ఇది ఎన్నో రకాలుగా కొత్త శకానికి నాంది పలికిన రచన. దాదాపు ప్రతి పేజీలోను మనకు సరికొత్త మౌలిక ప్రతిపాదనలు, స్వతంత్ర ఆలోచనలు కనబడతాయి... ఇది ఒక స్ఫూర్తిమంతమైన రచన... ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది విద్యార్థులను ఉత్తేజపరిచి, వారిలో ఆలోచనలను పురికొల్పిందిది. చరిత్ర అధ్యనంలో ఒక కొత్త ఒరవడిని ప్రవేశపెట్టారు కోసంబి. ఆధునిక గణితశాస్త్ర సూత్రాలను అన్వయిస్తూ, నాణాల బరువును బట్టి అవి ఎంతకాలంగా చలామణిలో ఉన్నాయో నిర్దారించడమే కాదు - ఆయాకాలాలకు సంబంధించిన వివరాలను రాబట్టే దారి చూపారు. కోసంబి అనుసరించిన విశ్లేషణా పద్ధతుల్లో చాలా భాగం - యాభై ఏళ్ల తర్వాత, ఇప్పటికీ అంతే ప్రభావంతంగా, అంతే ఆమోదయోగ్యంగా ఉన్నాయి. మిగిలిన ఆ కొద్ది భాగం విషయంలో కూడా పునరాలోచన అవసరమవుతోందంటే అది - కొత్త ఆధారాలు వెలుగులోకి రావడం వల్లనో, సరికొత్త వివరణా సిద్ధాంతాల వల్లనో, లేక గతాన్ని గురించిన మన ద్రుక్పథాల్లో మార్పు రావడం వల్లనో తప్పించి మరేమీ కాదు. కోసంబి రచనలను మళ్ళీ మళ్ళీ చదవడం అవసరం. చదివిన ప్రతీసారీ సంభ్రమానికి గురిచేస్తూ మనల్ని మరింత చారిత్రకంగా ఆలోచించేలా ప్రేరేపించడం వాటి విశిష్టత.
- దామోదర్ ధర్మానంద్ కోసంబి
ఇది ఎన్నో రకాలుగా కొత్త శకానికి నాంది పలికిన రచన. దాదాపు ప్రతి పేజీలోను మనకు సరికొత్త మౌలిక ప్రతిపాదనలు, స్వతంత్ర ఆలోచనలు కనబడతాయి... ఇది ఒక స్ఫూర్తిమంతమైన రచన... ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది విద్యార్థులను ఉత్తేజపరిచి, వారిలో ఆలోచనలను పురికొల్పిందిది. చరిత్ర అధ్యనంలో ఒక కొత్త ఒరవడిని ప్రవేశపెట్టారు కోసంబి. ఆధునిక గణితశాస్త్ర సూత్రాలను అన్వయిస్తూ, నాణాల బరువును బట్టి అవి ఎంతకాలంగా చలామణిలో ఉన్నాయో నిర్దారించడమే కాదు - ఆయాకాలాలకు సంబంధించిన వివరాలను రాబట్టే దారి చూపారు. కోసంబి అనుసరించిన విశ్లేషణా పద్ధతుల్లో చాలా భాగం - యాభై ఏళ్ల తర్వాత, ఇప్పటికీ అంతే ప్రభావంతంగా, అంతే ఆమోదయోగ్యంగా ఉన్నాయి. మిగిలిన ఆ కొద్ది భాగం విషయంలో కూడా పునరాలోచన అవసరమవుతోందంటే అది - కొత్త ఆధారాలు వెలుగులోకి రావడం వల్లనో, సరికొత్త వివరణా సిద్ధాంతాల వల్లనో, లేక గతాన్ని గురించిన మన ద్రుక్పథాల్లో మార్పు రావడం వల్లనో తప్పించి మరేమీ కాదు. కోసంబి రచనలను మళ్ళీ మళ్ళీ చదవడం అవసరం. చదివిన ప్రతీసారీ సంభ్రమానికి గురిచేస్తూ మనల్ని మరింత చారిత్రకంగా ఆలోచించేలా ప్రేరేపించడం వాటి విశిష్టత. - దామోదర్ ధర్మానంద్ కోసంబి© 2017,www.logili.com All Rights Reserved.