నిర్వికల్పసంగీతం(1986), ఒంటరిచేలమధ్య ఒక్కత్తే మన అమ్మ(1995), పునర్యానం (2004), కోకిల ప్రవేశించేకాలం (2009) తరువాత వాడ్రేవు చినవీరభద్రుడు వెలువరిస్తున్న కవితా సంపుటి ఈ 'నీటిరంగుల చిత్రం'.
గత ఐదేళ్ళుగా రాస్తూ వచ్చిన ఈ కవితల్లో కవి తనకు జీవితసత్యం, సౌందర్యం, జీవితానందం సిద్ధించే మెలకువ కోసం నిరంతర జాగరూకతతో అన్వేషిస్తూండడం కనిపిస్తుంది.
అటువంటి జాగృతక్షణాల్లో తన జీవితం తనకు పూర్తిగా కరతలామకమైందనే ఎరుక ఈ కవిత్వంలోని ప్రధాన సూత్రం. అటువంటి వేళల్లో తాను తన జీవితసారాంశంలోకి నేరుగా చొచ్చుకుపోయినట్లుగా కలిగిన ప్రగాఢానుభూతిని అక్షరీకరించే ప్రయత్నం, ప్రయోగం ఈ కవిత్వం.
కవిత్వం మాటల్నే ఆశ్రయించుకుని ఉన్నప్పటికీ అది మాటల్లో మాత్రమే లేదనీ, విద్యుచ్ఛక్తి రాగితీగ లోపలనుంచి కాకుండా రాగితీగ వెంబడి ప్రసరించినట్లే కవిత్వం కూడా మాటల్లోంచి కాకుండా మాటలచుట్టూ ప్రసరిస్తుందనే గ్రహింపు ఈ కవిత్వం పొడుగునా కనిపిస్తుంది.
తన కవిత్వ పరిణామం గురించీ, తన మీద ప్రభావం చూపించిన కవుల గురించీ తన అన్వేషణ గురించీ చినవీరభద్రుడు యువ భావుకుడూ, సాహిత్య జిజ్ఞాసి ఆదిత్య కొర్రపాటితో చేసిన సంభాషణ ఈ సంపుటికి అదనపు ఆకర్షణ.
నిర్వికల్పసంగీతం(1986), ఒంటరిచేలమధ్య ఒక్కత్తే మన అమ్మ(1995), పునర్యానం (2004), కోకిల ప్రవేశించేకాలం (2009) తరువాత వాడ్రేవు చినవీరభద్రుడు వెలువరిస్తున్న కవితా సంపుటి ఈ 'నీటిరంగుల చిత్రం'. గత ఐదేళ్ళుగా రాస్తూ వచ్చిన ఈ కవితల్లో కవి తనకు జీవితసత్యం, సౌందర్యం, జీవితానందం సిద్ధించే మెలకువ కోసం నిరంతర జాగరూకతతో అన్వేషిస్తూండడం కనిపిస్తుంది. అటువంటి జాగృతక్షణాల్లో తన జీవితం తనకు పూర్తిగా కరతలామకమైందనే ఎరుక ఈ కవిత్వంలోని ప్రధాన సూత్రం. అటువంటి వేళల్లో తాను తన జీవితసారాంశంలోకి నేరుగా చొచ్చుకుపోయినట్లుగా కలిగిన ప్రగాఢానుభూతిని అక్షరీకరించే ప్రయత్నం, ప్రయోగం ఈ కవిత్వం. కవిత్వం మాటల్నే ఆశ్రయించుకుని ఉన్నప్పటికీ అది మాటల్లో మాత్రమే లేదనీ, విద్యుచ్ఛక్తి రాగితీగ లోపలనుంచి కాకుండా రాగితీగ వెంబడి ప్రసరించినట్లే కవిత్వం కూడా మాటల్లోంచి కాకుండా మాటలచుట్టూ ప్రసరిస్తుందనే గ్రహింపు ఈ కవిత్వం పొడుగునా కనిపిస్తుంది. తన కవిత్వ పరిణామం గురించీ, తన మీద ప్రభావం చూపించిన కవుల గురించీ తన అన్వేషణ గురించీ చినవీరభద్రుడు యువ భావుకుడూ, సాహిత్య జిజ్ఞాసి ఆదిత్య కొర్రపాటితో చేసిన సంభాషణ ఈ సంపుటికి అదనపు ఆకర్షణ.© 2017,www.logili.com All Rights Reserved.