ఈ పుస్తకాన్ని 1992 లో రాశారు సిర్గాపూర్ విద్యాసాగర్రెడ్డి గారు. ఆనాటి ఆర్దిక పరిస్థితులు మనస్సును ఇబ్బంది పెడుతుంటే, గందరగోళానికి గురిచేస్తుంటే పరిష్కార దిశగా అయన చేసిన ఆలోచనలే ఈ పుస్తకంగా రూపుదిద్దుకున్నాయి
దీనిలో అయన ఈ క్రింది ప్రతిపాదనలు చేశాడు.
* శూన్య విలువలుగల డబ్బును విలువ ఆధారిత డబ్బుతో ప్రతిక్షేపించాలి. లెక్కలేకుండా 'శూన్య విలువ డబ్బు' ను వ్యవస్థలోకి చొప్పించకూడదు.
* వస్తూత్పత్తిని వికేంద్రీకరించి సాముదాయక ఉత్పత్తి విధానానికి మరలాలి.
* బ్యాంకింగ్ వ్యవస్థను నిషేదించాలి లేక దానిని వడ్డీ వ్యాపారానికే పరిమితం చేయాలి.
* 'పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ' లకు వ్యక్తుల కంటే ఎక్కువగా హక్కులివ్వకూడదు. వాటికీ కూడా జవాబుదారీతనం వుండాలి.
కాని ఈ 20 ఏళ్ళలో ఈ పరిస్థితుల్లో ఏమైనా మార్పు వచ్చిందా? పరిస్థితి మెరుగు పడిందా? ఇంకా దిగజారిందా? పరిశీలిద్దాం.
కరెన్సీకి 'బంగారు ప్రమాణం' లేదు. ఏ ప్రమాణం లేదు. శూన్య విలువగల పేపర్ కరెన్సీని బడ్జెట్ లోటును భర్తీ చేసేందుకు ఇస్తామోచ్చినట్లుగా వ్యవస్థ లోనికి చొప్పిస్తున్నారు.ఇలా శూన్య విలువగల డబ్బును ఇష్టమొచ్చినట్లు వ్యవస్థలోనికి చొప్పిస్తూ పోతే 90 శాతం జనపు ఆర్ధిక స్థితి దెబ్బతింటుంది. పై 10 శాతం జనం ఆస్తులు పెరిగిపోతాయి. విలువ ఆధారిత డబ్బు అందని పండుగానే వుంది.
పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల పేర వేల, లక్షల కోట్ల డబ్బు బదిలీ జరుగుతున్నది. 30 ఏళ్ళ పని చేయగలిగే కాలంలో ఒక చేతివృత్తి కార్మికుడు ఒక ఇల్లు కట్టుకోవడమే గగనకుసుమవుతున్న కాలంలో, 30 ఏళ్ళ వయసుగల యువకుడు అదే సమయంలో లక్ష కోట్లకు అధిపతి అవుతున్నాడు. ఇంత వ్యత్యాసాలను ప్రోత్సహిస్తున్న వ్యవస్థ ఇంకా ముందు ముందు ఏం చేయబోతుందో చూద్దాం.
ఈ పుస్తకాన్ని 1992 లో రాశారు సిర్గాపూర్ విద్యాసాగర్రెడ్డి గారు. ఆనాటి ఆర్దిక పరిస్థితులు మనస్సును ఇబ్బంది పెడుతుంటే, గందరగోళానికి గురిచేస్తుంటే పరిష్కార దిశగా అయన చేసిన ఆలోచనలే ఈ పుస్తకంగా రూపుదిద్దుకున్నాయి దీనిలో అయన ఈ క్రింది ప్రతిపాదనలు చేశాడు. * శూన్య విలువలుగల డబ్బును విలువ ఆధారిత డబ్బుతో ప్రతిక్షేపించాలి. లెక్కలేకుండా 'శూన్య విలువ డబ్బు' ను వ్యవస్థలోకి చొప్పించకూడదు. * వస్తూత్పత్తిని వికేంద్రీకరించి సాముదాయక ఉత్పత్తి విధానానికి మరలాలి. * బ్యాంకింగ్ వ్యవస్థను నిషేదించాలి లేక దానిని వడ్డీ వ్యాపారానికే పరిమితం చేయాలి. * 'పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ' లకు వ్యక్తుల కంటే ఎక్కువగా హక్కులివ్వకూడదు. వాటికీ కూడా జవాబుదారీతనం వుండాలి. కాని ఈ 20 ఏళ్ళలో ఈ పరిస్థితుల్లో ఏమైనా మార్పు వచ్చిందా? పరిస్థితి మెరుగు పడిందా? ఇంకా దిగజారిందా? పరిశీలిద్దాం. కరెన్సీకి 'బంగారు ప్రమాణం' లేదు. ఏ ప్రమాణం లేదు. శూన్య విలువగల పేపర్ కరెన్సీని బడ్జెట్ లోటును భర్తీ చేసేందుకు ఇస్తామోచ్చినట్లుగా వ్యవస్థ లోనికి చొప్పిస్తున్నారు.ఇలా శూన్య విలువగల డబ్బును ఇష్టమొచ్చినట్లు వ్యవస్థలోనికి చొప్పిస్తూ పోతే 90 శాతం జనపు ఆర్ధిక స్థితి దెబ్బతింటుంది. పై 10 శాతం జనం ఆస్తులు పెరిగిపోతాయి. విలువ ఆధారిత డబ్బు అందని పండుగానే వుంది. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల పేర వేల, లక్షల కోట్ల డబ్బు బదిలీ జరుగుతున్నది. 30 ఏళ్ళ పని చేయగలిగే కాలంలో ఒక చేతివృత్తి కార్మికుడు ఒక ఇల్లు కట్టుకోవడమే గగనకుసుమవుతున్న కాలంలో, 30 ఏళ్ళ వయసుగల యువకుడు అదే సమయంలో లక్ష కోట్లకు అధిపతి అవుతున్నాడు. ఇంత వ్యత్యాసాలను ప్రోత్సహిస్తున్న వ్యవస్థ ఇంకా ముందు ముందు ఏం చేయబోతుందో చూద్దాం.
© 2017,www.logili.com All Rights Reserved.