"I Thought, I Would Become Very Famous"
(రావిశాస్త్రి స్వగతం)
- అత్తలూరి నర్సింహారావు
ఏవిటి అలా చూస్తున్నారు? నేను రాచకొండ విశ్వనాధశాస్త్రిని. ఇంట్లో అందరూ విశ్వం అంటారు. బయట రావిశాస్త్రిగారంటారు. వూళ్ళో శాస్త్రి గారంటారు. బార్లో ఆర్వీయస్ అంటారు. మా క్లయింట్లు శాస్త్రి చాత్రిబాబంటారు.
నేను 1922 జులై 30న పుట్టేను. తెలుగు లెణ్ణ ప్రకారం శ్రావణ సప్తమి. అది దుందుభినామ సంవత్సరం. మన గురజాడ వెంకట అప్పారావు కూడా దుందుభిలోనే పుట్టేరని తెలిసినవాళ్ళు చెబితే తెలుసుకుని ఆహా అనుకున్నాను. నేను పుట్టినప్పుడు పెద్ద గాలివాన అని మా పెద్దవాళ్ళు చెబితే తెలుసుకుని ఓహె అనుకున్నాను. మా అమ్మ ఇరవయ్యో ఏటా, మా నాన్న ముప్పయ్యో ఏటా వున్నప్పుడు నేను పుట్టేనని మా నాన్న అంటూవుంటే విని వూహూ అనుకున్నాను.
నేను పుట్టింది మా మేనమావల ఇంట్లోననీ, ఆ ఇల్లు శ్రీకాకుళంలో వుందనీ తెలుసుకున్నాను. మా మేనమావల ఇంటి పేరు తెన్నేటివారనీ, నేను పెరిగింది. అనకాపల్లి దగ్గరున్న తుమ్మపాలలోననీ కూడా నేను పెద్దయ్యాక తెలుసుకున్నాను
1932 లో మా నాన్న ప్రాక్టీసు మానేసి తుమ్మపాలలో వ్యవసాయం పెట్టేరు. అందువల్ల ఎక్కువగా తుమ్మపాల వెళ్ళివచ్చేవాడ్ని. రోజూ రెండుమైళ్ళు అనకాపల్లి నడిచి వెళ్ళి పుస్తకాలు చదివేవాడ్ని.
మా నాన్న ప్లీడరుగా పదేళ్ళే ప్రాక్టీసుచేసేరు. ఆ వృత్తిలో ఉండలేక వ్యవసాయం చేసేరాయన. నేను వ్యవసాయం చెయ్యలేక, ఇష్టం ఉన్నా లేకపోయినా ప్లీడరీ వృత్తిలోనే ఉండిపోయేన్నేను............
"I Thought, I Would Become Very Famous" (రావిశాస్త్రి స్వగతం) - అత్తలూరి నర్సింహారావు ఏవిటి అలా చూస్తున్నారు? నేను రాచకొండ విశ్వనాధశాస్త్రిని. ఇంట్లో అందరూ విశ్వం అంటారు. బయట రావిశాస్త్రిగారంటారు. వూళ్ళో శాస్త్రి గారంటారు. బార్లో ఆర్వీయస్ అంటారు. మా క్లయింట్లు శాస్త్రి చాత్రిబాబంటారు. నేను 1922 జులై 30న పుట్టేను. తెలుగు లెణ్ణ ప్రకారం శ్రావణ సప్తమి. అది దుందుభినామ సంవత్సరం. మన గురజాడ వెంకట అప్పారావు కూడా దుందుభిలోనే పుట్టేరని తెలిసినవాళ్ళు చెబితే తెలుసుకుని ఆహా అనుకున్నాను. నేను పుట్టినప్పుడు పెద్ద గాలివాన అని మా పెద్దవాళ్ళు చెబితే తెలుసుకుని ఓహె అనుకున్నాను. మా అమ్మ ఇరవయ్యో ఏటా, మా నాన్న ముప్పయ్యో ఏటా వున్నప్పుడు నేను పుట్టేనని మా నాన్న అంటూవుంటే విని వూహూ అనుకున్నాను. నేను పుట్టింది మా మేనమావల ఇంట్లోననీ, ఆ ఇల్లు శ్రీకాకుళంలో వుందనీ తెలుసుకున్నాను. మా మేనమావల ఇంటి పేరు తెన్నేటివారనీ, నేను పెరిగింది. అనకాపల్లి దగ్గరున్న తుమ్మపాలలోననీ కూడా నేను పెద్దయ్యాక తెలుసుకున్నాను 1932 లో మా నాన్న ప్రాక్టీసు మానేసి తుమ్మపాలలో వ్యవసాయం పెట్టేరు. అందువల్ల ఎక్కువగా తుమ్మపాల వెళ్ళివచ్చేవాడ్ని. రోజూ రెండుమైళ్ళు అనకాపల్లి నడిచి వెళ్ళి పుస్తకాలు చదివేవాడ్ని. మా నాన్న ప్లీడరుగా పదేళ్ళే ప్రాక్టీసుచేసేరు. ఆ వృత్తిలో ఉండలేక వ్యవసాయం చేసేరాయన. నేను వ్యవసాయం చెయ్యలేక, ఇష్టం ఉన్నా లేకపోయినా ప్లీడరీ వృత్తిలోనే ఉండిపోయేన్నేను............© 2017,www.logili.com All Rights Reserved.