"బుద్ధ భగవానుడి బోధలను అనుసరిస్తూ, లోకంలోని ప్రజలకి హితమూ , ఆనందమూ కలగాలనే ఆశయంతో బుద్ధచరితమనే ఈ కావ్యాన్ని వ్రాసాను. ఆ మునిపుంగవునిపై నాకుగల అమితమైన భక్తిభావం వలన దీనిని వ్రాసాను. ఆంతేగాని, నా పాండిత్యాన్ని, నా కావ్యకళని ప్రదర్శించుకోవాలనే ఉద్దేశ్యంతో కాదు."
- అశ్వఘోషుడు.
బుద్ధ భగవానుడు క్రీస్తుపూర్వం 560 - 480 మధ్య పుట్టినట్లు చారిత్రకమైన ఆధారాలున్నాయి. జీవుల్ని జరామరణభయాల నుంచి విముక్తులుగా చేసే మార్గాన్ని చూపిన దైవం అతడు. అశ్వఘోషుడు బుద్ధదేవుని జీవితకథని ఒక కావ్యంగా, ఒక ధార్మిక గ్రంధంగా సంస్కృతంలో "బుద్ధచరితం" అనే పేర వ్రాసాడు. ఆ కావ్యాన్ని సరళమైన తెలుగులో మొదటి సారిగా అర్థతాత్పర్యాలతో అందిస్తున్నాము.