యూదు బాలిక జర్మనీలో ఫ్రాంక్ ఫర్ట్ నగరంలో పుట్టింది. ఆమె నాలుగేళ్ల పాపగా ఉండగా జర్మనీ నాజీల అదుపులోకి వచ్చేసింది. ఫ్రాంక్ కుటుంబం ఆంస్టర్ డాంకి తరలి వెళ్ళిపోయింది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలు 1940 లో నెదర్లాండ్స్ ని ఆక్రమించుకున్నారు. 1942 జులై నుంచి నెదర్లాండ్స్ లో ఉన్న యూదులను నాజీలు మరింతగా హింసించడం మొదలుపెట్టారు. అప్పుడే ఆ కుటుంబానికి రహస్య జీవనం మొదలయింది. 1944 ఆగస్టులో ఒక ద్రోహం వల్ల వారు నాజీలకు దొరికిపోయారు.
దాదాపు రహస్య జీవితం గడిపినంతకాలం ఆన్ ఫ్రాంక్ డైరీ రాసుకుంది. నాజీల నిర్బంధ శిబిరంలో ఆమె చనిపోయింది. ఆమె తండ్రి ఒట్లో ఫ్రాంక్ తప్ప మిగిలిన కుటుంబ సభ్యులందరూ నాజీ శిబిరాల్లోనే చనిపోయారు. రహస్య కాలంలో ఆ కుటుంబానికి సహాయకునిగా ఉన్న మియప్ గీస చేతిలో ఆమె డైరీ భద్రంగా ఉంది. నాజీ శిబిరాన్నుంచి ఒట్లో ఫ్రాంక్ బ్రతికి బయటికి వచ్చాక ఆ డైరీని వారు ముద్రించారు. అదే మీరు చదవబోయే డైరీ.
యూదు బాలిక జర్మనీలో ఫ్రాంక్ ఫర్ట్ నగరంలో పుట్టింది. ఆమె నాలుగేళ్ల పాపగా ఉండగా జర్మనీ నాజీల అదుపులోకి వచ్చేసింది. ఫ్రాంక్ కుటుంబం ఆంస్టర్ డాంకి తరలి వెళ్ళిపోయింది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలు 1940 లో నెదర్లాండ్స్ ని ఆక్రమించుకున్నారు. 1942 జులై నుంచి నెదర్లాండ్స్ లో ఉన్న యూదులను నాజీలు మరింతగా హింసించడం మొదలుపెట్టారు. అప్పుడే ఆ కుటుంబానికి రహస్య జీవనం మొదలయింది. 1944 ఆగస్టులో ఒక ద్రోహం వల్ల వారు నాజీలకు దొరికిపోయారు. దాదాపు రహస్య జీవితం గడిపినంతకాలం ఆన్ ఫ్రాంక్ డైరీ రాసుకుంది. నాజీల నిర్బంధ శిబిరంలో ఆమె చనిపోయింది. ఆమె తండ్రి ఒట్లో ఫ్రాంక్ తప్ప మిగిలిన కుటుంబ సభ్యులందరూ నాజీ శిబిరాల్లోనే చనిపోయారు. రహస్య కాలంలో ఆ కుటుంబానికి సహాయకునిగా ఉన్న మియప్ గీస చేతిలో ఆమె డైరీ భద్రంగా ఉంది. నాజీ శిబిరాన్నుంచి ఒట్లో ఫ్రాంక్ బ్రతికి బయటికి వచ్చాక ఆ డైరీని వారు ముద్రించారు. అదే మీరు చదవబోయే డైరీ.© 2017,www.logili.com All Rights Reserved.