మలాలా! ఈ పేరు ఒక స్ఫూర్తి. ఒక ఉత్తేజం. ఒక దీక్ష. మలాలా పుట్టింది ఎంతో వెనుక బడిన ప్రాంతంలోని ఒక అభ్యుదయ భావాలున్న కుటుంబంలో. తండ్రి అభ్యుదయభావాలను పుణికి పుచ్చుకుంది మలాలా. వాటి వ్యాప్తి కోసం అంతే తపించింది, శ్రమించింది. ఆ చిన్న వయస్సులో బాలికల చదువుకోసం ఆమె తీసుకున్న చొరవే ఆమెను మనకు ఆదర్శంగా నిలిపింది. ఒక బాలిక - ఒక టీచర్ - ఒక పుస్తకం - ఒక కలం - అని అంతర్జాతీయ వేదిక ఐక్యరాజ్య సమితి నుండి పిలుపునివ్వడంతో దేశ దేశాలు ఆ పిలుపును బాలికల అభ్యున్నతికి అందిపుచ్చుకున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ ఒకసారి ఆత్మ పరిశీలన చేస్తున్నాయి.
మలాలా మనలను స్వాత్ వాలికి తీసుకుపోయింది. అక్కడి పిల్ల తెమ్మరలు మనలను పులకింపజేస్తాయి. నునువెచ్చటి సూర్యకిరణాలు మనలను పరవశింపచేస్తాయి. అందమైన ఆ ప్రకృతితో పాటు వికృతమయిన తాలిబాన్ల ఘాతుకాలనూ మనకు కళ్ళకు కట్టేంత సునిశితంగా చిత్రించింది. మత మౌడ్యానికి మానవత్వానికి ఎంత దూరమో మనం ఈ ఆత్మకథలో చూస్తాం.
మలాలా! ఈ పేరు ఒక స్ఫూర్తి. ఒక ఉత్తేజం. ఒక దీక్ష. మలాలా పుట్టింది ఎంతో వెనుక బడిన ప్రాంతంలోని ఒక అభ్యుదయ భావాలున్న కుటుంబంలో. తండ్రి అభ్యుదయభావాలను పుణికి పుచ్చుకుంది మలాలా. వాటి వ్యాప్తి కోసం అంతే తపించింది, శ్రమించింది. ఆ చిన్న వయస్సులో బాలికల చదువుకోసం ఆమె తీసుకున్న చొరవే ఆమెను మనకు ఆదర్శంగా నిలిపింది. ఒక బాలిక - ఒక టీచర్ - ఒక పుస్తకం - ఒక కలం - అని అంతర్జాతీయ వేదిక ఐక్యరాజ్య సమితి నుండి పిలుపునివ్వడంతో దేశ దేశాలు ఆ పిలుపును బాలికల అభ్యున్నతికి అందిపుచ్చుకున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ ఒకసారి ఆత్మ పరిశీలన చేస్తున్నాయి. మలాలా మనలను స్వాత్ వాలికి తీసుకుపోయింది. అక్కడి పిల్ల తెమ్మరలు మనలను పులకింపజేస్తాయి. నునువెచ్చటి సూర్యకిరణాలు మనలను పరవశింపచేస్తాయి. అందమైన ఆ ప్రకృతితో పాటు వికృతమయిన తాలిబాన్ల ఘాతుకాలనూ మనకు కళ్ళకు కట్టేంత సునిశితంగా చిత్రించింది. మత మౌడ్యానికి మానవత్వానికి ఎంత దూరమో మనం ఈ ఆత్మకథలో చూస్తాం.© 2017,www.logili.com All Rights Reserved.