సింహప్రసాద్ సృష్టించిన ‘భూదేవి’ నవల కేవలం నవల కాదు. నేల మీద కాళ్ళూనుకుని, నింగిని అందుకున్న ఒక స్త్రీ మూర్తి విశ్వరూపదర్శనం.
- వక్కంతం సూర్యనారాయణరావ్, మనస్విని –ఆత్రేయ పురస్కార గ్రహీత
మానసిక సంఘర్షణల్లోంచి మానవీయ మూలాల్ని వెలిగించిన గొప్ప నవల ‘భూదేవి’. సింహప్రసాద్ ఎంతో పనితనంతో ప్రభోదాత్మకంగా మలచిన ఈ నవల ప్రతి మనిషికీ ఒక పాఠ్యాంశమే.
- ‘సాహితీ కళాభిజ్ఞ’ రసరాజు, ప్రముఖ రచయిత, సినీ గీత రచయిత
‘కన్నీళ్ళు తుడిచే చేతులకోసం ఎందరో ఆశగా చూస్తున్నారు. చేయూతనిచ్చే చేతల కోసం ఎందరెందరో చూస్తున్నారు’ – అంటూ నాని చేత చెప్పించిన మాటలు అక్షర సత్యాలు. అక్షర లక్షలు. ప్రముఖ రచయిత సింహప్రసాద్ అందించిన నవలాకుసుమం ‘భూదేవి’.
- ’కథానికాజీవి’ డాక్టర్. వేదగిరి రాంబాబు, ప్రముఖ రచయిత.
‘నడవటానికి పాదాలుండాలి గాని లోకం నిండా దారులే. పరోపకారానికి మనస్సుండాలి గాని చెయ్యడానికి ఎన్నెన్నో మార్గాలు’ –ఇవన్నీ భూదేవంత సహనం గల దేవమ్మలో సింహప్రసాద్ హృద్యంగా చిత్రీకరించారు.
- పి.చంద్రశేఖర ఆజాద్, ప్రఖ్యాత రచయిత (కథ, నవల, సినిమా, టీవీ), నటుడు.
‘బహుమతుల రచయిత’ సింహప్రసాద్ తెలుగు పాఠకులకు అందించిన మరో గొప్ప బహుమతి ఈ ‘భూదేవి’. వేగం, సహజత్వం ఆభరణంగా పొదిగిన ఈ నవలకు ఆర్ద్రతే ఆయువుపట్టు.
- గుమ్మడి రవీంద్రనాథ్, ప్రముఖ కథా నవలా రచయిత
అణచబడిన స్త్రీహృదయాన్ని సింహప్రసాద్ చక్కగా అర్ధం చేసుకోవడమే గాక ఆమె అనుభవాలను కళ్ళకు కట్టినట్లు వర్ణించారు. ఈనవల నాకు గుర్తు తెప్పించిన రెండు గొప్ప నవలలు -‘గుడ్ ఎర్త్’, ‘థౌజండ్ స్ల్పెండిడ్ సన్స్’.
- దండు విజయలక్ష్మి, రచయిత్రి, బెంగుళూరు
‘భూదేవి’ నవల కన్నీరు తెప్పించింది. మొహబూబ్ ఖాన్ ‘ఔరత్’, ‘మదరిండియా’ గుర్తొచ్చాయి. భారతీయ మహిళను ఆవిష్కరించిన సింహప్రసాద్ కు హేట్సాఫ్.
- సత్యనారాయణరెడ్డి, పాఠకుడు, చెన్నై
సింహప్రసాద్ సృష్టించిన ‘భూదేవి’ నవల కేవలం నవల కాదు. నేల మీద కాళ్ళూనుకుని, నింగిని అందుకున్న ఒక స్త్రీ మూర్తి విశ్వరూపదర్శనం. - వక్కంతం సూర్యనారాయణరావ్, మనస్విని –ఆత్రేయ పురస్కార గ్రహీత మానసిక సంఘర్షణల్లోంచి మానవీయ మూలాల్ని వెలిగించిన గొప్ప నవల ‘భూదేవి’. సింహప్రసాద్ ఎంతో పనితనంతో ప్రభోదాత్మకంగా మలచిన ఈ నవల ప్రతి మనిషికీ ఒక పాఠ్యాంశమే. - ‘సాహితీ కళాభిజ్ఞ’ రసరాజు, ప్రముఖ రచయిత, సినీ గీత రచయిత ‘కన్నీళ్ళు తుడిచే చేతులకోసం ఎందరో ఆశగా చూస్తున్నారు. చేయూతనిచ్చే చేతల కోసం ఎందరెందరో చూస్తున్నారు’ – అంటూ నాని చేత చెప్పించిన మాటలు అక్షర సత్యాలు. అక్షర లక్షలు. ప్రముఖ రచయిత సింహప్రసాద్ అందించిన నవలాకుసుమం ‘భూదేవి’. - ’కథానికాజీవి’ డాక్టర్. వేదగిరి రాంబాబు, ప్రముఖ రచయిత. ‘నడవటానికి పాదాలుండాలి గాని లోకం నిండా దారులే. పరోపకారానికి మనస్సుండాలి గాని చెయ్యడానికి ఎన్నెన్నో మార్గాలు’ –ఇవన్నీ భూదేవంత సహనం గల దేవమ్మలో సింహప్రసాద్ హృద్యంగా చిత్రీకరించారు. - పి.చంద్రశేఖర ఆజాద్, ప్రఖ్యాత రచయిత (కథ, నవల, సినిమా, టీవీ), నటుడు. ‘బహుమతుల రచయిత’ సింహప్రసాద్ తెలుగు పాఠకులకు అందించిన మరో గొప్ప బహుమతి ఈ ‘భూదేవి’. వేగం, సహజత్వం ఆభరణంగా పొదిగిన ఈ నవలకు ఆర్ద్రతే ఆయువుపట్టు. - గుమ్మడి రవీంద్రనాథ్, ప్రముఖ కథా నవలా రచయిత అణచబడిన స్త్రీహృదయాన్ని సింహప్రసాద్ చక్కగా అర్ధం చేసుకోవడమే గాక ఆమె అనుభవాలను కళ్ళకు కట్టినట్లు వర్ణించారు. ఈనవల నాకు గుర్తు తెప్పించిన రెండు గొప్ప నవలలు -‘గుడ్ ఎర్త్’, ‘థౌజండ్ స్ల్పెండిడ్ సన్స్’. - దండు విజయలక్ష్మి, రచయిత్రి, బెంగుళూరు ‘భూదేవి’ నవల కన్నీరు తెప్పించింది. మొహబూబ్ ఖాన్ ‘ఔరత్’, ‘మదరిండియా’ గుర్తొచ్చాయి. భారతీయ మహిళను ఆవిష్కరించిన సింహప్రసాద్ కు హేట్సాఫ్. - సత్యనారాయణరెడ్డి, పాఠకుడు, చెన్నై© 2017,www.logili.com All Rights Reserved.