నీలంరాజు లక్ష్మీ ప్రసాద్
సావధానత సావధానత అంటే సావధానతే
ఎవరో సాధకుడు వచ్చి, ఇక్యూ (Ikkyu) అనే జెన్ మాస్టర్ని "గొప్ప సంయక్ జ్ఞానాన్ని (wisdom) తెలియజేసే సూత్రాలను రాసిస్తారా ?" అని అడిగాడు. అందుకు సమాధానంగా ఇక్యూ సావధాన్ అని కాగితం మీద రాసి ఇచ్చాడు. కేవలం అంతే నంటారా? మరేదైనా కలుపుతారా" అన్నాడు ఆ సాధకుడు.
అప్పుడు ఇక్యూ ఆ కాగితం మీద "సావధాన్, సావధాన్" అని రెండుసార్లు రాశాడు.
ఆ సాధకునికి కొంత చిరాకేసింది కానీ మీరిప్పుడు రాసిన దానిలో ఆట్టే లోతుగానీ పెద్దగా సూక్ష్మత గానీ నాకేమీ కనిపించడం లేదు" అన్నాడు.
అప్పుడు ఇక్యూ ఆ కాగితంమీద ముమ్మారు "సావధాన్" అనే పదాన్నే మళ్లీ రాశాడు. "సావధాన్, సావధాన్, సావధాన్".
సాధకుడికి, చిరాకు దాటి, కోపం వచ్చింది. “ఇంతకీ ఆ సావధానత అనే పదానికి అర్ధమేమిటో? అని వ్యాఖ్యానించాడు.
ఇక్యూ మృదువుగా “సావధానత అంటే సావధానతే" అని జవాబిచ్చాడు.
Robert & Ornstein, (The Psychology of Consciousness)
జెన్ మాస్టర్ ఇక్యూని ప్రశ్నించిన శిష్యుడి స్థితిలో మనముంటే, ఏమిచేయడానికి తోచివుండేది కాదు. సావధానత అంటే ఏమిటో జెప్పడాయె, పోనీ ఏకాగ్రతలాంటిదే అని పోల్చడాయె, ఈ సావధానత ఏవిధంగా సాధించాలో, వివరించడాయె; అయోమయానికి గురవుతాము.
అదృష్టవశాత్తూ మనకు, శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు, సావధానతలో వుండని లక్షణాలు ఏమిటి? సావధానత ఏకాగ్రత కన్నా ఏవిధంగా మించినది అనిపించుకుంటుంది, సావధానతలో, “నీవు లేక నేను” అనేది ఎలా మూయమవుతుందో, సావధానత లేకుండా | ఈ జీవిస్తున్న జీవితం ఎంత అర్థరహితమో సవివరంగా ప్రపంచమంతటా అనేక సభలో, చర్చల్లో, సంవాదాల్లో వివరించి చెప్పారు.
నీలంరాజు లక్ష్మీ ప్రసాద్ సావధానత సావధానత అంటే సావధానతే ఎవరో సాధకుడు వచ్చి, ఇక్యూ (Ikkyu) అనే జెన్ మాస్టర్ని "గొప్ప సంయక్ జ్ఞానాన్ని (wisdom) తెలియజేసే సూత్రాలను రాసిస్తారా ?" అని అడిగాడు. అందుకు సమాధానంగా ఇక్యూ సావధాన్ అని కాగితం మీద రాసి ఇచ్చాడు. కేవలం అంతే నంటారా? మరేదైనా కలుపుతారా" అన్నాడు ఆ సాధకుడు. అప్పుడు ఇక్యూ ఆ కాగితం మీద "సావధాన్, సావధాన్" అని రెండుసార్లు రాశాడు. ఆ సాధకునికి కొంత చిరాకేసింది కానీ మీరిప్పుడు రాసిన దానిలో ఆట్టే లోతుగానీ పెద్దగా సూక్ష్మత గానీ నాకేమీ కనిపించడం లేదు" అన్నాడు. అప్పుడు ఇక్యూ ఆ కాగితంమీద ముమ్మారు "సావధాన్" అనే పదాన్నే మళ్లీ రాశాడు. "సావధాన్, సావధాన్, సావధాన్". సాధకుడికి, చిరాకు దాటి, కోపం వచ్చింది. “ఇంతకీ ఆ సావధానత అనే పదానికి అర్ధమేమిటో? అని వ్యాఖ్యానించాడు. ఇక్యూ మృదువుగా “సావధానత అంటే సావధానతే" అని జవాబిచ్చాడు. Robert & Ornstein, (The Psychology of Consciousness) జెన్ మాస్టర్ ఇక్యూని ప్రశ్నించిన శిష్యుడి స్థితిలో మనముంటే, ఏమిచేయడానికి తోచివుండేది కాదు. సావధానత అంటే ఏమిటో జెప్పడాయె, పోనీ ఏకాగ్రతలాంటిదే అని పోల్చడాయె, ఈ సావధానత ఏవిధంగా సాధించాలో, వివరించడాయె; అయోమయానికి గురవుతాము. అదృష్టవశాత్తూ మనకు, శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు, సావధానతలో వుండని లక్షణాలు ఏమిటి? సావధానత ఏకాగ్రత కన్నా ఏవిధంగా మించినది అనిపించుకుంటుంది, సావధానతలో, “నీవు లేక నేను” అనేది ఎలా మూయమవుతుందో, సావధానత లేకుండా | ఈ జీవిస్తున్న జీవితం ఎంత అర్థరహితమో సవివరంగా ప్రపంచమంతటా అనేక సభలో, చర్చల్లో, సంవాదాల్లో వివరించి చెప్పారు.© 2017,www.logili.com All Rights Reserved.