సాహసాలకు పెట్టింది పేరు. తను అనుకున్నది సాధించేవరకు వదిలిపెట్టని ధీరుడు. ఆయనకు నటశేఖరుడు, ఆంద్ర జేమ్స్ బాండ్, డాక్టరేట్ వచ్చినా ఆయన హీరో కృష్ణగానే ప్రసిద్ధుడు. సినిమా ప్రపంచంలో ఎవరినైనా ఫలానా అని ఇంటిపేరుతోగానీ, అసలు పేరుతోగానీ పిలుస్తారు. ఆయనకు మాత్రం హీరో అనేది ఇంటిపేరయ్యింది. ఆయనే ఘట్టమనేని శివరామకృష్ణ. ఆయన ఇదో అక్షరరూపం. ప్రతీ మనిషి జీవితంలోనూ మిట్టపల్లలుంటాయి., సుఖదుఃఖాలున్నాయి. ఆయన జీవితంలోనూ వున్నాయి. అవి సాహసంగా ఎదుర్కొని దానినే తనకు మారుపేరుగా మార్చుకున్నారు. కృష్ణకు మారుపేరు సాహసం అని అనిపించుకొని శిఖరాలని అధిరోహించారు.
సూపర్ స్టార్ గా, నిర్మాతగా, దర్శకుడిగా, ఎడిటర్ గా, స్టూడియో అధినేతగా, రాజకీయవేత్తగా జీవితంలో ఎన్నో పాత్రలను పోషించడమేకాకుండా, సినిమాస్కోప్ లాంటి ఎన్నో కొత్త సాంకేతికలను తెలుగు సినిమాకు పరిచయం చేశారు. ఎన్నో భాషల్లో సినిమాలు నిర్మించారు, తెలుగు, హిందీ భాషల్లో దర్శకత్వం వహించారు. 360 సినిమాలలో నటించారు. ఒక నటుడిగా తన పని తానూ చేసుకుని వెళ్ళిపోకుండా సినిమా మొదలు నుండి తుది వరకు నిర్మాతకు అండగావుండే ధర్మశీలి. అటువంటి మహామనిషి జీవితచరిత్ర ఇది. ఆయన మాటల్లోనే విందాం.
సాహసాలకు పెట్టింది పేరు. తను అనుకున్నది సాధించేవరకు వదిలిపెట్టని ధీరుడు. ఆయనకు నటశేఖరుడు, ఆంద్ర జేమ్స్ బాండ్, డాక్టరేట్ వచ్చినా ఆయన హీరో కృష్ణగానే ప్రసిద్ధుడు. సినిమా ప్రపంచంలో ఎవరినైనా ఫలానా అని ఇంటిపేరుతోగానీ, అసలు పేరుతోగానీ పిలుస్తారు. ఆయనకు మాత్రం హీరో అనేది ఇంటిపేరయ్యింది. ఆయనే ఘట్టమనేని శివరామకృష్ణ. ఆయన ఇదో అక్షరరూపం. ప్రతీ మనిషి జీవితంలోనూ మిట్టపల్లలుంటాయి., సుఖదుఃఖాలున్నాయి. ఆయన జీవితంలోనూ వున్నాయి. అవి సాహసంగా ఎదుర్కొని దానినే తనకు మారుపేరుగా మార్చుకున్నారు. కృష్ణకు మారుపేరు సాహసం అని అనిపించుకొని శిఖరాలని అధిరోహించారు. సూపర్ స్టార్ గా, నిర్మాతగా, దర్శకుడిగా, ఎడిటర్ గా, స్టూడియో అధినేతగా, రాజకీయవేత్తగా జీవితంలో ఎన్నో పాత్రలను పోషించడమేకాకుండా, సినిమాస్కోప్ లాంటి ఎన్నో కొత్త సాంకేతికలను తెలుగు సినిమాకు పరిచయం చేశారు. ఎన్నో భాషల్లో సినిమాలు నిర్మించారు, తెలుగు, హిందీ భాషల్లో దర్శకత్వం వహించారు. 360 సినిమాలలో నటించారు. ఒక నటుడిగా తన పని తానూ చేసుకుని వెళ్ళిపోకుండా సినిమా మొదలు నుండి తుది వరకు నిర్మాతకు అండగావుండే ధర్మశీలి. అటువంటి మహామనిషి జీవితచరిత్ర ఇది. ఆయన మాటల్లోనే విందాం.© 2017,www.logili.com All Rights Reserved.