ఈ ప్రశ్న వేల ఏళ్లుగా జిజ్ఞాసువుల౦దరిలో ఆసక్తిని రేకేత్తిస్తూనే ఉంది. మనం చూస్తున్నదంతా వాస్తవమేనా? భ్రమా? జ్ఞానసముపార్జనలో మనం ఆధారపడదగిన మార్గాలేమిటి? భావం పదార్థాన్ని సృష్టి౦చిందా? ఈ విశ్వాన్నీ, ప్రకృతినీ, మానవజాతినీ, ఎవరైనా సృష్టించారా? లేక అవన్నీ పదార్థం యొక్క పరిణామ ఫలితాలా? పోనీ - వీటన్నిటి సృష్టికర్త దైవం అనుకుంటే, మరి ఆ దైవాన్ని ఎవరు సృష్టించారు? - ఇలాంటి ప్రశ్నలన్నీ తరతరాల తాత్వికుల మెదళ్ళను తోలిచేశాయి.
ఈ పుస్తకంలో ప్రముఖ రచయిత ముత్తేవి రవీంద్రనాథ్ శాస్త్ర విజ్ఞానం యొక్క క్రమ పురోగతి ఏ విధంగా భౌతికవాదం తిరుగులేనిదని రుజువుచేసిందో, అదే ప్రగతి ఏ విధంగా భావవాద 'దైవ' సిద్ధాంతాలను అశాస్త్రీయాలుగా తెల్చేసిందో వివిధ ఆధునిక విజ్ఞాన శాస్త్రాల తాజా పరిశోధనా ఫలితాలను ఉదాహరిస్తూ వివరించారు. రచయితా వాడిన సరళమైన భాష, లోకప్రియ శైలి అత్యంత జటిలమైన తాత్విక సిద్ధాంతాలను సైతం ద్రాక్షపాకం చేసి పాఠకులకు అందించాయి. చదివిన ప్రతివారినీ ఈ పుస్తకం ఆలోచింపజేస్తుంది. కనుకనే ఇది ప్రతి ఒక్కరూ - ప్రత్యేకించి యువతరం - చదివి తీరాల్సిన అమూల్య గ్రంథం.
- విజ్ఞాన వేదిక పబ్లికేషన్స్
ఈ ప్రశ్న వేల ఏళ్లుగా జిజ్ఞాసువుల౦దరిలో ఆసక్తిని రేకేత్తిస్తూనే ఉంది. మనం చూస్తున్నదంతా వాస్తవమేనా? భ్రమా? జ్ఞానసముపార్జనలో మనం ఆధారపడదగిన మార్గాలేమిటి? భావం పదార్థాన్ని సృష్టి౦చిందా? ఈ విశ్వాన్నీ, ప్రకృతినీ, మానవజాతినీ, ఎవరైనా సృష్టించారా? లేక అవన్నీ పదార్థం యొక్క పరిణామ ఫలితాలా? పోనీ - వీటన్నిటి సృష్టికర్త దైవం అనుకుంటే, మరి ఆ దైవాన్ని ఎవరు సృష్టించారు? - ఇలాంటి ప్రశ్నలన్నీ తరతరాల తాత్వికుల మెదళ్ళను తోలిచేశాయి. ఈ పుస్తకంలో ప్రముఖ రచయిత ముత్తేవి రవీంద్రనాథ్ శాస్త్ర విజ్ఞానం యొక్క క్రమ పురోగతి ఏ విధంగా భౌతికవాదం తిరుగులేనిదని రుజువుచేసిందో, అదే ప్రగతి ఏ విధంగా భావవాద 'దైవ' సిద్ధాంతాలను అశాస్త్రీయాలుగా తెల్చేసిందో వివిధ ఆధునిక విజ్ఞాన శాస్త్రాల తాజా పరిశోధనా ఫలితాలను ఉదాహరిస్తూ వివరించారు. రచయితా వాడిన సరళమైన భాష, లోకప్రియ శైలి అత్యంత జటిలమైన తాత్విక సిద్ధాంతాలను సైతం ద్రాక్షపాకం చేసి పాఠకులకు అందించాయి. చదివిన ప్రతివారినీ ఈ పుస్తకం ఆలోచింపజేస్తుంది. కనుకనే ఇది ప్రతి ఒక్కరూ - ప్రత్యేకించి యువతరం - చదివి తీరాల్సిన అమూల్య గ్రంథం. - విజ్ఞాన వేదిక పబ్లికేషన్స్
© 2017,www.logili.com All Rights Reserved.