ఈ "తాతమాట - వరాలమూట" బాలల కథల పుస్తకంలో ఇరవై అయిదు కథలున్నాయి. ప్రతి కథ ఆసక్తికరంగా చదివించే గుణం కలిగి ఆలోచింపజేసేదిగా ఉంది. పిల్లలు చేయాల్సిన పనులేవో - చేయరానివేవో... భవిష్యత్తు బంగారం కావడానికి బాల్యంలోనే తమను తాము ఎలా మలచుకోవాలో... సరళంగా, సూటిగా, పిల్లల హృదయాలకు హత్తుకొనేలా ఉన్నాయి ఈ కథలు. సమాజం పట్ల బాధ్యతను మనుషుల పట్ల ప్రేమను పెంచుతాయి ఈ కథలని నేను మనఃపూర్వకంగా నమ్ముతున్నాను.
ఇలా ఈ పుస్తకంలోని కథలన్నీ పిల్లల్ని మంచివైపు నడిపించే బాధ్యతాయుతమైన కర్తవ్యాన్ని నిర్వర్తింపజేసే కథలే. ప్రతి కథ పిల్లలకు మంచి మార్గం చూపించేదే. ప్రతి కథకు చక్కని, ఆకర్షణీయమైన బొమ్మలు పిల్లలను ఆకట్టుకుంటాయి. చిన్న చిన్న వాక్యాలతో, తేలిక పదాలతో పిల్లలు చదువుకోవడానికి అనువుగా వారి స్థాయికి తగిన విధంగా చిత్రించిన రచయిత నేర్పు ప్రశంసనీయం. పిల్లల కోసం రాయడం అంత సులభమైన పని కాదని.. అత్యంత నేర్పుతో నిర్వహించాల్సిన బాధ్యతాయుతమైన కర్తవ్యమని ఈ కథలు చదివితే తెలుస్తుంది. పిల్లల కోసం ఇంత మంచి కథలు రాసిన మిత్రులు బెలగాం భీమేశ్వరరావు గారు పిల్లల కోసం ప్రత్యేకించి బాలసాహిత్యాన్ని ప్రచురిస్తున్న "విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్" వారు అభినందనీయులు.
- గంటేడ గౌరునాయుడు
ఈ "తాతమాట - వరాలమూట" బాలల కథల పుస్తకంలో ఇరవై అయిదు కథలున్నాయి. ప్రతి కథ ఆసక్తికరంగా చదివించే గుణం కలిగి ఆలోచింపజేసేదిగా ఉంది. పిల్లలు చేయాల్సిన పనులేవో - చేయరానివేవో... భవిష్యత్తు బంగారం కావడానికి బాల్యంలోనే తమను తాము ఎలా మలచుకోవాలో... సరళంగా, సూటిగా, పిల్లల హృదయాలకు హత్తుకొనేలా ఉన్నాయి ఈ కథలు. సమాజం పట్ల బాధ్యతను మనుషుల పట్ల ప్రేమను పెంచుతాయి ఈ కథలని నేను మనఃపూర్వకంగా నమ్ముతున్నాను. ఇలా ఈ పుస్తకంలోని కథలన్నీ పిల్లల్ని మంచివైపు నడిపించే బాధ్యతాయుతమైన కర్తవ్యాన్ని నిర్వర్తింపజేసే కథలే. ప్రతి కథ పిల్లలకు మంచి మార్గం చూపించేదే. ప్రతి కథకు చక్కని, ఆకర్షణీయమైన బొమ్మలు పిల్లలను ఆకట్టుకుంటాయి. చిన్న చిన్న వాక్యాలతో, తేలిక పదాలతో పిల్లలు చదువుకోవడానికి అనువుగా వారి స్థాయికి తగిన విధంగా చిత్రించిన రచయిత నేర్పు ప్రశంసనీయం. పిల్లల కోసం రాయడం అంత సులభమైన పని కాదని.. అత్యంత నేర్పుతో నిర్వహించాల్సిన బాధ్యతాయుతమైన కర్తవ్యమని ఈ కథలు చదివితే తెలుస్తుంది. పిల్లల కోసం ఇంత మంచి కథలు రాసిన మిత్రులు బెలగాం భీమేశ్వరరావు గారు పిల్లల కోసం ప్రత్యేకించి బాలసాహిత్యాన్ని ప్రచురిస్తున్న "విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్" వారు అభినందనీయులు. - గంటేడ గౌరునాయుడు© 2017,www.logili.com All Rights Reserved.