మన దేశ జనాభాలో 48శాతం స్త్రీలున్నట్లు గణాంకాలు చెపుతున్నాయి. 52శాతం పురుషులున్నప్పటికి - పనిచేసే యువశక్తిని పరిగణలోకి తీసుకుంటే, అది 64శాతం ఉంది. అంటే కేవలం 36శాతం మాత్రమే వృద్ధులు. ఈ గణాంకాలతోపాటు, 2004 జనవరిలో పనిదొరకని/ఉపాధిలేని వయోజనులను సర్వే చేసినపుడు ఇంకా ఆశ్చర్యకరమైన గణాంకాలు నమోదయ్యాయి. నగరాలూ - పట్టణాలలో 19 - 50 సంవత్సాల మధ్య వయసు స్త్రీల శాతం అధికంగా ఉండటం: వీరిలోనూ దాదాపు 33శాతం గృహిణులుగానే జీవితం గడిపేస్తూ ఉండటం.
పని చేయగలిగే సామర్ధ్యం ఉండీ - కొద్దిపాటి వెసులుబాటును/ఆసరా కల్పించినా తమ స్వంతకాళ్ళపై తాము నిలబడగలమన్న స్త్రీల ఆత్మ విశ్వాసం నిజంగా ప్రశంసనీయం అయితే, వారికీ తగినన్ని వనురులు ఈ దేశంలో లేవా? ఉండీ అందుబాటులో లేవా? అనే ప్రశ్నలు వేసుకుంటే - రెండోదే ఎక్కువ మందిని కలవరపరుస్తుంది.
ప్రధానవనరు - 'చిత్తశుద్ధి'. ఆర్ధికంగా ఆసరా, ఇతురుల ప్రోత్సాహం... వంటివన్నీ తరువాత స్థానాల్లోనే ఉన్నాయని నిపుణుల అంచనా! ఇంత చిత్తశుద్ధి గలిగిన స్త్రీలకు నిజంగా స్వయం ఉపాధికీ తగిన అవకాశాలు మనం కల్పించగలుగుతున్నామా? అనే ప్రశ్న వేసుకుంటే "అవకాశాల సంగతి అలా ఉంచండి! అసలు మహిళలు చేపట్టగల ఎన్నో చిన్నతరహా - కుటీర పరిశ్రమల గురించిన సమాచారమే వారికీ అందుబాటులో ఉండడంలేదు"... అబేడు నిర్వివాదాంశం, నిజం కూడా!
మహిళల మహత్తర శక్తికి ఆలంబనగా నిలవగలిగే పరిశ్రమలకు సంబంధించిన సమాచారం ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. అవసమైన యంత్రాలుగాని, పరికరాలుగాని లభించే ప్రదేశాల చిరునామాలు, మహిళా పరిశ్రమలను ప్రోత్సహించే ప్రభుత్వ పధకాలు... ఇవన్నీ ఇందులో ఇచ్చాము! ఈ పుస్తకం ఉపయోగించుకోవడంలోనే మీ ప్రధాన విజ్ఞత ఆధారపడి ఉందని మా విశ్వాసం
మన దేశ జనాభాలో 48శాతం స్త్రీలున్నట్లు గణాంకాలు చెపుతున్నాయి. 52శాతం పురుషులున్నప్పటికి - పనిచేసే యువశక్తిని పరిగణలోకి తీసుకుంటే, అది 64శాతం ఉంది. అంటే కేవలం 36శాతం మాత్రమే వృద్ధులు. ఈ గణాంకాలతోపాటు, 2004 జనవరిలో పనిదొరకని/ఉపాధిలేని వయోజనులను సర్వే చేసినపుడు ఇంకా ఆశ్చర్యకరమైన గణాంకాలు నమోదయ్యాయి. నగరాలూ - పట్టణాలలో 19 - 50 సంవత్సాల మధ్య వయసు స్త్రీల శాతం అధికంగా ఉండటం: వీరిలోనూ దాదాపు 33శాతం గృహిణులుగానే జీవితం గడిపేస్తూ ఉండటం. పని చేయగలిగే సామర్ధ్యం ఉండీ - కొద్దిపాటి వెసులుబాటును/ఆసరా కల్పించినా తమ స్వంతకాళ్ళపై తాము నిలబడగలమన్న స్త్రీల ఆత్మ విశ్వాసం నిజంగా ప్రశంసనీయం అయితే, వారికీ తగినన్ని వనురులు ఈ దేశంలో లేవా? ఉండీ అందుబాటులో లేవా? అనే ప్రశ్నలు వేసుకుంటే - రెండోదే ఎక్కువ మందిని కలవరపరుస్తుంది. ప్రధానవనరు - 'చిత్తశుద్ధి'. ఆర్ధికంగా ఆసరా, ఇతురుల ప్రోత్సాహం... వంటివన్నీ తరువాత స్థానాల్లోనే ఉన్నాయని నిపుణుల అంచనా! ఇంత చిత్తశుద్ధి గలిగిన స్త్రీలకు నిజంగా స్వయం ఉపాధికీ తగిన అవకాశాలు మనం కల్పించగలుగుతున్నామా? అనే ప్రశ్న వేసుకుంటే "అవకాశాల సంగతి అలా ఉంచండి! అసలు మహిళలు చేపట్టగల ఎన్నో చిన్నతరహా - కుటీర పరిశ్రమల గురించిన సమాచారమే వారికీ అందుబాటులో ఉండడంలేదు"... అబేడు నిర్వివాదాంశం, నిజం కూడా! మహిళల మహత్తర శక్తికి ఆలంబనగా నిలవగలిగే పరిశ్రమలకు సంబంధించిన సమాచారం ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. అవసమైన యంత్రాలుగాని, పరికరాలుగాని లభించే ప్రదేశాల చిరునామాలు, మహిళా పరిశ్రమలను ప్రోత్సహించే ప్రభుత్వ పధకాలు... ఇవన్నీ ఇందులో ఇచ్చాము! ఈ పుస్తకం ఉపయోగించుకోవడంలోనే మీ ప్రధాన విజ్ఞత ఆధారపడి ఉందని మా విశ్వాసం© 2017,www.logili.com All Rights Reserved.