1999 లో డా. అక్కిరాజు రామాపతిరావు గారు శ్రీ తిరుమల రామచంద్రగారు ' ఆంధ్ర ప్రభ సచిత్రవరపత్రిక' (1962 - 64 ) లో 'మరపురాని మనిషి' శీర్షికన వ్రాసిన వ్యాసాల గురించి శ్రీ అప్పాజోస్యుల సత్యనారాయణ గారితో ప్రస్తావించడం జరిగింది. దాని తాలూకు కటింగ్స్ చూసి, చదివి అబ్బురపడిపోయిన శ్రీ సత్యనారాయణ గారికి వాటిని పుస్తక రూపంలో తేవాలన్న కోరిక బలంగా కలిగింది. ప్రచురితమైన ఫొటోలే కాక ఆయా మహానుభావుల ఫోటోలు మరెన్నింటినో శ్రీ నీలం రాజు మురళీధర్ గారు తీసి ఉన్నారని తెలిసి రావడంతో ఆనందం అవధులు దాటింది. అంతే! వెంటనే శ్రీ మురళీధర్ గారిని కలిసి వారు తీసిన ఫొటోలన్నింటిని ఇస్తే మరుపురాని మనిషి వ్యాసాలన్నింటిని కలిపి ఒక అపురూప గ్రంథంగా అచ్చేయించాలని ఉన్నదని శ్రీ సత్యనారాయణగారు తన కోరికను తెలియజెప్పారు.
- నీలం రాజు మురళీధర్