శాస్త్ర అవగాహన, శాస్త్రీయమైన అవగాహన, హేతుబద్ధమైన ఆలోచనలతో
జీవిత పరమార్థం, జీవితాశయాల నిశ్చితజ్ఞానంతో
స్వార్థనిస్వార్థాల వివేచనతో
విశ్వం, సృష్టి, ప్రకృతి శక్తుల పట్ల విస్మయంతో
వైజ్ఞానిక ప్రగతిపై అచంచల విశ్వాసంతో
అభివృద్ధిఫలాలు అందని అభాగ్యులపట్ల అంతులేని సానుభూతితో
అంతరాలను తొలగించాలన్న ఆచరణాత్మక ప్రయత్నంతో
సత్యం మీద తిరుగులేని నమ్మకంతో
కృషిపై గౌరవంతో
సమాజం పట్ల స్పష్టమైన వైఖరితో
మానవ జీవిత అశాశ్వతత్వం గుర్తెరిగి
ముందుకు సాగడమే తప్ప మరొక మార్గం లేదని గ్రహించి
తోటి మానవుల పట్ల స్పందన హృదయం కలిగిన వ్యక్తి మనసులో మెదలిన భావాలివి.
కవితారూపంలో వికసించిన కుసుమాలివి.