డా.జి. ఫ్రాసిస్ గ్జావిర్ వ్యక్తిత్వ వికాస శిక్షణతరగతుల సమర్ధ నిర్వహకుడుగా సుప్రసిద్ధులు. ఆయన నిర్వహంచే శిక్షణతరగతులకు అభిలాషులు క్రిక్కిరిసి హాజరవుతారు. డా.గ్జావీర్ తాను సందర్శించిన పలు దేశాలు, తాను చదివిన పెక్కు పుస్తకాల నుంచి సేకరించిన మేటి కధల మణిహారాన్ని మనకు అందిస్తున్నారు.
ఈ కధలను సంభాషణా సరళిలో రచించారు. కధ ముగింపులో పాఠకుడు సమాధానాలు ఇస్తాడు. ఈ పుస్తకం ఉపదేశకులు, ఉపన్యాసకులు, ఉపాధ్యాయులకూ, ఏడ్పుగొట్టువారు ప్రతికూల ఆలోచనలు కలిగినవారు, పఠనానికి వ్యతిరేకులు మినహా అందరికీ అన్ని వయస్సుల పాఠకులకూ బాగా నచ్చుతుంది.
ఈ సంపుటంలోని కధలు, సూక్తులు, హితోక్తులు, సుభాషితాలు స్పూర్తినిస్తాయి. ప్రేరణకలిగిస్తాయి. ఆసాంతం హాయిగా ఆనందంగా చదివిస్తాయి.
డాక్టర్ జి.ఫ్రాన్సిస్ గ్జావీర్ స్వర్ణపతక గ్రహీత, పూర్వోత్తర పట్టభద్రుడుగా రెండు పట్టాలు పొందారు. అధ్యాపకుడుగా అసోసియేట్ ప్రొఫెసర్ గా, వైస్ ప్రిన్సిపాల్ గా భారతదేశంలోని వివిధ విద్యాసంస్థలలో సమర్ధంగా బాధ్యతలు నిర్వహించి ప్రశంసలందుకున్నారు.
ఆయన బ్యాంకాక్ లోని ఆసియన్ కాన్ ఫెడరేషన్ ఆఫ్ క్రెడిట్ యూనియన్స్ (ఎసీసీయు)కీ ఆర్ధిక సలహాదారుగా వ్యవహరించారు. మేనేజ్ మెంట్, అకౌంటింగ్, ఆర్ధిక విశ్లేషణలపై పలు శిక్షణకార్యక్రమాలను భారతదేశంలోనూ, అమెరికా, కెనడా, జర్మనీ, సింగపూర్, మలేషియా, ధాయలాండ్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, కీన్యా, టాంజానియా తదితర దేశాలలోనూ నిర్వహించారు. వివిధ విషయాలపై పదిహేనుకు పైగా గ్రంధాలు రచించారు.
డా.జి. ఫ్రాసిస్ గ్జావిర్ వ్యక్తిత్వ వికాస శిక్షణతరగతుల సమర్ధ నిర్వహకుడుగా సుప్రసిద్ధులు. ఆయన నిర్వహంచే శిక్షణతరగతులకు అభిలాషులు క్రిక్కిరిసి హాజరవుతారు. డా.గ్జావీర్ తాను సందర్శించిన పలు దేశాలు, తాను చదివిన పెక్కు పుస్తకాల నుంచి సేకరించిన మేటి కధల మణిహారాన్ని మనకు అందిస్తున్నారు. ఈ కధలను సంభాషణా సరళిలో రచించారు. కధ ముగింపులో పాఠకుడు సమాధానాలు ఇస్తాడు. ఈ పుస్తకం ఉపదేశకులు, ఉపన్యాసకులు, ఉపాధ్యాయులకూ, ఏడ్పుగొట్టువారు ప్రతికూల ఆలోచనలు కలిగినవారు, పఠనానికి వ్యతిరేకులు మినహా అందరికీ అన్ని వయస్సుల పాఠకులకూ బాగా నచ్చుతుంది. ఈ సంపుటంలోని కధలు, సూక్తులు, హితోక్తులు, సుభాషితాలు స్పూర్తినిస్తాయి. ప్రేరణకలిగిస్తాయి. ఆసాంతం హాయిగా ఆనందంగా చదివిస్తాయి. డాక్టర్ జి.ఫ్రాన్సిస్ గ్జావీర్ స్వర్ణపతక గ్రహీత, పూర్వోత్తర పట్టభద్రుడుగా రెండు పట్టాలు పొందారు. అధ్యాపకుడుగా అసోసియేట్ ప్రొఫెసర్ గా, వైస్ ప్రిన్సిపాల్ గా భారతదేశంలోని వివిధ విద్యాసంస్థలలో సమర్ధంగా బాధ్యతలు నిర్వహించి ప్రశంసలందుకున్నారు. ఆయన బ్యాంకాక్ లోని ఆసియన్ కాన్ ఫెడరేషన్ ఆఫ్ క్రెడిట్ యూనియన్స్ (ఎసీసీయు)కీ ఆర్ధిక సలహాదారుగా వ్యవహరించారు. మేనేజ్ మెంట్, అకౌంటింగ్, ఆర్ధిక విశ్లేషణలపై పలు శిక్షణకార్యక్రమాలను భారతదేశంలోనూ, అమెరికా, కెనడా, జర్మనీ, సింగపూర్, మలేషియా, ధాయలాండ్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, కీన్యా, టాంజానియా తదితర దేశాలలోనూ నిర్వహించారు. వివిధ విషయాలపై పదిహేనుకు పైగా గ్రంధాలు రచించారు.© 2017,www.logili.com All Rights Reserved.