మాట్లాడే మాటకు సామెత జేర్చి మాట్లాడితే అ మాటలోని భావానికి బలం చేకూరుతుందని, ఓ నమ్మకం. సమయానికి సామెత గుర్తురాకపోతే 'ఏదో సామెత చెప్పినట్లు" అని మాట్లాడే వాళ్ళని చాలామందిని చూస్తుంటాం. సామెత "భావవ్యక్తీకరణకు" - అనుభవం కలిసిన సంక్షిప్త రూపంగా తోస్తుంది.
మనకి ప్రతి సందర్భానికి ఎదో ఒక సామెత ఉండనే ఉంటుంది. ఒక నక్షత్రం ఉన్నప్పుడు వర్షం కురిస్తే ఆ ఫలితానికి సూచనగా 'అశ్వని కురిస్తే అంతా నష్టం' అన్న సామెత, మనకు పూర్తిగా అవగాహన కలిగేలాగా ఎవరైనా వివరిస్తే "అరటిపండు వొలిచి చేతిలో పెట్టినట్లు" - అనే సామెత, అలాగే - పైకి మంచిగా కన్పిస్తూ మనసులోని ఆలోచనలు, చేసే పనులు - వేరే విధంగా ఉండేవారి కోసం "గోముఖవ్యాఘ్రం", స్నేహంగా ఉంటూ మోసం చేస్తే "చెలిమితో చేదు తినిపించవచ్చు గాని, బలంతో పాలు తాగించలేము" వంటి సామెతలు మనకు కోకొల్లలు.
సామెతలు సేకరించి, అక్షరక్రమంలో అమర్చి, శ్రీ రెంటాల హనుమత్ ప్రసాద్ తెలుగు పాటకులకు అందజేస్తున్నారు. సామెతలు సందర్భానుసారంగా వాడుకుని మాట్లాడే మాటకు బలం, సొబగు చేర్చండి.
మాట్లాడే మాటకు సామెత జేర్చి మాట్లాడితే అ మాటలోని భావానికి బలం చేకూరుతుందని, ఓ నమ్మకం. సమయానికి సామెత గుర్తురాకపోతే 'ఏదో సామెత చెప్పినట్లు" అని మాట్లాడే వాళ్ళని చాలామందిని చూస్తుంటాం. సామెత "భావవ్యక్తీకరణకు" - అనుభవం కలిసిన సంక్షిప్త రూపంగా తోస్తుంది. మనకి ప్రతి సందర్భానికి ఎదో ఒక సామెత ఉండనే ఉంటుంది. ఒక నక్షత్రం ఉన్నప్పుడు వర్షం కురిస్తే ఆ ఫలితానికి సూచనగా 'అశ్వని కురిస్తే అంతా నష్టం' అన్న సామెత, మనకు పూర్తిగా అవగాహన కలిగేలాగా ఎవరైనా వివరిస్తే "అరటిపండు వొలిచి చేతిలో పెట్టినట్లు" - అనే సామెత, అలాగే - పైకి మంచిగా కన్పిస్తూ మనసులోని ఆలోచనలు, చేసే పనులు - వేరే విధంగా ఉండేవారి కోసం "గోముఖవ్యాఘ్రం", స్నేహంగా ఉంటూ మోసం చేస్తే "చెలిమితో చేదు తినిపించవచ్చు గాని, బలంతో పాలు తాగించలేము" వంటి సామెతలు మనకు కోకొల్లలు. సామెతలు సేకరించి, అక్షరక్రమంలో అమర్చి, శ్రీ రెంటాల హనుమత్ ప్రసాద్ తెలుగు పాటకులకు అందజేస్తున్నారు. సామెతలు సందర్భానుసారంగా వాడుకుని మాట్లాడే మాటకు బలం, సొబగు చేర్చండి.© 2017,www.logili.com All Rights Reserved.