దేశం అత్యధికంగా ప్రేమించే ఉపాధ్యాయుని స్మృతిలో..
తన మాటలు, ఆలోచనలు, జీవితమూ ఎన్నో విధాలుగా సామాన్య జనాల కోసం పాఠ్యంశాలుగా మలచుకొన్న డా కలాం గారిని, సాధారణంగా ఒక గొప్ప ఉపాధ్యాయుడు గానే అందరూ గుర్తు చేసుకుంటారు. వారి శిష్యుడు శ్రిజన్ పాల్ సింగ్ రచించిన ఈ గ్రంథం వారికొక ఉత్తమ నివాళి. శ్రిజన్, డా కలాంగారి చివరి రోజులలోనూ వారితోనే ఉన్నారు. వారు తరగతి బయట అతనికి నేర్పిన జీవితపు విలువలు, బాసలు, అందించిన సందేశాలను గుర్తు చేసుకుంటూ, వాటిని పాఠకులతో ఈ గ్రంథం ద్వారా పంచుకుంటున్నారు శ్రిజన్.
కలాం గారి దినచర్య, వారు చేసిన యాత్రలు, జాతీయ - అంతర్జాతీయ విషయాలపై పునరాలోచింపజేసే సంభాషణలు, వృత్తాంతాలు, ఛలోక్తులు గల ఈ గ్రంథం, ఒక మహనీయుడైన భారతీయుని జీవితంలోకి తొంగి చూడగలిగే అవకాశాన్ని చదువరులకు కలిగిస్తుంది. తెలిసిన ఎన్నో పిట్ట కథలు, మునుపు ఎన్నడూ చూడని ఛాయాచిరాలు, సరళభావాలు ఉన్న ఈ పుస్తకం, ఆర్ద్రతతో నిండిన స్పూర్తిని, ఆహ్లాదాన్ని కలిగించే డా కలాంగారి చరిత్ర. మనం అత్యధికంగా ప్రేమించే ఒక మహానాయకుని కీర్తికి శాశ్వతం కలిగించే గ్రంథం ఇది.
దేశం అత్యధికంగా ప్రేమించే ఉపాధ్యాయుని స్మృతిలో.. తన మాటలు, ఆలోచనలు, జీవితమూ ఎన్నో విధాలుగా సామాన్య జనాల కోసం పాఠ్యంశాలుగా మలచుకొన్న డా కలాం గారిని, సాధారణంగా ఒక గొప్ప ఉపాధ్యాయుడు గానే అందరూ గుర్తు చేసుకుంటారు. వారి శిష్యుడు శ్రిజన్ పాల్ సింగ్ రచించిన ఈ గ్రంథం వారికొక ఉత్తమ నివాళి. శ్రిజన్, డా కలాంగారి చివరి రోజులలోనూ వారితోనే ఉన్నారు. వారు తరగతి బయట అతనికి నేర్పిన జీవితపు విలువలు, బాసలు, అందించిన సందేశాలను గుర్తు చేసుకుంటూ, వాటిని పాఠకులతో ఈ గ్రంథం ద్వారా పంచుకుంటున్నారు శ్రిజన్. కలాం గారి దినచర్య, వారు చేసిన యాత్రలు, జాతీయ - అంతర్జాతీయ విషయాలపై పునరాలోచింపజేసే సంభాషణలు, వృత్తాంతాలు, ఛలోక్తులు గల ఈ గ్రంథం, ఒక మహనీయుడైన భారతీయుని జీవితంలోకి తొంగి చూడగలిగే అవకాశాన్ని చదువరులకు కలిగిస్తుంది. తెలిసిన ఎన్నో పిట్ట కథలు, మునుపు ఎన్నడూ చూడని ఛాయాచిరాలు, సరళభావాలు ఉన్న ఈ పుస్తకం, ఆర్ద్రతతో నిండిన స్పూర్తిని, ఆహ్లాదాన్ని కలిగించే డా కలాంగారి చరిత్ర. మనం అత్యధికంగా ప్రేమించే ఒక మహానాయకుని కీర్తికి శాశ్వతం కలిగించే గ్రంథం ఇది.© 2017,www.logili.com All Rights Reserved.