క్రీ.శ. 1509 మొదలు ఇరవై ఒక్క సంవత్సరాల పాటు సువిశాలమైన విజయనగర సామ్రాజ్యాన్ని జనరంజకంగా పాలించిన ఆదర్శ పాలకుడు శ్రీకృష్ణదేవరాయలు. కవి పండిత పోషణలో 'ఆంద్ర భోజుడ'ని పేరుగాంచిన రాయలవారి పాలనాకాలం తెలుగు భాషా సాహిత్యాలకు స్వర్ణయుగం. ఆయన తెలుగుకు, తెలుగువారికి చేసిన సేవలు వెల కట్టలేనివి. ఆయన తమ వాడేనంటూ వివిధ సామాజిక వర్గాల వారు పోటీపడుతూ ఉండడం ఆయన పట్ల ప్రజలలో నేటికీ ఉన్న ఆరాధన భావానికి తార్కాణం. మితిమీరిన ఈ ప్రేమాభిమానాల కారణంగా రాయలవారి చరిత్రకు కొంతమేరకు నష్టమే జరిగింది.
ఆయన వంశ మూలాలకు సంబంధించిన చారిత్రిక సత్యాలు కొన్ని విస్మరించబడ్డాయి. మరికొన్ని ఉద్దేశపూర్వకంగా వక్రీకరించబడ్డాయి. ఇదే సందని కొందరు కన్నడిగులు పదహారణాల తెలుగువాడైన ఆయన్ని తమవాడని ప్రకటించే సాహసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ రచయిత, పరిశోధకులు శ్రీ ముత్తేవి రవీంద్రనాథ్ చారిత్రక దృష్టితో రాయలవారి వంశమూలాలపై లోతైన పరిశీలన చేసి, సాహిత్య, శాసనాధారాల సాయంతో వెలువరించిన సిద్ధాంత గ్రంథమిది. రచయిత పూర్వ రచనల వలనే ఈ పుస్తకం కూడా విశేష పాఠకాదరణ పొందగలదని మా ప్రగాఢ విశ్వాసం.
క్రీ.శ. 1509 మొదలు ఇరవై ఒక్క సంవత్సరాల పాటు సువిశాలమైన విజయనగర సామ్రాజ్యాన్ని జనరంజకంగా పాలించిన ఆదర్శ పాలకుడు శ్రీకృష్ణదేవరాయలు. కవి పండిత పోషణలో 'ఆంద్ర భోజుడ'ని పేరుగాంచిన రాయలవారి పాలనాకాలం తెలుగు భాషా సాహిత్యాలకు స్వర్ణయుగం. ఆయన తెలుగుకు, తెలుగువారికి చేసిన సేవలు వెల కట్టలేనివి. ఆయన తమ వాడేనంటూ వివిధ సామాజిక వర్గాల వారు పోటీపడుతూ ఉండడం ఆయన పట్ల ప్రజలలో నేటికీ ఉన్న ఆరాధన భావానికి తార్కాణం. మితిమీరిన ఈ ప్రేమాభిమానాల కారణంగా రాయలవారి చరిత్రకు కొంతమేరకు నష్టమే జరిగింది. ఆయన వంశ మూలాలకు సంబంధించిన చారిత్రిక సత్యాలు కొన్ని విస్మరించబడ్డాయి. మరికొన్ని ఉద్దేశపూర్వకంగా వక్రీకరించబడ్డాయి. ఇదే సందని కొందరు కన్నడిగులు పదహారణాల తెలుగువాడైన ఆయన్ని తమవాడని ప్రకటించే సాహసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ రచయిత, పరిశోధకులు శ్రీ ముత్తేవి రవీంద్రనాథ్ చారిత్రక దృష్టితో రాయలవారి వంశమూలాలపై లోతైన పరిశీలన చేసి, సాహిత్య, శాసనాధారాల సాయంతో వెలువరించిన సిద్ధాంత గ్రంథమిది. రచయిత పూర్వ రచనల వలనే ఈ పుస్తకం కూడా విశేష పాఠకాదరణ పొందగలదని మా ప్రగాఢ విశ్వాసం.© 2017,www.logili.com All Rights Reserved.