ఏ కధలైన, మనకు మనంగా తెలుసుకునే వయస్సులో, జీవిత అనుభవాలతో బాటు, ఇతరుల అనుభవాలు, పెద్దల సందేశాలు, ఇలా ఎన్నో మన మార్గాన్ని సుగమం చేస్తాయి. అలా పనికొచ్చేవెన్నో మనకు పెద్దలు, గురుతుల్యులు మనకోసం కధల రూపంలోనో, నీతుల రూపంలోనే విడిచి వెళ్లారు. అటువంటి సంపదలోంచి తీసుకున్నవే ఈ కధలు.
మత ప్రవక్త మహమ్మద్ జీవితం, ఇస్లాము మతం ఏర్పడ్డ కొన్నాళ్ళ తరువాత, కొందరు సూఫీలుగా ప్రసిద్ధి చెందారు. వారు షియాలు, సున్నీలు, ఎవరైనా కావచ్చు. ఏవో మంత్రాలతోనో, ప్రార్ధనలతోనో, పవిత్ర స్థలాల్లో గడపటం కంటే, దేవుడ్ని చేరే, దగ్గర మార్గాల అన్వేషకులు వీరు. తనలో తానే దేవుడ్ని దర్శించుకోవచ్చన్నది వీరి తత్వం. ఆ అన్వేషణలో లీనమై నృత్యం చేసేవారున్నారు. పాటలు పాడేవారున్నారు. కధలు కవిత్వం చెప్పేవారూ ఉన్నారు. ఈ విధంగా సూఫీకీ అనేక నిర్వచనాలున్నాయి. ఏ నిర్వచనం కూడా సర్వ సమగ్రం కాదు. అవన్నీ సూఫీ మార్గాన్ని సూచించేవే. దేవుడికీ దగ్గరవటం, ఆధ్యాత్మిక ఆనందం, ఆరాధన, అన్నది ముఖ్య సిద్ధాంతం. ఆ సూఫీ సారాంశాన్ని సామాన్యులకీ సైతం అర్ధం అయ్యేలా చెప్పేందుకు, సత్య మార్గంలో ఎవరైనా పయనించేందుకు దోహదపడేందుకు పనికొచ్చే కధలు. వారి జీవితానుభవంలోంచి చెప్పినవే ఇందులోని సూఫీ కధలు.
జెన్ అంటే జీవితం. శతాబ్దాలుగా మునులు, యోగులు మానవాళి బాగుకోసం బోధిస్తూ వస్తున్న సందేశం. అలా అని ఈ కధలు ఏదైనా సమస్యకు సమాధాన మిచ్చేవి కావు. సమస్యని అర్ధం చేసుకుందుకు, సమాధాన్ని ఎవరికీ వారు తెలిసుకుందుకు పనికొచ్చే కధలు. అందులో మన ప్రతిబింబాల్ని మానమే చూసుకోవచ్చు. మనుషుల మధ్య వారధిలాంటి ఈ కధలు చదివాక ఇటువంటి కధల్ని ఇంకా చదవాలన్న కుతూహలం మీకు కలుగుతే అదే ఈ కధల ఉద్దేశం, ఆకర్షణ కూడా. ఇటువంటి కధల్ని పిల్లలకి చెప్పడం ద్వారా వారిలో తెలివితేటలు పెంపొందే అవకాశం ఉంటుంది.
- ముకుంద రామారావు
ఏ కధలైన, మనకు మనంగా తెలుసుకునే వయస్సులో, జీవిత అనుభవాలతో బాటు, ఇతరుల అనుభవాలు, పెద్దల సందేశాలు, ఇలా ఎన్నో మన మార్గాన్ని సుగమం చేస్తాయి. అలా పనికొచ్చేవెన్నో మనకు పెద్దలు, గురుతుల్యులు మనకోసం కధల రూపంలోనో, నీతుల రూపంలోనే విడిచి వెళ్లారు. అటువంటి సంపదలోంచి తీసుకున్నవే ఈ కధలు. మత ప్రవక్త మహమ్మద్ జీవితం, ఇస్లాము మతం ఏర్పడ్డ కొన్నాళ్ళ తరువాత, కొందరు సూఫీలుగా ప్రసిద్ధి చెందారు. వారు షియాలు, సున్నీలు, ఎవరైనా కావచ్చు. ఏవో మంత్రాలతోనో, ప్రార్ధనలతోనో, పవిత్ర స్థలాల్లో గడపటం కంటే, దేవుడ్ని చేరే, దగ్గర మార్గాల అన్వేషకులు వీరు. తనలో తానే దేవుడ్ని దర్శించుకోవచ్చన్నది వీరి తత్వం. ఆ అన్వేషణలో లీనమై నృత్యం చేసేవారున్నారు. పాటలు పాడేవారున్నారు. కధలు కవిత్వం చెప్పేవారూ ఉన్నారు. ఈ విధంగా సూఫీకీ అనేక నిర్వచనాలున్నాయి. ఏ నిర్వచనం కూడా సర్వ సమగ్రం కాదు. అవన్నీ సూఫీ మార్గాన్ని సూచించేవే. దేవుడికీ దగ్గరవటం, ఆధ్యాత్మిక ఆనందం, ఆరాధన, అన్నది ముఖ్య సిద్ధాంతం. ఆ సూఫీ సారాంశాన్ని సామాన్యులకీ సైతం అర్ధం అయ్యేలా చెప్పేందుకు, సత్య మార్గంలో ఎవరైనా పయనించేందుకు దోహదపడేందుకు పనికొచ్చే కధలు. వారి జీవితానుభవంలోంచి చెప్పినవే ఇందులోని సూఫీ కధలు. జెన్ అంటే జీవితం. శతాబ్దాలుగా మునులు, యోగులు మానవాళి బాగుకోసం బోధిస్తూ వస్తున్న సందేశం. అలా అని ఈ కధలు ఏదైనా సమస్యకు సమాధాన మిచ్చేవి కావు. సమస్యని అర్ధం చేసుకుందుకు, సమాధాన్ని ఎవరికీ వారు తెలిసుకుందుకు పనికొచ్చే కధలు. అందులో మన ప్రతిబింబాల్ని మానమే చూసుకోవచ్చు. మనుషుల మధ్య వారధిలాంటి ఈ కధలు చదివాక ఇటువంటి కధల్ని ఇంకా చదవాలన్న కుతూహలం మీకు కలుగుతే అదే ఈ కధల ఉద్దేశం, ఆకర్షణ కూడా. ఇటువంటి కధల్ని పిల్లలకి చెప్పడం ద్వారా వారిలో తెలివితేటలు పెంపొందే అవకాశం ఉంటుంది. - ముకుంద రామారావు
© 2017,www.logili.com All Rights Reserved.