అమెరికాలో కనకవర్షం, కాదు కాదు డాలర్ల వర్షం కురుస్తుంది. అక్కడ సిరుల పంట పండుతుంది. జీవితం ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగుతుంది. అందుకే ప్రపంచం అంతా అమెరికా వైపు చూస్తుంటుంది. వర్షం వస్తే సాధారణంగా గొడుగులు పట్టుకోవాలి. కాని అమెరికా వెళ్ళిన వాళ్ళు తట్టలు బుట్టలతో ఆ డాలర్లను పోగుచేసుకుంటే వాళ్ళు తమ దేశాలకు తిరిగి వెళ్లి సుఖజీవనం సాగిస్తారు. సంచులు బంచులుగా పట్టుకునేవారు ఇక అక్కడే ఉండిపోతారు, నరకవాసులౌతారు.ఇక తాత్కాలికంగా వచ్చిపోయే వారు త్రిశంకు స్వర్గవాసులు. ఇక ఆప్తులు తల్లితండ్రుల పరిస్థితి అగమ్యగోచరం. వీళ్ళు అక్కడ చలికి, ఒంటరితనాన్ని ఒంటబట్టిచుకోలేక, పారిపోవాలనుకున్నా కట్టిపడేసిన కభంద బంధాలను తెంపుకోలేక నానాయాతనలు పడతారు. వారి దీనావస్థ వర్ణాతీతం. ఒక వేళా కాదు కూడదని మన దేశం తిరిగివస్తే వృద్ధాప్యం లో ఆలనాపాలన కరువై, కనీసం పిల్లలు తమ అంత్యక్రియలుకైనా వస్తారా? రారా? అనే సందేహంతో కుమిలిపోతుంటారు. వీటన్నింటికి ఈ పుస్తకం కనువిప్పు కాగలదని ఆశిద్దాం.
ఎందరో పుస్తకాలు రాస్తారు. అందరికి వందనాలు. పనికొచ్చే పుస్తకం రాయాలని నా అభిలాష. నేడు అమెరికా వెళ్ళే విమానంలో 60 శాతం పైగా పిల్లల కోసం వెళ్ళే తల్లిదండ్రులే ఉంటారు. దేశం గాని దేశంలో ఎన్ని అగచాట్లు పడాలో అర్డంగని పరిస్థితి. ఆ కష్టాలను గట్టెక్కించ గలిగితే ఈ పుస్తక ధ్యేయం సార్ధకమయినట్లే. అమెరికా స్వర్గమా? నరకమా? అనే ఈ పుస్తకం సమకాలీన ఆవశ్యకం.
రచయిత
అమెరికాలో కనకవర్షం, కాదు కాదు డాలర్ల వర్షం కురుస్తుంది. అక్కడ సిరుల పంట పండుతుంది. జీవితం ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగుతుంది. అందుకే ప్రపంచం అంతా అమెరికా వైపు చూస్తుంటుంది. వర్షం వస్తే సాధారణంగా గొడుగులు పట్టుకోవాలి. కాని అమెరికా వెళ్ళిన వాళ్ళు తట్టలు బుట్టలతో ఆ డాలర్లను పోగుచేసుకుంటే వాళ్ళు తమ దేశాలకు తిరిగి వెళ్లి సుఖజీవనం సాగిస్తారు. సంచులు బంచులుగా పట్టుకునేవారు ఇక అక్కడే ఉండిపోతారు, నరకవాసులౌతారు.ఇక తాత్కాలికంగా వచ్చిపోయే వారు త్రిశంకు స్వర్గవాసులు. ఇక ఆప్తులు తల్లితండ్రుల పరిస్థితి అగమ్యగోచరం. వీళ్ళు అక్కడ చలికి, ఒంటరితనాన్ని ఒంటబట్టిచుకోలేక, పారిపోవాలనుకున్నా కట్టిపడేసిన కభంద బంధాలను తెంపుకోలేక నానాయాతనలు పడతారు. వారి దీనావస్థ వర్ణాతీతం. ఒక వేళా కాదు కూడదని మన దేశం తిరిగివస్తే వృద్ధాప్యం లో ఆలనాపాలన కరువై, కనీసం పిల్లలు తమ అంత్యక్రియలుకైనా వస్తారా? రారా? అనే సందేహంతో కుమిలిపోతుంటారు. వీటన్నింటికి ఈ పుస్తకం కనువిప్పు కాగలదని ఆశిద్దాం. ఎందరో పుస్తకాలు రాస్తారు. అందరికి వందనాలు. పనికొచ్చే పుస్తకం రాయాలని నా అభిలాష. నేడు అమెరికా వెళ్ళే విమానంలో 60 శాతం పైగా పిల్లల కోసం వెళ్ళే తల్లిదండ్రులే ఉంటారు. దేశం గాని దేశంలో ఎన్ని అగచాట్లు పడాలో అర్డంగని పరిస్థితి. ఆ కష్టాలను గట్టెక్కించ గలిగితే ఈ పుస్తక ధ్యేయం సార్ధకమయినట్లే. అమెరికా స్వర్గమా? నరకమా? అనే ఈ పుస్తకం సమకాలీన ఆవశ్యకం. రచయిత© 2017,www.logili.com All Rights Reserved.