'జ్యోతిర్గమయ' అనే పేరుగల ఈ గ్రంథము శ్రీ దామెర వెంకట సూర్యారావుగారు గత ఆరేడు సంవత్సరాలలో రచించి అనేక పత్రికలలో ప్రకటించిన వ్యాసముల యొక్క సంపుటి. ఈ వ్యాసములలో బహుముఖీనమైన మన భారతీయ సంస్కృతీయొక్క స్వరూపాన్ని అనేక విషయముల ద్వారా ఈ గ్రంథకర్తగారు ఆవిష్కరించారు. పరమహంస, వివేకానందుల గురు - శిష్య బాంధవ్యాన్ని గురించి మొదలు పెట్టి 'బ్రహ్మ సత్యం' మొదలగు వాక్యాలు కూడా ఈ వ్యాసాలలో ప్రస్తావించబడ్డాయి. కొందరు మహాత్ముల పరిచయంతో పాటు అనేక ధర్మసూక్షములను వివరించే వ్యాసములతో కూడిన ఈ సంపుటము సామాన్య పఠితలు ఎవరైనా ప్రసన్నమైన మనస్సుతో చదివి ఆనందించవచ్చు. ఈ వ్యాసాల ద్వారా శ్రీ సూర్యారావు గారి పరిచయము నాకు కలిగినందుకు సంతోషంగా ఉంది. ఈ గ్రంథము ప్రజాహితమైనది.
- శివానందమూర్తి
'జ్యోతిర్గమయ' అనే పేరుగల ఈ గ్రంథము శ్రీ దామెర వెంకట సూర్యారావుగారు గత ఆరేడు సంవత్సరాలలో రచించి అనేక పత్రికలలో ప్రకటించిన వ్యాసముల యొక్క సంపుటి. ఈ వ్యాసములలో బహుముఖీనమైన మన భారతీయ సంస్కృతీయొక్క స్వరూపాన్ని అనేక విషయముల ద్వారా ఈ గ్రంథకర్తగారు ఆవిష్కరించారు. పరమహంస, వివేకానందుల గురు - శిష్య బాంధవ్యాన్ని గురించి మొదలు పెట్టి 'బ్రహ్మ సత్యం' మొదలగు వాక్యాలు కూడా ఈ వ్యాసాలలో ప్రస్తావించబడ్డాయి. కొందరు మహాత్ముల పరిచయంతో పాటు అనేక ధర్మసూక్షములను వివరించే వ్యాసములతో కూడిన ఈ సంపుటము సామాన్య పఠితలు ఎవరైనా ప్రసన్నమైన మనస్సుతో చదివి ఆనందించవచ్చు. ఈ వ్యాసాల ద్వారా శ్రీ సూర్యారావు గారి పరిచయము నాకు కలిగినందుకు సంతోషంగా ఉంది. ఈ గ్రంథము ప్రజాహితమైనది. - శివానందమూర్తి© 2017,www.logili.com All Rights Reserved.