సమకాలీన పాఠక లోకానికి రచయిత శ్రీ ముత్తేవి రవీంద్రనాథ్ సుపరిచితులు. వీరు స్వయం కృషితో వివిథ బాషలు, సాహిత్యం, చరిత్ర, తత్వశాస్త్రం, విజ్ఞానశాస్త్రాలు వంటి భిన్నాంశాలపై పట్టు సాధించారు. హేతుదృష్టి, లోతైన పరిశీలన కలిగి, వీరి రచనలు చదువరులను ఆకట్టుకుని ఆలోచింప జేస్తాయి. పాఠకులలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి లక్ష్యంగా వీరు ప్రాచీన కావ్యాలకు సైతం ఆధునిక దృష్టితో శాస్త్రీయ వ్యాఖ్యానాలు రాసి, తెలుగు సాహిత్యంలో ఒక సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. వీరు రాసిన గ్రంథాలేకాక, పలు తెలుగు, ఇంగ్లీష్ దిన, వార, మాస పత్రికల్లో అసంఖ్యాకంగా ప్రచురితమైన వీరి వ్యాసాలు, వీరి బహుముఖ ప్రజ్ఞకు అడ్డం పడతాయి.
కవి, నాటక కర్త, భావకుడు, భావ విప్లవకారుడు, హేతువాది, సంస్కర్త, నాస్తికాగ్రణి, ఆర్ష సాహిత్యాబ్దిని అలవోకగా ఆపోసనపట్టిన అగస్త్యుడు, పురాణేతిహాసాల లోగుట్టును రట్టు చేసి, దురాచారాన్ని తనుమాడిన క్రాంతదర్శి, సంఘ సంస్కరణే ధ్యేయంగా ప్రత్యామ్నాయ సాహితీ సృజన చేసిన అపర కౌశికుడు, బారిష్టరు, శతావధాని, "కవిరాజు" త్రిపురనేని రామస్వామి చౌదరిగారి బహుముఖీనమైన కృషికి ఇలా ఈ చిన్న పుస్తకం ద్వారా నివాళులర్పించబూనడం నిజంగా నాబోటి సామాన్యుడికి సాహసమే. అయినా వారి పట్ల నాకున్న అపరిమితమైన అభిమానమే నన్నీ సాహసానికి పురికొల్పింది - "కవిరాజు"
- ముత్తేవి రవీంద్రనాథ్
సమకాలీన పాఠక లోకానికి రచయిత శ్రీ ముత్తేవి రవీంద్రనాథ్ సుపరిచితులు. వీరు స్వయం కృషితో వివిథ బాషలు, సాహిత్యం, చరిత్ర, తత్వశాస్త్రం, విజ్ఞానశాస్త్రాలు వంటి భిన్నాంశాలపై పట్టు సాధించారు. హేతుదృష్టి, లోతైన పరిశీలన కలిగి, వీరి రచనలు చదువరులను ఆకట్టుకుని ఆలోచింప జేస్తాయి. పాఠకులలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి లక్ష్యంగా వీరు ప్రాచీన కావ్యాలకు సైతం ఆధునిక దృష్టితో శాస్త్రీయ వ్యాఖ్యానాలు రాసి, తెలుగు సాహిత్యంలో ఒక సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. వీరు రాసిన గ్రంథాలేకాక, పలు తెలుగు, ఇంగ్లీష్ దిన, వార, మాస పత్రికల్లో అసంఖ్యాకంగా ప్రచురితమైన వీరి వ్యాసాలు, వీరి బహుముఖ ప్రజ్ఞకు అడ్డం పడతాయి. కవి, నాటక కర్త, భావకుడు, భావ విప్లవకారుడు, హేతువాది, సంస్కర్త, నాస్తికాగ్రణి, ఆర్ష సాహిత్యాబ్దిని అలవోకగా ఆపోసనపట్టిన అగస్త్యుడు, పురాణేతిహాసాల లోగుట్టును రట్టు చేసి, దురాచారాన్ని తనుమాడిన క్రాంతదర్శి, సంఘ సంస్కరణే ధ్యేయంగా ప్రత్యామ్నాయ సాహితీ సృజన చేసిన అపర కౌశికుడు, బారిష్టరు, శతావధాని, "కవిరాజు" త్రిపురనేని రామస్వామి చౌదరిగారి బహుముఖీనమైన కృషికి ఇలా ఈ చిన్న పుస్తకం ద్వారా నివాళులర్పించబూనడం నిజంగా నాబోటి సామాన్యుడికి సాహసమే. అయినా వారి పట్ల నాకున్న అపరిమితమైన అభిమానమే నన్నీ సాహసానికి పురికొల్పింది - "కవిరాజు" - ముత్తేవి రవీంద్రనాథ్© 2017,www.logili.com All Rights Reserved.