సంయమనం, నింపాదితనం కలగలిసిన వ్యక్తిత్వం రహమతుల్లాది. ఇది అతని రచనా వ్యాసాంగానికి ఒక నిండుదనాన్ని ఇచ్చింది. జీవితంలోనూ, సాహిత్య వ్యాసాంగంలోనూ వేగిరపాటు లేదు. ఆలోచనాత్మకంగా వ్యవహరించే ధోరణి ఉంది. సమాజంలోని బహుళపార్శ్వల్ని ఆవేశకావేశాలకి లోనుకాకుండా గమనించే దృష్టి నైశిత్యం వుంది. వైరుధ్యాల మధ్యన సాగే బతుకు యానంలోని సౌందర్యాన్ని పరికించే చూపు వుంది. ఇవ్వన్ని కలిసి అతని సృజనాత్మక వ్యాసాంగానికి ఒక తాత్విక నేపధ్యాన్ని చేకూర్చాయి. ఈ నేపధ్యమే స్త్రీల సంవేదనల్ని ఆర్ద్రమైన రీతిలో కధలుగా మార్చడానికి తోడ్పడింది. ఈ క్రమాన ప్రత్యేకించి ముస్లిం మహిళల జీవితాలలోని బహుముఖకోణాల్ని సున్నితంగా ఆవిష్కరించారు. ఈ ప్రపంచాన్ని సౌందర్యమంతం, దీప్తివంతం చేస్తున్న మహిళలకి రహమతుల్లా ప్రకటిస్తున్న నీరాజనమిది. ఆడవాళ్ళపట్ల ఆర్ద్రంగా మెలగాల్సిన అవసరాన్ని మగవాళ్ళకి గుర్తుచేసే కధలివి. అందుకే ఈ పుస్తకాన్ని పాఠకుల ముందుకు తీసుకువస్తున్నాం. ఈ కధలు వారి మనోవైశాల్యాన్ని విస్తరింపజేస్తాయన్నది మా ఆశ.
- బా రహమతుల్లా
సంయమనం, నింపాదితనం కలగలిసిన వ్యక్తిత్వం రహమతుల్లాది. ఇది అతని రచనా వ్యాసాంగానికి ఒక నిండుదనాన్ని ఇచ్చింది. జీవితంలోనూ, సాహిత్య వ్యాసాంగంలోనూ వేగిరపాటు లేదు. ఆలోచనాత్మకంగా వ్యవహరించే ధోరణి ఉంది. సమాజంలోని బహుళపార్శ్వల్ని ఆవేశకావేశాలకి లోనుకాకుండా గమనించే దృష్టి నైశిత్యం వుంది. వైరుధ్యాల మధ్యన సాగే బతుకు యానంలోని సౌందర్యాన్ని పరికించే చూపు వుంది. ఇవ్వన్ని కలిసి అతని సృజనాత్మక వ్యాసాంగానికి ఒక తాత్విక నేపధ్యాన్ని చేకూర్చాయి. ఈ నేపధ్యమే స్త్రీల సంవేదనల్ని ఆర్ద్రమైన రీతిలో కధలుగా మార్చడానికి తోడ్పడింది. ఈ క్రమాన ప్రత్యేకించి ముస్లిం మహిళల జీవితాలలోని బహుముఖకోణాల్ని సున్నితంగా ఆవిష్కరించారు. ఈ ప్రపంచాన్ని సౌందర్యమంతం, దీప్తివంతం చేస్తున్న మహిళలకి రహమతుల్లా ప్రకటిస్తున్న నీరాజనమిది. ఆడవాళ్ళపట్ల ఆర్ద్రంగా మెలగాల్సిన అవసరాన్ని మగవాళ్ళకి గుర్తుచేసే కధలివి. అందుకే ఈ పుస్తకాన్ని పాఠకుల ముందుకు తీసుకువస్తున్నాం. ఈ కధలు వారి మనోవైశాల్యాన్ని విస్తరింపజేస్తాయన్నది మా ఆశ. - బా రహమతుల్లా
© 2017,www.logili.com All Rights Reserved.