ఈ 'మనసు తలుపు తెరిస్తే' కధలన్నీ కూడా సజీవపాత్రల జీవితాలే! పేర్లు మాత్రమే మార్చడం జరిగింది. ఈ కదల ద్వారా పలు మానసిక రుగ్మతలు సాధారణ జనజీవనస్రవంతిలో ఎలా గుర్తించాలి? వాటి లక్షణాలేవి? వాటిని ఎలా ఎదుర్కోవాలి వంటి అంశాలను ఎంతో రమణీయంగా, సులభశైలిలో రూపకల్పన చేసారు. ఒక్కొక్క కధానిక ఒక ఆణిముత్యం. మనసారా "మనసు తలుపు" తెరవండి మరి!
ఐతరాజు స్రవంతి (రచయిత్రి గురించి) :
శ్రీమతి ఐతరాజు సత్యనారాయణ (ఐ.యస్) స్రవంతిగారు చిత్తూరుజిల్లా వాస్తవ్యులు. ఈమె తండ్రిగారు శ్రీ ఐ.ఎస్.వి. నరసింగరావుగారు, తల్లి శ్రీమతి చక్రవర్తి విమలమ్మగారు.
ఈమె సోషియాలజీ, సైకాలజీ లందు పి.జీ. పట్టభద్రురాలు. మనోవిజ్ఞానశాస్త్ర పరిశోధకురాలు ఈమె స్వతహాగా బహుముఖ ప్రజ్ఞాశాలి. తన 8వ ఏట నుండీ సంగీతము, నాట్యము, 13వ ఏట నుండి వీణావాదనము, 19వ ఏట చిత్రలేఖనము మున్నగు కళలందు ఆరితేరినారు. గాత్రము, వీణ, నాట్యము లందు రాష్ట్రస్థాయి కళాకారిణిగా పలు పతకాలు సాధించారు.
తన 21వ ఏట (ఆంధ్రప్రదేశ్) ప్రభుత్వమునందలి సాంఘిక సంక్షేమశాఖనందు వృత్తి రీత్యా అడుగిడినా ప్రవృత్తిరీత్యా మనోవిజ్ఞాన శాస్త్రములోనే అందరికీ సుపరిచితులు. 2010-11 వ సంవత్సరములో తి.తి.దే.., బధిర పిల్లల "శ్రవణం" నందు సైకాలజిస్ట్ గా పొరుగు సేవలు అందించారు. ఈ శాస్త్రమునందు 2010-11నందు "నేషనల్ అవార్డ్" పొందిన "Construction of Ramps In Chittoor District", Projectనకు తన "Voice - Over"ను అందించారు. పలు టి.వి. రేడియో కార్యక్రమాలు కూడా చేశారు.
చిన్నతనంనుండీ వివిధ కళలలో ఆసక్తి, ప్రవేశం గలిగినందు వలననేమో "కౌన్సిలింగ్ & రిహ్యాబిలిటేషన్" సైకాలజిస్టుగా ఎంతోమంది మానసిక రుగ్మతలను బాగుపరచగలుగుచున్నారు.
ఈ 'మనసు తలుపు తెరిస్తే' కధలన్నీ కూడా సజీవపాత్రల జీవితాలే! పేర్లు మాత్రమే మార్చడం జరిగింది. ఈ కదల ద్వారా పలు మానసిక రుగ్మతలు సాధారణ జనజీవనస్రవంతిలో ఎలా గుర్తించాలి? వాటి లక్షణాలేవి? వాటిని ఎలా ఎదుర్కోవాలి వంటి అంశాలను ఎంతో రమణీయంగా, సులభశైలిలో రూపకల్పన చేసారు. ఒక్కొక్క కధానిక ఒక ఆణిముత్యం. మనసారా "మనసు తలుపు" తెరవండి మరి! ఐతరాజు స్రవంతి (రచయిత్రి గురించి) : శ్రీమతి ఐతరాజు సత్యనారాయణ (ఐ.యస్) స్రవంతిగారు చిత్తూరుజిల్లా వాస్తవ్యులు. ఈమె తండ్రిగారు శ్రీ ఐ.ఎస్.వి. నరసింగరావుగారు, తల్లి శ్రీమతి చక్రవర్తి విమలమ్మగారు. ఈమె సోషియాలజీ, సైకాలజీ లందు పి.జీ. పట్టభద్రురాలు. మనోవిజ్ఞానశాస్త్ర పరిశోధకురాలు ఈమె స్వతహాగా బహుముఖ ప్రజ్ఞాశాలి. తన 8వ ఏట నుండీ సంగీతము, నాట్యము, 13వ ఏట నుండి వీణావాదనము, 19వ ఏట చిత్రలేఖనము మున్నగు కళలందు ఆరితేరినారు. గాత్రము, వీణ, నాట్యము లందు రాష్ట్రస్థాయి కళాకారిణిగా పలు పతకాలు సాధించారు. తన 21వ ఏట (ఆంధ్రప్రదేశ్) ప్రభుత్వమునందలి సాంఘిక సంక్షేమశాఖనందు వృత్తి రీత్యా అడుగిడినా ప్రవృత్తిరీత్యా మనోవిజ్ఞాన శాస్త్రములోనే అందరికీ సుపరిచితులు. 2010-11 వ సంవత్సరములో తి.తి.దే.., బధిర పిల్లల "శ్రవణం" నందు సైకాలజిస్ట్ గా పొరుగు సేవలు అందించారు. ఈ శాస్త్రమునందు 2010-11నందు "నేషనల్ అవార్డ్" పొందిన "Construction of Ramps In Chittoor District", Projectనకు తన "Voice - Over"ను అందించారు. పలు టి.వి. రేడియో కార్యక్రమాలు కూడా చేశారు. చిన్నతనంనుండీ వివిధ కళలలో ఆసక్తి, ప్రవేశం గలిగినందు వలననేమో "కౌన్సిలింగ్ & రిహ్యాబిలిటేషన్" సైకాలజిస్టుగా ఎంతోమంది మానసిక రుగ్మతలను బాగుపరచగలుగుచున్నారు.© 2017,www.logili.com All Rights Reserved.