అలవోకగా పరిష్కరించే నేర్పు సంపాదించుకున్నాను. బెంగాలీ భాష కూడా నేర్చుకున్నాను. ఎంత దూరమైనా ఒంటరిగా వెళ్ళగల ధైర్యం వచ్చింది. ఎంత పని అయినా అవలీలగా చెయ్యగల ఆత్మవిశ్వాసం వచ్చింది. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరి జీవితమూ ఒక జ్ఞాపకాల భాండాగారమే. అది ఇతరులతో పంచుకునే అదృష్టం నాకు కలిగింది. ఇదిగో జ్ఞాపకాల జావళి సవినయంగా మీ ముందుంచుతున్నాను.
నా పదిహేడో ఏట 1970 లో పెళ్లి చేసుకుని చిత్తరంజన్ వెళ్లాను. 17 ఏళ్ళు అంటే 1987 దాకా అక్కడ ఉన్నాను. ఆ పదిహేడేళ్ళ నా జీవితమే ఈ జ్ఞాపకాల జావళి. ఆ పదిహేడేళ్ళలో ఎంతో మార్పు. అక్కడికి వెళ్ళే సమయానికి నాకు తెలుగు తప్ప, ఇంకో భాష రాదు. తల్లి చాటు బిడ్డను. ఒంటరిగా ఎక్కడికీ వెళ్లి ఎరగను. పరాయి మగవాళ్ళతో మాట్లాడాలంటే భయం. తిరిగి వచ్చే సమయానికి ఇంగ్లీష్, హిందీ ధారాళంగా మాట్లాడే నేర్పు, ఏ సభలోనైనా మాట్లాడగలిగే ధైర్యం, ఏ సమస్యనైనా అలవోకగా పరిష్కరించే నేర్పు సంపాదించుకున్నాను. బెంగాలీ భాష కూడా నేర్చుకున్నాను. ఎంత దూరమైనా ఒంటరిగా వెళ్ళగల ధైర్యం వచ్చింది. ఎంత పని అయినా అవలీలగా చెయ్యగల ఆత్మవిశ్వాసం వచ్చింది. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరి జీవితమూ ఒక జ్ఞాపకాల భాండాగారమే. అది ఇతరులతో పంచుకునే అదృష్టం నాకు కలిగింది. ఇదిగో జ్ఞాపకాల జావళి సవినయంగా మీ ముందుంచుతున్నాను.© 2017,www.logili.com All Rights Reserved.