వివాహం మనిషి జీవితంలో అత్యంత పవిత్రమైన మహత్తరమైన అనుభవం. ఈ వివాహం ద్వారా నే స్త్రీపురుషులు ఏకమై జీవనయానము సాగించుటకు వైదికంగా, సాంఘికంగా మరియు చట్టరీత్యా ఆమోదం లభిస్తుంది. వివాహవ్యవస్థ పురాణ ఇతిహాసాల సాక్షిగా అతిప్రాచీనమైనది. సాక్షాత్తూ ఆదిదంపతులైన పార్వతీపరమేశ్వరుల, లక్ష్మినారాయణుల, సీతారాముల, పద్మావతిశ్రీనివాసుల వివాహాలు మనముందు ఆదర్శంగా నిలిచాయి. వివాహం ఎంత పవిత్రమయినదో అంత బాధ్యతయుతంగా నిర్వహించవలసినకార్యం. ఒక గృహస్థుడు కళ్యాణం జరిపించడానికి పూనుకుంటే గ్రామంలోని అన్ని కుటుంబాలవారు అన్ని వర్ణాలవారు సంతోషంగా వారి సహాయసహకారాలు అందించే ఆచారం అనాదిగా ఏర్పడింది.
ప్రేమ వివాహాలు, హైటెక్ ద్వారా నిర్ణయించబడుతున్న వివాహాలను కూడా శాస్త్రోక్తంగా, భారతీయసంప్రదాయపద్ధతులలో జరుపుకోవాలని నేటితరంవారు కూడా ఆలోచించడం చాలా ముదావహం. విదేశాలలో స్థిరపడినవారు కూడా సంప్రదాయ వివాహపద్ధతికే పెద్ద పీటవేస్తున్నారు. ఈ శుభ పరిణామంతో పాటు వివాహంలో భాగస్వాములైన వారు ఆచరించేవిధులు, సాంప్రదాయాలు, పటించే మంత్రాలలోని భావం పూర్తిగా అర్ధంచేసుకొనగలిగితే వివాహనికొక అర్ధం, పరమార్ధం చేకూరుతుంది.
భావం తెలియకపోయినా సిద్ధాంతి అనమన్నారని 'నాతిచరామి' అనే వరుని కంటే దానిలోని పవిత్రత, భాద్యత తెలిసి మనస్పూర్తిగా ప్రమాణం చేసే వరుడు అత్యంత శ్రేష్టుడు.
వివాహక్రతువులోని ఆచార్యవ్యవహారాలు మంత్రలలోని తాత్పర్యం విపులంగా తెలిపేపుస్తకంలేని సమయంలో దరెగొని శ్రీ శ్రీశైలం గారికి వివాహవ్యవస్థలోని అన్ని విషయలూ క్రోడీకరించి ఒక పుస్తకాన్ని రచించాలనే సంకల్పం కలగడం, సదరుగ్రంధాన్ని ప్రచురించిలోకప్రసిద్ధం చేయడానికి శ్రీదెంది హన్మంత రెడ్డిగారు పూనుకోవడం అత్యంత ముదావహం. ఇది దైవప్రేరితం. సులభశైలితో, విపులమైన విశదీకరణతో చక్కగా రచించబడిన గ్రంథం శ్రీశైలంగారి 'వివాహవైభవం' అందరికీ అర్ధమయ్యేవిధంగా ద్రాక్షాపాకంగా సాగిన వీరిరచనలో వివాహ శుభకార్యానికి సంబంధించిన అన్ని విషయాలూ సవివరంగా పొందుపరచారు. వివాహ సందర్భముగా చేసే ప్రమాణాలు, ఆశీర్వచనాలు యాంత్రికంగా కాక వారి అర్ధాన్ని పవిత్రతను గుర్తించడానికి ఈ పుస్తకం దోహదపడుతుంది. 'ధర్మేచ, అర్ధేచ, కామేచ' వధువును అతి క్రమించను అని తాను చేసిన ప్రమాణపు పవిత్రతను గుర్తించిన పురుషుడు భార్యను సాక్షాత్తూ లక్ష్మిదేవిగా ఆదరిస్తారు. ఈ పుస్తకం కన్యాదాతకు, వధూవరులకు, బంధుమిత్రులకు, సర్వజనులకు ఒక చక్కని మార్గదర్శిగా ఉండగలదనుటలో సందేహం లేదు.
వివాహం మనిషి జీవితంలో అత్యంత పవిత్రమైన మహత్తరమైన అనుభవం. ఈ వివాహం ద్వారా నే స్త్రీపురుషులు ఏకమై జీవనయానము సాగించుటకు వైదికంగా, సాంఘికంగా మరియు చట్టరీత్యా ఆమోదం లభిస్తుంది. వివాహవ్యవస్థ పురాణ ఇతిహాసాల సాక్షిగా అతిప్రాచీనమైనది. సాక్షాత్తూ ఆదిదంపతులైన పార్వతీపరమేశ్వరుల, లక్ష్మినారాయణుల, సీతారాముల, పద్మావతిశ్రీనివాసుల వివాహాలు మనముందు ఆదర్శంగా నిలిచాయి. వివాహం ఎంత పవిత్రమయినదో అంత బాధ్యతయుతంగా నిర్వహించవలసినకార్యం. ఒక గృహస్థుడు కళ్యాణం జరిపించడానికి పూనుకుంటే గ్రామంలోని అన్ని కుటుంబాలవారు అన్ని వర్ణాలవారు సంతోషంగా వారి సహాయసహకారాలు అందించే ఆచారం అనాదిగా ఏర్పడింది. ప్రేమ వివాహాలు, హైటెక్ ద్వారా నిర్ణయించబడుతున్న వివాహాలను కూడా శాస్త్రోక్తంగా, భారతీయసంప్రదాయపద్ధతులలో జరుపుకోవాలని నేటితరంవారు కూడా ఆలోచించడం చాలా ముదావహం. విదేశాలలో స్థిరపడినవారు కూడా సంప్రదాయ వివాహపద్ధతికే పెద్ద పీటవేస్తున్నారు. ఈ శుభ పరిణామంతో పాటు వివాహంలో భాగస్వాములైన వారు ఆచరించేవిధులు, సాంప్రదాయాలు, పటించే మంత్రాలలోని భావం పూర్తిగా అర్ధంచేసుకొనగలిగితే వివాహనికొక అర్ధం, పరమార్ధం చేకూరుతుంది. భావం తెలియకపోయినా సిద్ధాంతి అనమన్నారని 'నాతిచరామి' అనే వరుని కంటే దానిలోని పవిత్రత, భాద్యత తెలిసి మనస్పూర్తిగా ప్రమాణం చేసే వరుడు అత్యంత శ్రేష్టుడు. వివాహక్రతువులోని ఆచార్యవ్యవహారాలు మంత్రలలోని తాత్పర్యం విపులంగా తెలిపేపుస్తకంలేని సమయంలో దరెగొని శ్రీ శ్రీశైలం గారికి వివాహవ్యవస్థలోని అన్ని విషయలూ క్రోడీకరించి ఒక పుస్తకాన్ని రచించాలనే సంకల్పం కలగడం, సదరుగ్రంధాన్ని ప్రచురించిలోకప్రసిద్ధం చేయడానికి శ్రీదెంది హన్మంత రెడ్డిగారు పూనుకోవడం అత్యంత ముదావహం. ఇది దైవప్రేరితం. సులభశైలితో, విపులమైన విశదీకరణతో చక్కగా రచించబడిన గ్రంథం శ్రీశైలంగారి 'వివాహవైభవం' అందరికీ అర్ధమయ్యేవిధంగా ద్రాక్షాపాకంగా సాగిన వీరిరచనలో వివాహ శుభకార్యానికి సంబంధించిన అన్ని విషయాలూ సవివరంగా పొందుపరచారు. వివాహ సందర్భముగా చేసే ప్రమాణాలు, ఆశీర్వచనాలు యాంత్రికంగా కాక వారి అర్ధాన్ని పవిత్రతను గుర్తించడానికి ఈ పుస్తకం దోహదపడుతుంది. 'ధర్మేచ, అర్ధేచ, కామేచ' వధువును అతి క్రమించను అని తాను చేసిన ప్రమాణపు పవిత్రతను గుర్తించిన పురుషుడు భార్యను సాక్షాత్తూ లక్ష్మిదేవిగా ఆదరిస్తారు. ఈ పుస్తకం కన్యాదాతకు, వధూవరులకు, బంధుమిత్రులకు, సర్వజనులకు ఒక చక్కని మార్గదర్శిగా ఉండగలదనుటలో సందేహం లేదు.
© 2017,www.logili.com All Rights Reserved.