"పైకి ధరణిలా కనపడతాను
లోన జలధిలా పరిగెడతాను"
సముద్రం లేని తెలంగాణకు సముద్రమైన వాడు మహాకవి దాశరథి. అందుకే ఆయన పద్యాలూ ఆటుపోట్లు అలలైనాయి. కలలు ఛిద్రమైన వేళ చెలియలికట్టను దాటిన ఉప్పెనలైనాయి. ఉరుముల మెరుపుల ఉద్వేగభరిత ఘట్టాలైనాయి. తాను పెద్దరికాన్ని అనుభవించి మనకు సాహిత్య సంపదను పంచాడు. జైల్లో ఉక్కు పోచల వెనుక వుండే దిక్కార హోరు వినిపించాడు. 'అగ్ని ధార' కురిసినా, మహాభోది రాసినా, అది అతనికే సాధ్యమైనది.
ఉర్దూ తన సాహిత్య మాతృభాష అన్న జనాబ్ దాశరథి. సినిమా ప్రపంచంలో లాజవాబ్ దాశరధి. పిల్లల కోసం పల్లవులు రాశాడు. పెద్దల కోసం వ్యాసాలు రాసారు. అతని కాలం నవలను, నాటాకాలను కల కన్నది. 'నా తెలంగాణ కోటి రత్నాల వీణ' అన్నది తెలంగాణ ఆకాంక్షను భూమి ఆకాశాలకు వినిపించిన నినాదం. అదొక ఏకవాక్య వ్యాసం.
"నిరుపేద నెత్తురు చుక్కలో ఎన్ని విప్లవాలో" అంటూ, "కన్నీటి చుక్కలోన ఆర్ద్రత ముత్యానికేది? " అని ప్రశ్నిస్తూ రక్త కన్నిరులో దాశరథి సృష్టించిన మహోజ్వల సాహిత్యం గూర్చి 2013 నవంబర్ 5,6 తేదీలలో 'తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి' రెండు రోజుల జాతీయ సదస్సును నిర్వహించింది. ఆ సదస్సులో 61 మంది పరిశోధకులు, రచయితలు సమర్పించిన పత్రాల సంకలనమే ఈ గ్రంథం.
-డా.గంటా జలంధర్ రెడ్డి.
"పైకి ధరణిలా కనపడతాను లోన జలధిలా పరిగెడతాను" సముద్రం లేని తెలంగాణకు సముద్రమైన వాడు మహాకవి దాశరథి. అందుకే ఆయన పద్యాలూ ఆటుపోట్లు అలలైనాయి. కలలు ఛిద్రమైన వేళ చెలియలికట్టను దాటిన ఉప్పెనలైనాయి. ఉరుముల మెరుపుల ఉద్వేగభరిత ఘట్టాలైనాయి. తాను పెద్దరికాన్ని అనుభవించి మనకు సాహిత్య సంపదను పంచాడు. జైల్లో ఉక్కు పోచల వెనుక వుండే దిక్కార హోరు వినిపించాడు. 'అగ్ని ధార' కురిసినా, మహాభోది రాసినా, అది అతనికే సాధ్యమైనది. ఉర్దూ తన సాహిత్య మాతృభాష అన్న జనాబ్ దాశరథి. సినిమా ప్రపంచంలో లాజవాబ్ దాశరధి. పిల్లల కోసం పల్లవులు రాశాడు. పెద్దల కోసం వ్యాసాలు రాసారు. అతని కాలం నవలను, నాటాకాలను కల కన్నది. 'నా తెలంగాణ కోటి రత్నాల వీణ' అన్నది తెలంగాణ ఆకాంక్షను భూమి ఆకాశాలకు వినిపించిన నినాదం. అదొక ఏకవాక్య వ్యాసం. "నిరుపేద నెత్తురు చుక్కలో ఎన్ని విప్లవాలో" అంటూ, "కన్నీటి చుక్కలోన ఆర్ద్రత ముత్యానికేది? " అని ప్రశ్నిస్తూ రక్త కన్నిరులో దాశరథి సృష్టించిన మహోజ్వల సాహిత్యం గూర్చి 2013 నవంబర్ 5,6 తేదీలలో 'తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి' రెండు రోజుల జాతీయ సదస్సును నిర్వహించింది. ఆ సదస్సులో 61 మంది పరిశోధకులు, రచయితలు సమర్పించిన పత్రాల సంకలనమే ఈ గ్రంథం. -డా.గంటా జలంధర్ రెడ్డి.
© 2017,www.logili.com All Rights Reserved.